చిలకలూరిపేటలో హ్యాపీ బై స్టార్టప్ సక్సెస్

చిలకలూరిపేటలో హ్యాపీ బై స్టార్టప్ సక్సెస్

Saturday January 02, 2016,

2 min Read

ఓ లక్షమందికి అటు ఇటుగా జనాభా ఉండే ఓ సెమీ అర్భన్ టౌన్ చిలకలూరిపేట. దాదాపు ఏడాది క్రితం అక్కడ మొదలైన ఓ స్టార్టప్ ఇప్పుడు రోజుకి పది ఆర్డర్లతో దూసుకు పోతోంది. కిరణా,కాయగూరలతో పాటు ఇంటికి కావల్సిన అన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చిందీ స్టార్టప్.

ఇది మొదలు

బిటెక్ పూర్తి చేసిన కారంశెట్టి సాయి ప్రవీణ్ అందరిలాగే కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసి ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ట్రెయినీగా జాయిన్ అయిపోయారు. అయితే కాలేజీ రోజుల నుంచే స్టార్టప్ ల గురించి తెలుసుకొని తాను కూడా ఓ సంస్థను ప్రారంభించాలని అనుకున్నారు. ఉద్యోగం చేస్తున్నంత కాలం ఏ స్టార్టప్ పెట్టాలి అనే దానిపైనే మనసు పెట్టారు.

“ఓసారి మా ఊళ్లో బ్యాంక్ పనిమీద వెళ్లినప్పుడు అక్కడున్న ఓ పెద్ద మనిషితో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది,” సాయి ప్రవీణ్

ఆరోజు ఆ పెద్దాయన చెప్పిన మాటల్లోని సమస్యకు పరిష్కారం చూపించాలనుకున్నా. రోజులో ఎక్కువ సమయం కిరణా, కాయగూరలు కొనడంలోనే సరిపోతుందని అతను నాతో అన్నారు. టైం వేస్ట్ కాకుండా ఇంటికే సరుకులు తెచ్చే విధానం ఉంటే బాగుండు అని అతనన్నారట. అలా మొదలైందే హ్యాపీ బై డాట్ ఇన్. ఉద్యోగం వదిలేసి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు.దీనికి ప్రారంభ పెట్టుబడి 8 వేల రూపాయలు

image


హ్యాపీ బై పనితీరు

స్థానికి అవసరాలకు అనుగుణంగా దీన్ని డిజైన్ చేశారు. ఫ్లిప్ కార్ట్ ను ఆదర్శంగా తీసుకున్నప్పటికీ ఆ స్థాయిలో ఇక్కడ అవసరాలు లేవు. దీంతో స్థానికంగా దొరికే గ్రాసరీని జనం ముందుకు తీసుకొచ్చారు. స్థానిక కిరాణా షాపులతో టై అప్ చేసుకున్నారు. ఆన్ లైన్ లో కస్టమర్ల దగ్గర ఆర్డర్లు తీసుకొని ఆ లిస్ట్ షాపులకు పంపుతారు. తర్వాత డెలివరీ బాయ్ సామాన్లు పిక్ చేసుకొని కస్టమర్లకు అందిస్తారు. కస్టమర్ల అవసరార్థం క్యాష్ ఆన్ డెలివరీ (COD) ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ప్రస్తుతానికి సరాసరి రోజుకి పది ఆర్డర్లు వస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఈ సర్వీసును అందుబాటులో ఉంచారు. 100మంది రిజిస్ట్రర్ యూజర్లున్నారు. రోజూ రిపీటెడ్ కస్టమర్లు ఉంటున్నారు. ఇంటికి కావల్సిన ఎలక్ట్రికల్ , ప్లంబర్ లాంటి సర్వీసును కూడా ఇటీవలే ప్రారంభించారు.

image


హ్యాపీ బై టీం

సాయి ప్రవీణ్ కారంశెట్టి హ్యాపీ బై ఫౌండర్. వెబ్ సైట్ తోపాటు టెక్నికల్ , మార్కెట్ రీసెర్చి లాంటివి తానే చూసుకుంటారు. బీటెక్ పూర్తి చేసిన సాయి- కాలేజీ రోజుల నుంచే స్టార్టప్ ఆలోచన ఉంది. దాదాపు ఏడాది పాటు ఉద్యోగం చేస్తూ మార్కెట్ రీసెర్చి చేశారు. అనంతరం దీన్ని ప్రారంభించారు. సాయి ప్రవీణ్ తమ్ముడు హేమంత్ డెలివరీ మేనేజ్మెంట్ చూసుకుంటారు. వీరితో పాటు సాయి వాళ్ల మదర్ కూడా ఇంటి నుంచి కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. మరో నలుగురు ఆఫ్ రోల్ డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు.

image


సవాళ్లు,భవిష్యత్ ప్రణాలికలు

చిలకలూరి పేట లో స్టార్టప్ ప్రారంభించడం ఓ పెద్ద సవాల్. గ్రాసరీ డెలివరీ కి కొన్ని పరిమితులున్నాయి. అయితే ఉన్నకస్టమర్లతో మేనేజ్ చేస్తూ దీన్ని అధిగమిస్తామంటున్నారు. డెలివరీ తో ఆగిపోకుండా మరికొన్ని సర్వీసులను అందించడం ద్వారా స్థానికంగా ఉన్న పరిమితులను అధిగమిస్తామని సాయి అంటున్నారు. ఈ ఏడాది లో మరో 10 ప్రాంతాల్లో తమ స్టార్టప్ ను విస్తరిస్తామని అంటున్నారు. తమది త్రీ టైర్ సిటీ కావడం వల్ల తమ టార్గెట్ కూడా అదే అంటన్నారు సాయి.

“తామీ స్థాయిలో ఉండటానికి ఎల్ల వేళలా సాయం అందిస్తున్న అమ్మ మద్దతు ఎంతైనా ఉంది. ఆమె అందించే ప్రోత్సాహం తో మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తామని ముగించారు సాయి.”

వెబ్ సైట్