ప్రపంచాన్ని ఏలిన అక్కా చెల్లెళ్లు..!!

ప్రపంచాన్ని ఏలిన అక్కా చెల్లెళ్లు..!!

Sunday January 17, 2016,

4 min Read

అన్న‌ద‌మ్ముల అనుబంధం, త‌మ్ముడు, మా అన్న‌య్య బంగారం! ఇలాంటి సినిమాలు చాలానే వ‌చ్చాయి! ఏం..? అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు అన్నాద‌మ్ముల‌ మ‌ధ్యే ఉంటాయా? అక్కాచెల్లెళ్ల మ‌ధ్య ప్రేమానురాగాలు ఉండ‌వా? అక్కా, చెల్లి క‌లిస్తే అద్భుతాలు సృష్టించ‌లేరా? ఎందుకు సృష్టించ‌లేరు? సిస్ట‌ర్ హుడ్ విష‌యంలో ప్రపంచాన్ని ఆక‌ర్షించిన 14 సిస్ట‌ర్ పెయిర్స్ గురించి ఈ కథనం..

image


వీనస్, సెరెనా విలియమ్స్

పరిచయం అక్కర్లేని పేర్లు. అక్కాచెల్లెళ్లిద్దరిదీ సూపర్ పెయిర్ అని చెప్పాలి! ఇద్దరూ కలిసి ఏకంగా 28 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (సింగిల్స్) నెగ్గారు. తల్లిదండ్రులే వాళ్ల కోచ్ లు. అద్భుత ప్రతిభా పాటవాలతో విమెన్ టెన్నిస్ ముఖచిత్రాన్నే మార్చేశారు విలియమ్ సిస్టర్స్. జంటగా 22 డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ కైవసం చేసుకున్నారంటే- వాళ్లది రాకింగ్ సిస్టర్ పెయిర్ అని చెప్పకతప్పదు.

బర్ఖా, బహర్ దత్

ప్రఖ్యాత జర్నలిస్టు ప్రభా దత్ కూతుళ్లే బర్ఖా, బహర్ దత్. బర్ఖా దత్ భారత్ లో పేరున్న మహిళా జర్నలిస్టు. కార్గిల్ వార్ ను కళ్లకు కట్టినట్టు చేసిన కవరేజీతో బర్ఖా పేరు దేశమంతా మారుమోగింది. పద్మశ్రీ సహా ఎన్నెన్నో అవార్డులు వచ్చాయి. ఆమె సోదరి బహర్ దత్ కూడా తక్కువేమీ కాదు. 2006లో గ్రీన్ ఆస్కార్ విన్నర్ ఆమె. బహర్ దత్ బయాలజిస్టు, ఎన్విరాన్ మెంటల్ జర్నలిస్టు. గ్రీన్ వార్స్ బుక్ రచయిత. తల్లిలాగే అక్కాచెల్లెళ్లిద్దరూ మేథావులు.

కరిష్మా, కరీనా కపూర్

బాలీవుడ్ లో చాలా మంది సిస్టర్ పెయిర్స్ ఉన్నా- కరిష్మా, కరీనాలది ప్రత్యేకమైన అనుబంధం. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. కరీనాను ఎప్పుడు కదిపినా అక్క గురించే చెప్తుంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీని ఏలినా- ఎప్పడూ వారి మధ్య కించిత్ ద్వేషం గానీ అసూయ గానీ రాలేదు.

బియోన్స్, సోలాంజే నోల్స్

అమెరికన్ సింగర్ బియోన్స్ పేరు చెప్తే ఠక్కున గ్రామీ అవార్డే గుర్తొస్తుంది. ఏకంగా 20 గ్రామీలను గెలచుకున్నారామె. ముద్దుపేరు క్వీన్ బీ. ఆల్ గాళ్స్ బ్యాండ్ డెస్టినీ చైల్డ్ లో ఆమె లీడ్ సింగర్. ఆర్ అండ్ బీ, పాప్ లో సోలోగా కూడా రాణించారు. చెల్లి సోలాంజే నోల్స్ కూడా అక్కను ఆదర్శంగా తీసుకుంది. ఇద్దరూ బాగా క్లోజ్. ఫ్యామిలీ రన్ చేసే ఫ్యాషన్ బిజినెస్ కోసం అక్కాచెల్లెళ్లు కలిసి మోడలింగ్ కూడా చేశారు.

బ్రోంటే సిస్టర్స్

చార్లొటే, ఎమిలీ, ఆనే. 19వ శతాబ్దానికి చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు మంచి రచయితలు. ముగ్గురికీ ఇల్లే బడి! జీవితమంతా ఒంటరిగానే గడిపారు. యుక్త వయసులోనే స్టోరీలు రాయడం మొదలుపెట్టారు. చార్లొటే రాసిన జేన్ ఐర్, ఎమిలీ నవల ఉథెరింగ్ హైట్స్, ఆనే రచించిన ఆగ్నెస్ గ్రే- గొప్ప క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి.

లతా మంగేష్కర్, ఆశా భోంస్లే

లతా వయసు 86. ఆశా భోంస్లేకు 82 ఏళ్లు. ఈ వయసులో కూడా ఈ అక్కాచెల్లెళ్ల గొంతు నుంచి అమృతం జాలువారుతుంది. భారత సంగీత ప్రపంచంలో ఇద్దరిదీ ప్రత్యేక స్థానం. లతాజీ వెయ్యి పైచిలుకు హిందీ సినిమాలకు పాటలు పాడారు. భారతరత్న అవార్డు గ్రహీత. ఇక ఆశా భోంస్లే మోస్ట్ రికార్డెడ్ ఆర్టిస్టుగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. లతా ఆశాల మధ్య పొరపచ్చాలు ఉన్నట్టు బయట టాక్ ఉన్నా- ఇద్దరినీ చూస్తే మాత్రం అలా కనిపించరు. ఎప్పుడూ అన్యోన్యంగా మెదులుతారు. అన్నట్టు ఇద్దరివీ పక్కపక్క ఫ్లాట్సేనట..

తాషి, నాన్సీ మాలిక్

ఇద్దరూ ట్విన్స్. మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి సిస్టర్ పెయిర్. చిన్న వయసులోనే ఎక్స్ ప్లోరర్స్ గ్రాండ్ స్లామ్ కంప్లీట్ చేసిన సౌత్ ఏషియన్లుగా పేరు తెచ్చుకున్నారు. ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించారు. మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించడమే కాకుండా.. ఉత్తర, దక్షిణ ధ్రువాలను చేరుకున్న చిచ్చర పిడుగులు.

కేట్, పిప్పా మిడిల్టన్

కేట్ మిడిల్టన్. ఇంగ్లండ్ యువరాజు ప్రిన్స్ విలియమ్ సతీమణి. ఆమె చెల్లి ఫిలిప్పా. పిప్పాగా ఫేమస్. అక్క బ్యాక్ గ్రౌండ్ తోనే పిప్పా వెలుగులోకి వచ్చినా- ఆమె కూడా టాలెంటెడే! పిప్పా స్వతహాగా సామాజికవేత్త, రచయిత, కాలమిస్టు. అక్కాచెల్లెళ్లిద్దరూ ఫ్యాషన్ ప్రియులు. ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

దీపికా, అనిషా పదుకోణ్

దీపికా పదుకోణ్. బాలీవుడ్ హీరోయిన్. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకోణ్ కూతురు. చిన్నతనంలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ లోనూ దీపికా పాల్గొంది. తర్వాత ఫ్యాషన్ రంగంలోకి, ఆపై సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైంది. పాపులర్ బ్రాండ్స్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్. డిప్రెషన్ విషయంలోనూ దీపికా పేరు బాగా వినపడింది. దీపికా విషయంలో చెల్లి అనిషా పదుకోణ్ మంచి విమర్శకురాలు. అనిషా గోల్ఫ్ ప్లేయర్. క్రీడల్లో రాణించడానికి శిక్షణ తీసుకుంటోంది.

మాలియా, సాషా ఒబామా

మాలియా(17), సాషా (14). అమెరికా అధ్యక్షుడు ఒబామా గారాల బిడ్డలు. వైట్ హౌస్ లో పెరుగుతున్న ఈ సిస్టర్స్ ప్రపంచమంతటికీ సుపరిచితమే. టీనేజీ పిల్లల్లో అరుదుగా కనిపించే ఆత్మవిశ్వాసం, పట్టుదల వీరి సొంతం. తల్లి మిషెల్ లా మాలియా, సాషా కూడా స్టైల్ ఐకాన్స్.

ట్రావెంకోర్ సిస్టర్స్

పద్మిని, లలిత, రాగిణి- అంటే ఎవరూ గుర్తుపట్టరు. ట్రావెంకోర్ సిస్టర్స్ అంటే వెంటనే మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. తిరువనంతపురంలోని థరావడు కుటుంబానికి చెందినవారు. ముగ్గురూ మంచి నటులు, డాన్సర్లు. దక్షిణ భారత సినిమాలతో పాటు హిందీ ఫిల్మ్స్ లోనూ నటించారు. 1940, 1950ల్లో వెండితెరపై మెరిశారు. సంప్రదాయ నృత్యాల్లో ట్రావెంకోర్ సిస్టర్స్ చాలా పాపులర్.

ఎమిలీ, జూయీ డెస్చానల్

డెస్చానల్ సిస్టర్స్ అమెరికన్ టీవీ షో స్టార్లు. బోన్స్ అనే పాపులర్ క్రైమ్ డ్రామాతో ఎమిలీకి మంచి పేరొచ్చింది. న్యూ గర్ల్ టీవీ షోతో జూయీ పాపులర్ అయిపోయింది. 65వ వార్షిక ఎమ్మీ అవార్డ్స్ లో అక్కాచెల్లెళ్లిద్దరినీ చూస్తే- వారిది ఎంత గొప్ప అనుబంధమో అర్థమవుతుంది.

నోరా జోన్స్, అనౌష్క శంకర్

ఇద్దరికీ తండ్రి ఒక్కడే. తల్లులు వేరు. యుక్త వయసు వచ్చాక గానీ నోరా జోన్స్, అనౌష్క శంకర్ ఒకరినొకరు కలుసుకోలేదు. తల్లిదండ్రులు విడిపోయాక నోరా తల్లి దగ్గరే పెరిగింది. పండిట్ రవిశంకర్ చివరి రోజుల్లో తండ్రి దగ్గర ఉంది. అనౌష్క శంకర్ నాలుగు గ్రామీలకు నామినేట్ అయితే.. నోరా తొమ్మిది గ్రామీలను గెలుచుకుంది. బిల్ బోర్డ్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఈ దశాబ్దపు ఆర్టిస్టుగా తళుక్కుమంది నోరా జోన్స్!

కర్దాషియన్ సిస్టర్స్

లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చెప్పాలంటే వీరి పేర్లు లేకుండా ఫేమ‌స్ సిస్ట‌ర్స్ జాబితాను పూర్తి చేయ‌లేం. కౌర్ట్నీ, కిమ్, ఖోలే. ముగ్గురూ ముగ్గురే! ఫేమ‌స్ అవ‌డానికే పుట్టిన‌ట్టు ఉంటారు. త‌మ అంద‌చందాలు, న‌టన‌తో అమెరిక‌న్ బుల్లితెర‌ను ఏలుతున్నారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల‌ ఆస్తి ఎంతో తెలుసా? 100 మిలియ‌న్ డాల‌ర్లు!

సో! అద‌న్న మాట అమేజింగ్ సిస్ట‌ర్స్ స్టోరీ. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్య‌క్తిత్వ‌మైనా, ఆలోచ‌లన‌లు వేరైనా, కాంపిటీష‌న్ ఉన్నా.. సిస్టర్ హుడ్ విషయంలో మాత్రం వారికి వారే సాటి!!