ఇదో గ్రీన్ 'టి' బ్రిగేడ్ !

ఇదో గ్రీన్ 'టి' బ్రిగేడ్ !

Tuesday January 12, 2016,

2 min Read

చల్లటి సాయంత్రం.. ఉదయం నుంచి ఆఫీసు పనితో అప్పటికే ఒళ్లు హూనమైపోతుంది. వేడివేడి టీ, ఓ రెండు సమోసాలు లాగిస్తే.. రిలాక్స్ అయిపోతామని ఎవరైనా అనుకుంటారు. జాబ్ ఏదైనా సాయంత్రమయ్యే సరికి ఓ మాంచి టీ పడితేగానీ.. ఇంటికి వెళ్లేంత వరకూ మైండ్ యాక్టివ్‌గా ఉండదు. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఓ కప్ ఛాయ్‌కి డెలివర్ చేయమని ఆర్డర్ ఇవ్వండి అంటోంది ఛాయ్.. ఆన్ కాల్ టీం.

అవును మీరు విన్నది నిజమే.. ఆర్డర్ చేస్తే టీ కూడా మనం కోరిన చోటికి తెచ్చి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి స్టార్టప్స్. ఫుడ్ టెక్ డెలివరీలో ఇదో కొత్త ట్రెండ్. జనాల జీవితాలను మరింత సులువు చేస్తున్న ఈ స్టార్టప్స్.. ఇప్పుడు ప్రకృతికి కూడా ఎంతో కొంత సేవ చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికీ స్విగ్గీ, రోడ్ రన్నర్‌ టీమ్స్‌ మనకు రోడ్లపై ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. కానీ వాళ్లందరితో పోలిస్తే మేం విభిన్నం అంటోంది ఛాయ్ పాయింట్. ఎందుకంటే.. ఎలక్ట్రిక్ స్కూటర్లతో వీళ్ల డెలివర్ చేయబోతున్నారు. ఇప్పటికే 60 బ్యాటరీ స్కూటర్లను తమ డెలివరీ ఫ్లీట్‌లో చేర్చుకున్నారు. ఇందుకోసం యాంపియర్ వెహికల్స్, హీరో ఎలక్ట్రిక్‌తో ఈ స్టార్టప్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

image


ఈ డెలివరీ ఫ్లీట్‌ను గ్రీన్ - టి బ్రిగేడ్‌గా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో స్థిరత్వం సాధించిన తర్వాత ముంబై, చెన్నైలో కూడా గ్రీన్ - టి బ్రిగేడ్ తన సేవలను మొదలుపెట్టబోతోంది.

''ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడడం వల్ల పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మా బిజినెస్ మోడల్‌కు కూడా సరిగ్గా సూట్ అవుతుందని అంటున్నారు'' ఛాయ్ పాయింట్ సిఈఓ అములీక్ సింగ్. పెట్రోల్ ధరలపై చేయాల్సిన ఖర్చే కాదు.. మైలేజ్ చూసుకోవడం, లాగ్ బుక్స్ నిర్వాహణ సమస్యల నుంచి కూడా మాకు ఊరట లభిస్తుంది అంటున్నారు. అన్నింటికంటే మరో ముఖ్యమైన విషయం.. వీళ్లకు కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ వల్ల తక్కువ ధరకు ద్విచక్ర వాహలను కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది.

''తక్కువ టికెట్ ఆర్డర్లకు కూడా డెలివర్ చేసేందుకు మాకు సులువుగా ఉంటుంది, ఎందుకంటే.. ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉపయోగం వల్ల మా ఖర్చు బాగా తక్కువవుతుంది అంటున్నారు'' ఛాయ్ పాయింట్ డెలివరీ హెడ్ - యాంగ్‌చెన్

గ్రీన్ టి బ్రిగేడ్ ఉండే ప్లేసులకే వెళ్లి మరీ ఆఫ్టర్ సేల్ సర్వీసులను అందిస్తోంది హీరో ఎలక్ట్రిక్. అవసరమైతే రాబోయే రోజుల్లో విస్తరణ జరిగిన ప్రాంతాల్లోనూ ఈ తరహా సేవలను అందిస్తామంటోంది హీరో ఎలక్ట్రిక్.

రాబోయే రోజుల్లో డెలివరీ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని యాంపియర్ వెహికల్స్ సీఈఓ హేమలతా అన్నామలై అంటున్నారు. ఛాయ్ పాయింట్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు.

యువర్ స్టోరీ అభిప్రాయం

గ్రీన్ రెవెల్యూషన్‌లో డెలివరీ, లాజిస్టిక్స్ కంపెనీలు భాగస్వామ్యం కావడం చాలా ఆనందించాల్సిన విషయమే. అధిక శాతం ఈ-కామర్స్ కంపెనీలన్నీ.. డెలివరీ బాయ్స్ సొంత బైక్స్‌నే డెలివరీ కోసం ఉపయోగిస్తాయి. ఇలాంటి ఆలోచనల వల్ల కంపెనీ స్కూటర్స్ ఉపయోగించేందుకు వెసులుబాటు లభిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వల్ల నిర్వాహణ ఖర్చు అనూహ్యంగా తగ్గుతుందనే విషయాన్ని అమూలిక్ చెబ్తున్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం..

పెట్రోల్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఖర్చు 65 శాతం వరకూ తగ్గుతుంది.

లీటర్ పెట్రోల్ రూ.60 అనుకుందాం. మైలేజీ 50 నుంచి 60 కిలోమీటర్ల వరకూ రావొచ్చు. అదే మైలేజ్ పొందాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఆరు గంటల పాటు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మనం పెట్టే ఖర్చు రూ.5 మాత్రమే. దీన్ని బట్టే ఆలోచించండి.. ఎంత ఖర్చు ఆదా అవుతోందో.. ?