వ్యాపార ప్రారంభానికి వయసు ఆటంకం కాదని నిరూపించిన 70 ఏళ్ల అచ్యుత బచ్చలి

55 ఏళ్ల వయసులో కంపెనీని స్థాపించి దానిని 15 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా నిలపడం అంటే ఆషామాషీ వ్యవహారమేం కాదు. కానీ బలమైన కోరిక ఉంటే లక్ష్య సాధనకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు అచ్యుత బచ్చలి...

వ్యాపార ప్రారంభానికి వయసు ఆటంకం కాదని నిరూపించిన 70 ఏళ్ల అచ్యుత బచ్చలి

Thursday July 02, 2015,

6 min Read

యువర్ స్టోరీ లో మీరు చదువుతున్న యంగ్ అండ్ టర్బో చార్జ్డ్ ఆంట్రప్రెన్యూర్ల కథల మధ్యలో అచ్యుత బచ్చలి స్థాపించిన యునిలాగ్ కంటెంట్ సొల్యూషన్స్‌కి సంబంధించిన ఈ కథని మీకోసం అందిస్తున్నాం. అచ్యుత వయసు ఇప్పుడు 70 ఏళ్లు. యునిలాగ్ దైనందిన విషయాల్లో చురుగ్గా పాల్గోనే అవకాశం లేదు. కానీ 15 ఏళ్ల క్రితం ఆయన తన సంస్థను ప్రారంభించినప్పుడు పరిస్థితి వేరు. చాలామంది ఉద్యోగస్తులు ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలని ఎదురుచూసే వయసులో అచ్యుత ఓ ఆంట్రప్రెన్యూర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆయన మిగతా వాళ్లలా విశ్రాంతిని కోరుకోలేదు. ఏదో సాధించాలన్న తపనతో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. చాలా లేటు వయసులో వ్యాపారం చెయ్యాలని భావించినప్పటికీ, తన మార్గంలో ఎక్కడా తడబడకుండా ప్రయాణం కొనసాగించిన ఒక సాధారణ ఉద్యోగి కథని చదవండి.

ఆరంభం ఇలా..

ఉద్యోగం చేసేటప్పుడే, సంస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు అచ్యుత . ఆయన చేసిన చాలా విదేశీ ప్రయాణాల ద్వారా కంపెనీకి 15 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ లాభాన్ని డీల్ లైసెన్సింగ్, కమిషనింగ్,ఇంజనీరింగ్ ద్వారా చేకూర్చారు. “వినియోగదారులందరూ కూడా నేనే కంపెనీ యజమాని అనుకునేవారు, కానీ కాంట్రాక్ట్ సైన్ చెయ్యడానికి వాళ్లు ఇండియాకి వచ్చినప్పుడు నేను కనీసం ఫోటోస్‌లో కూడా కనిపించేవాడిని కాదు. అది సహజంగానే నా ఈగోని దెబ్బ తీసేది. అప్పుడే ఆంట్రప్రెన్యూర్ కావాలనే కోరిక బలంగా నాటుకుంది” అంటారు అచ్యుత. ఈ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం , రిస్క్ తీసుకోవడానికి వెనుకాడని మనస్తత్వాలే యునిలాగ్ కంటెంట్ సొల్యూషన్స్‌కి పునాదిలయ్యాయి. ఇది అమెరికా, ఐరోపా దేశాల్లో కూడా విస్తరించింది. ప్రస్తుతం సుమారు 45కంటే ఎక్కువమంది క్లయింట్లకి సేవలందిస్తున్న ఒక డాటా మేనేజ్ మెంట్, ప్రాడక్ట్ కేటలాగింగ్ , బిగ్ డాటా అనలిటిక్స్ కంపెనీ ఇది.


image


తప్పనిసరి పరిస్థితిల్లో తాను కంపెనీ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, అచ్యుత తన పాత కంపెనీకి పోటీ కాకూడదని, వాళ్లకి వ్యతిరేకంగా ఏమీ చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు. యునిలాగ్‌ని గతంలో శ్రీసాఫ్ట్ అని పిలిచేవారు. ఈ సంస్థను ముందుగా కింది స్థాయిలో డాటా ఎంట్రీ, కేటలాగ్ సేవలతో ప్రారంభించినా, తరువాత మెల్లగా డాటా క్లెన్సింగ్, ట్యాక్స్ ఆన్ మెయిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసి కొద్ది కాలం క్రితమే ప్రాడక్ట్ డెవలప్‌మెంట్‌లోకి కూడా ప్రవేశించింది.

యునిలాగ్ సేల్స్ హెడ్ మరియు అచ్యుత కుమారుడైన సుచిత్ బచ్చలి, తమ మొదటి కస్టమర్‌ని ఎలా సంపాదించారో వివరిస్తున్నారు. అమెరికాకి చెందిన బయోటెక్నాలజీ కంపెనీ అయిన ఫిషర్ సైంటిఫిక్ ఓ వ్యాపార సదస్సు కోసం వీళ్లని ఆహ్వానించింది. 

“ఆ సమయంలో ఫ్లైట్ టికెట్ల ధర చాలా ఎక్కువుండేది. అప్పుడు మా నాన్నగారి దగ్గర కేవలం క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉంది. ఒక నగల షాప్ కి వెళ్లి, క్రెడిట్ కార్డ్ మీద బంగారం కొని, అదే బంగారాన్ని అమ్మితే వచ్చిన డబ్బులతో అమెరికా ప్రయాణానికి టికెట్ కొన్నారు. అటువంటి గడ్డు పరిస్థితుల్ని మేం ఎదుర్కొన్నాం. ఇది చెయ్యగలం, పని జరుగుతుంది, పెద్ద కంపెనీకి వ్యతిరేకంగా మనం గెలుస్తాం అనే ఆయన తెలివి, నమ్మకాలకి నేను హ్యాట్సాఫ్ చెప్తాను”, అంటారు సుచిత్.

మొదటి మూడు స్థానాల్లో ఉన్న ఐటి దిగ్గజాల్లో ఒక దానితో అచ్యుత పోటీపడ్డారు, కానీ యునిలాగ్ మనుగడకు ఆ వర్క్ ఆర్డర్ ఊపిరిపోస్తుందని ఫిషర్ బిజినెస్‌కు నిజాయితీగా తెలియజేసి, ఆ ప్రాజెక్టును సాధించారు. “మీకెందుకు వర్క్ ఇవ్వాలని ఫిషర్ సైంటిఫిక్ అధ్యక్షుడు అడిగారు ? మాకు ఆ వర్క్ చాలా అవసరమని చెప్పాము. అలాగే మేమెప్పుడూ మీటింగ్‌కి లాయర్ ని తీసుకురామని కూడా చెప్పాం” అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు అచ్యుత. ఈ ముక్కుసూటితనమే ఆ అధ్యక్షుడిని చాలా మెప్పించింది, ఇవాళ అదే వ్యక్తి – వాల్టర్ రాష్ – యునిలాగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్‌గా అమెరికాలో సేవలందిస్తున్నారు.

2004లో యూనిలాగ్ మొదట సంపాదించిన కాంట్రాక్ట్.. ఫిషర్ కాంట్రాక్ట్, ఇక అప్పటినుండి ఆ కంపెనీ అభివృద్ధి చెందుతూనే ఉంది.

కృషితోనే పురోగతి

ఆంట్రప్రెన్యూర్‌షిప్ అనేది చాలా శ్రమతో కూడుకున్నదని, ఒక మంచి జీవితాన్ని సాధించడమే తన లక్ష్యమని అచ్యుత చెప్తారు. కానీ ఏదో “అదృశ్య చెయ్యి లేదా అదృశ్య శక్తి” ముందుండి నడింపించడం వల్లనే చాలా విషయాలు జరిగాయని ఆయన చెప్తారు. “దేవుడు దయ చూపించాడు. ప్రణాళిక ఏమీ లేకుండానే చాలా పనులు జరిగాయి. కొంతమంది వచ్చారు, సహాయం చేసారు, అలాగే కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాం, వాటిలోంచి బయటపడగలిగాం. నేను మళ్లీ ఆధ్యాత్మికంగా చెప్తున్నాను అనుకోవద్దు, నన్ను కాపాడటానికి ఎప్పుడూ ఏదో అదృశ్య చెయ్యి తోడ్పాటు అందిస్తూనే ఉంది. మీతో నీజాయితీగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ విజయాలన్నీ పూర్తిగా నా తెలివితేటల వల్లే దక్కినవి కాదు”, అని నిక్కచ్చిగా అంటారు అచ్యుత. ఆయన ఎప్పుడూ కూడా వ్యక్తులని నమ్మి వాళ్లతో కలిసి పనిచేస్తుంటారు. కంపెనీ ఎప్పుడూ నైతికను నమ్మి, విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఉద్యోగుల బాగోగులు చూసుకుంటుంది. ఏదైనా పనిని నిబద్ధతతో చేస్తే, అది మంచి ఫలితాన్ని ఇస్తుందని అచ్యుత వ్యక్తిగతంగా నమ్ముతారు.


సుచిత్ బచ్చలి

సుచిత్ బచ్చలి


అచ్యుత ఆంట్రప్రెన్యూర్ కావాలనుకున్న సమయానికి సుచిత్ వయసు 17 ఏళ్లు మాత్రమే. అప్పట్లో బయట పరిస్థితులపై తనకు అంతగా అవగాహన లేదని సుచిత్ చెప్తారు. “నాన్నగారి ఇంతకుముందు జాబ్ చాలా వరకూ ఆంట్రప్రెన్యూరల్ స్వభావం కలిగిఉండేది. ఆయన తన స్వంత పి అండ్ ఎల్, స్వంత యూనిట్ కలిగి ఉండేవారు, ఉత్పత్తిని డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్లేవారు. ఈ హోదాయే బహుశా ఆయన స్వయంగా చెయ్యగలరనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందేమో”, అని చెప్తారు. చాలామంది ఆంట్రప్రెన్యూర్‌ల వలే, సేవా తత్పర వ్యక్తుల కుటుంబంలోకి వచ్చిన మొదటి-తరం ఆంట్రప్రెన్యూర్ అచ్యుత.

ఆయన కెమికల్ కంపెనీకి హెడ్‌గా పనిచేసిప్పటికీ, యునిలాగ్ మొదలుపెట్టే సమయానికి ఐటి రంగం మంచి ఊపుమీద ఉంది. అందుకే ఆయన ఆ రంగాన్ని ఎంచుకున్నారు. మొదట కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నప్పటికీ, 2001 లో చోటుచేసుకున్న డాట్ కామ్ పతనం కంపెనీ మీద ప్రభావం చూపించింది. 100 మంది సిబ్బందిని 15 కి కుదించింది. 2004లో సుచిత్ కంపెనీలోకి అడుగుపెట్టేటప్పటికి, కంపెనీ తిరిగి పుంజుకునే స్థాయిలో ఉంది, ఇక అప్పటినుంచి నెమ్మదిగా, స్థిరంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.

అచ్యుత సొంత డబ్బుతో పాటు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మరికొంత అప్పుతీసుకుని కంపెనీని మొదలుపెట్టారు. గత ఏడాది కంపెనీ ఆదాయం ఆరు సంఖ్యల మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు ఇంకా విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు. “నేను పెట్టుబడి పెట్టడానికి ఒక కారణం ఏమిటంటే, నేను ఇంతకు ముందు పనిచేసిన ఉద్యోగం వల్ల మొత్తం ప్రపంచాన్ని చూడగలిగాను. ఈ రంగం అత్యద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు. లేటు వయసులో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌కి ఉన్న అనుకూలతల్లో ఒకటి సహనం ఉండటం,” అని నవ్వుతూ చెప్తారు అచ్యుత.

వ్యాపార విషయాలు

ప్లాంట్స్, కెమికల్ ఫ్యాక్టరీలు, రిఫైనరీలను ఏర్పాటు చేసే కన్సల్టింగ్ కంపెనీలకి ఔట్ సోర్స్డ్ ఇంజనీరింగ్ సేవలను అందించడం ద్వారా యునిలాగ్ మొదలైంది. క్యాడ్ డ్రాయింగ్స్, జిఐఎస్ చిత్రాలు, మెటీరియల్స్ బిల్లులు తయారుచెయ్యడం వంటి పనులు చేసేవారు. సేవలు అందించే కంపెనీ స్థాయి నుంచి యునిలాగ్ ఇప్పుడు ఉత్పత్తులు అందించే కంపెనీగా రూపాంతరం చెందింది, భవిష్యత్తులో తమ ఉత్పత్తి చేసే వస్తువులు వాటికి సంబంధించిన సేవలు మాత్రమే అందిస్తామని సుచిత్ చెప్తున్నారు.

వాళ్లు CIMM2, XRF2 అనే రెండు ఉత్పత్తులను అమ్ముతున్నారు. CIMM2 అనేది ఏదైనా ఆన్ లైన్ స్టోర్ కి అందించే ఒక ఆల్-ఇన్-వన్ ఇ-కామర్స్ సొల్యూషన్, XRF2 అనేది ఒక బిగ్ డాటా ప్రాడక్ట్. ఇది డాటా ఎనలటిక్స్ కోసం సాస్ యొక్క శక్తిని ప్రభావితం చేస్తుంది. మైసూర్‌లో ఉన్న R&D కేంద్రం యునిలాగ్‌కి గర్వకారణంగా నిలుస్తోంది. ఏడేళ్ల క్రితం యునిలాగ్ మైసూర్‌లో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. ఈ బృందాలు ప్రాడక్ట్ డాటా మేనేజ్ మెంట్, బిగ్ డాటా అనలైటిక్స్ స్పేస్ లోని టెక్నాలజీల మీద పని చేసే అవకాశం దక్కించుకున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కస్టమర్స్‌ని లక్ష్యంగా చేసుకుని కీలక ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తున్నారు. “మా నాన్నగారు మైసూర్‌లో చదివారు కనుక అక్కడే R&D కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తాను తిరిగి సొంత ఇంటికి చేరుకున్నట్లుగా భావిస్తారు. సాధ్యాసాధ్యాలు, నాణ్యమైన నైపుణ్యం, సరసమైన ధరలను మేం కీలక అంశాలుగా భావిస్తాం,” అని చెప్తారు సుచిత్.

45 కస్టమర్లతో పనిచేస్తున్న యునిలాగ్ , తన సిబ్బందికి కీలకమైన విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పెద్ద కంపెనీలైన కాగ్నిజెంట్, జెన్ ప్యాక్ట్ లలో పనిచేసే ప్రాజెక్ట్ మేనేజర్లకి కూడా ఒక్కోసారి అంతటి సహాయక చర్యలు లభించవని అని సుచిత్ చెప్తారు. “మీరు రాత్రివేళ ఎప్పుడైనా మైసూర్ వెళ్లిచూడండి, యునిలాగ్‌లో లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. మేము ఉద్యోగులకు ఓవర్ టైమ్ లాంటివేమీ చెల్లించం. మా సిబ్బంది లైవ్ ప్రాజెక్టులు, అసలైన సమస్యల మీద పనిచేస్తున్నారు. ఒకవేళ ఏవైనా ఇబ్బందులున్నా కూడా ఎంతసేపైనా వాళ్లు సమస్యని పరిష్కరించవలసిందే. అమెరికాలో కానీ లేదా మరెక్కడా వాళ్లకి సహాయం చేసేవారు ఎవరూ ఉండరు,” అని చెప్తారు సుచిత్. బహుశా ఇంజనీరింగ్ మైండ్స్‌కి కల్పించే సవాలుతో కూడుకున్న ఈ వాతావరణమే వాళ్ల సంఘర్షణ రేటుని చాలా తక్కువ చేసింది. అది కేవలం మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే ఉంటుంది. ఫార్ట్యూన్ 50 కంపెనీలు లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ ని అమలుచెయ్యడం కోసం మొబైల్ యాప్స్ ని రూపందించే క్రమంలో యునిలాగ్ టీమ్ సభ్యులు ఎంతో ఎంజాయ్ చేస్తారు.

భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే, మరో రెండు ఉత్పత్తులు తయారీ దశలో ఉన్నాయని, ఒక సంపూర్ణ ప్రాడక్ట్ కంపెనీగా రూపాంతరం చెందేందుకు పని చేస్తున్నామని సుచిత్ చెప్తున్నారు. “2009 లో, మేము ఉత్పత్తులని తయారుచెయ్యాలని ఆలోచించాము, ఎందుకంటే ఒకపక్క మేము నిరంతరంగా కాగ్నిజెంట్స్, జెన్‌ప్యాక్ట్స్ లతో పోటీపడుతుండగా, మరోపక్క ఈ మామ్-అండ్-పాప్ షాప్స్, కంపెనీని వదిలేసి కొత్తగా కంపెనీ పెట్టిన మాజీ ఉద్యోగులతో కూడా పోటీపడ్డాం. మాకు చాలా తీవ్రమైన పోటీ ఉండేది,” అంటూ సుచిత్ కొన్ని విషయాలను తెలియజేశారు. ఈ పరిస్థితే వాళ్లని మధ్యవర్తిత్వపు ఆట నుండి బయటకు వెళ్లే దారుల్ని వెతుక్కునేలా చేసింది. సమస్యకి పరిష్కారంగా ఉత్పత్తులను తయారుచేసేలా ప్రోత్సహించింది. “భవిష్యత్తులో మేము ఇక సేవలు అందించకపోవచ్చు, పూర్తి స్థాయి ఉత్పత్తులతోనే ముందుకు వస్తాం,” అని చెప్తున్నారు సుచిత్.

యునిలాగ్ కి ఒక బలమైన వినూత్న డిఎన్ఎ ఉందని, తన తండ్రి మొదలుపెట్టిన దాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని చెబ్తారు సుచిత్.

తాను చేసిన రోలర్ కోస్టర్ ప్రయాణాన్ని తలుచుకుంటూ, అచ్యుత తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. “ యువ ఆంట్రప్రెన్యూర్స్ కొన్ని విషయాలను తెలుసుకోవాలి. కంపెనీ మొదలుపెట్టడానికి మీకొక మంచి అవగాహన ఉండాలి, నా దృష్టిలో ప్లాన్ బి అనేది ఉండకూడదు. ప్లాన్ ఎ అనేదే అద్భుతంగా ఉండాలి. ఒక లక్ష్యంతో తగిన ఓర్పుతో కూడా ఉండాలి. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతీదీ బృందంగా పనిచేయాలి. ఉత్పత్తిని తయారుచేసేవారు, అమ్మేవారు, ఫైనాన్స్‌ని నిర్వహించేవారు వేరువేరుగా ఉండాలి. ఒక్కరే చెయ్యకూడదు- అలా అయితే సమస్య ఉండదు. ఒక సంస్థలో అన్నీ చూసుకునే దేవుడు ఉండాలంటే చాలా కష్టం-అదంతా ఒక టీమ్ వర్క్‌లా జరగాలి. నేనొక పాత కాలపు విద్యార్ధిని, నా నగదు ప్రవాహాన్నే నేను చూస్తాను, దాన్ని మరింత లాభం ఆర్జించేలా చేస్తాను,” అంటూ ఆయన సలహా ఇస్తున్నారు.