యాక్ట్ కార్ పూలింగ్ అంటే ఒక సామాజిక బాధ్యతే!

యాక్ట్ కార్ పూలింగ్ అంటే ఒక సామాజిక బాధ్యతే!

Sunday November 01, 2015,

3 min Read

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎన్నో రకాల కార్ పూలింగ్ లను చూశాం కానీ.. యాక్ట్ కార్ పూలింగ్ లాంటి స్టార్టప్ ను బహుశా ఎక్కడా చూసి ఉండరు. మీరు కార్ పూలింగ్ లో మెంబర్ కావాలంటే మీ కమ్యూనిటీ లేదా మీ కాలనీవాసులంతా అందులో జాయిన్ కావాలి. అదెలా సాధ్యమవుతుందని మీరు అడిగితే దానికి సమాధానం చెబుతోంది హైదరాబాద్ కి చెందిన ఈ సోషల్ స్టార్టప్.

“హైదరాబాద్ లో ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీలన్నింటినీ ఒక కుటుంబంగా చూడాలనుకుంటున్నా” విశ్వం వేముల

విశ్వం వేముల యాక్ట్ కార్ పూలింగ్ ఫౌండర్ , ఫౌండర్ అనే కంటే మెంటార్ గా ఉండటానికే ఆయన ఇష్టపడతారు. యాక్ట్ కార్ పూలింగ్ అనేది కమ్యునిటీ కార్ పూలింగ్ గా ఉండాలనుకుంటున్నారు. అభ్యుదయ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రారంభమైన సోషల్ ఇనిషియేషన్ ఇది. అందకే ఆయన ప్రిన్సిపాల్ మెంటార్ గా పరిచయం చేసుకున్నారు.

image


కమ్యూనిటీ కార్ పూలింగ్

సాధారణంగా కార్ పూలింగ్ అంటే ఎలా ఉంటాయి? మనకు తెలిసినంత వరకూ మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ లోనో మనం కో పాసింజర్ లుగా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. పెట్రోల్ షేరింగ్ లాంటివి ఇందులో ఉండే బెనిఫిట్స్. కానీ కమ్యూనిటీ కార్ పూలింగ్ అలా కాదు. కార్ పూలింగ్ చేయాలంటే మీకంటూ ఓ కమ్యూనిటీ ఉండాలి. యాక్ట్ కార్ పూలింగ్ లో సభ్యత్వం కావాలంటే మీ కాలనీ లేదా మీ గేటెడ్ కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పంపాలి. గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత తనకాలనీలో ఉన్న వారితో వాట్సాప్ లో గ్రూప్ లేదా కమ్యూనిటీని ఏర్పాటు చేసుకునే విధంగా యాక్ట్ కార్ పూలింగ్ సహకరిస్తుంది. అలా కార్ పూలింగ్ కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఇప్పటి వరకూ పది కమ్యూనిటీలున్నాయి. రోజుకి నలబై రైడ్ లనుయాక్ట్ కార్ పూలింగ్ సక్సస్ ఫుల్ గా నడుపుతోంది.

“మా వాట్సాప్ కాంటాక్స్ తో గ్రూప్ లను ఏర్పాటు చేశాం. దీంతో కమ్యూనిటీని డెవలప్ చేయాలనేది మా లక్ష్యం” విశ్వం

దీనికి అనుసంధానంగా కియోస్క్ లో డేటాను బధ్రపరుస్తాం

image


‘కియోస్క్’ ఫ్లాట్ ఫాంలో కార్ పూలింగ్

యాక్ట్ కార్ పూలింగ్ లో మొదటగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తిని ఆ కమ్యునిటీ లీడ్ గా ప్రకటిస్తారు. ఆ తర్వాత తన కమ్యూనిటీ లో సభ్యులను తీసుకు రాడానికి యాక్ట్ కార్ పూల్ సాయపడుతుంది. తనతో జాయిన్ అవుతామనుకున్న వారిని కలుపుకుంటూ పోవడమే. ఫేస్ బుక్ పేజిపై అప్ డేట్ చేస్తే సరిపోతుంది. తన ఆఫీసు, తన కాలనీలో ఎవరైనా తనని ఫాలో అయితే వారిని కలుపుకోవాలి. ఆ కాలనీ వరకూ ఎన్ని రైడ్స్ జరిగాయి, ఎంత మంది జాయిన్ అవుతున్నారనే డేటాను మెయింటెన్ చేస్తారు. ప్రతిరోజూ ఉదయం కాలనీలో ప్రారంభమయ్యే కార్లలో ఎంతమంది యాక్ట్ కార్ పూలింగ్ లో ఉన్నారనే సంగతి కియోస్క్ లో తెలుస్తుంది. వాట్సాప్ లో నంబర్ కు మెసేజ్ చేయాలి. ఫేస్ బుక్ లో కమ్యూనిటీ లీడ్ నంబర్ కనపడుతుంది. తానే కొత్త వారిని గ్రూప్ లో జాయిన్ చేస్తారు. ఇష్టం లేని వారూ గ్రూప్ నుంచి బయటకి వచ్చేయొచ్చు. అంతా వాలంటీర్ గా చేయాల్సిందే. ఎవరినీ రావాలని ఫోర్స్ చేయరు.

image


యాక్ట్ టీం

యాక్ట్ కార్ పూలింగ్ టీం విషయానికొస్తే విశ్వం వేముల మెంటార్ గా ఉన్నారు. దాదాపు 500లకు పైగా వాలంటీర్లు ఉన్నారు. యూజర్లు కూడా ఇంచుమించు ఇంతే సంఖ్యలో ఉన్నారు. యూజర్లే ఇక్కడ టీం. ప్రత్యేకంగా దీనికి టీం ఎవరూ లేదు. ఐటి ఉద్యోగి అయిన విశ్వం రోజూ మాదాపూర్ వెళ్తున్న క్రమంలో తాను ఫేస్ చేసిన ట్రాఫిక్ ట్రబుల్ నుంచి ఈ ఐడియా వచ్చింది. యాక్ట్ కార్ పూలింగ్ లో పార్టిసిపేట్ చేసిన వారి రైడ్స్ బట్టి పాయింట్ ఇస్తారు. ఈ పాయింట్స్ ఎక్కువ వచ్చిన యూజర్లకు గిఫ్ట్ లు ఇస్తారు. ఇలా వారి కుటుంబంలో అందరికీ దీనిపై పూర్తి స్థాయి అవగాహన కలిగేలా చేస్తారు.

సవాళ్లు

కియోస్క్, వాట్సాప్ , ఫేస్ బుక్ నుంచి యూజర్లను కో ఆర్డినేట్ చేయడం అంత సింపుల్ గా జరిగే పనికాదు. అయితే దీన్ని సుసాధ్యం చేసి చూపించాం అంటోంది యాక్ట్ కార్ పూలింగ్. కమ్యూనిటీలను ఏర్పాటు చేయడంపైనే మొత్తం ప్రక్రియ ఆధార పడి ఉంటుంది. దీన్ని అధిగమించాల్సి ఉంది. ఒక్కరిగా ఈ కార్ పూలింగ్ లో జాయిన్ కావాలంటే కొద్దిగా కష్టమే. దీన్ని అధిగమించాల్సి ఉంది. యూజర్ బేస్ పెరుగుతున్న కొద్దీ పూర్తి స్థాయి సేవల వినియోగం సాధ్యపడుతుందా అనే మరో సవాలు ఉంది. అయితే ఈ తరహా మోడల్ ని ఇప్పటి వరకూ ఎవరూ ప్రారంభించలేదు. ఇప్పటి వరకూ సక్సస్ ఫుల్ గా రన్ చేశాం. భవిష్యత్ లో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తామనే దీమాతో ఉంది యాక్ట్ కార్ పూలింగ్ టీం.

image


భవిష్యత్ ప్రణాలికలు

ట్రాఫిక్ ,కార్ పూలింగ్ పై అవగాహన కల్పించేందుకు జరుగుతున్న కార్ ఫ్రీ థర్స్ డే లాంటి ఈవెంట్స్ లో పాట్నర్ గా ఉన్న యాక్ట్ కార్ పూలింగ్ మరిన్ని ఈవెంట్స్ కి ప్లాన్ చేస్తోంది. యూజర్ నంబర్ ని పెంచుకొని కొత్త కమ్యూనిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్ ని జీర పెట్రోల్ , జీరో ట్రాఫిక్ హెసెల్ నగరంగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని విశ్వం అంటున్నారు.