కొబ్బరి ఉత్పత్తులతో కోట్లు కూడబెడ్తున్న కావ్యా నాగ్

కొబ్బరి ఉత్పత్తులతో కోట్లు కూడబెడ్తున్న కావ్యా నాగ్

Wednesday September 02, 2015,

5 min Read

కొబ్బరి చెట్టు ప్రయోజనాలేంటో తెలుగువారందరికీ తెలుసు. ఐతే ఆ కొబ్బరి నుంచి వచ్చే రా ప్రొడక్ట్స్‌తో బాడీ కేర్ ప్రొడక్ట్స్‌ తయారుచేసి స్వావలంబన సాధించిందో మహిళ. మల్టీ నేషనల్ కంపెనీల ప్రొడక్టులకు తీసిపోని విధంగా..తన ఉత్పత్తులను తయారు చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది. బెంగళూరుకు చెందిన కావ్యా నాగ్.. 'కోకోనెస్' సాధిస్తున్న విజయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

image


ఆరంభం

2012 ...కావ్యానాగ్ సొంతంగా బిజినెస్ గురించిన ఆలోచన చేస్తున్న సమయం. అప్పట్లో ఆమె ఫ్రెండ్ ఒకరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ గురించి చెప్పారు. మామూలు కొబ్బరి నూనె అందరికీ తెలిసిందే. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను ఓ బ్రాండ్‌గా మొదటగా మార్కెట్లోకి తీసుకొచ్చింది మాత్రం ఫిలిప్పైన్స్ దేశం. ఆ కంట్రీ తయారు చేసిన వర్జిన్ కోకోనట్ ఆయిల్‌కు యూఎస్‌లో ఉన్న క్రేజ్ గురించి కావ్యకు ఆమె ఫ్రెండ్ చెప్తుంటే విని ఆశ్చర్యపోయింది. ఆ సేల్స్ ఫిగర్స్ కంటే కూడా .. డ్రై కోప్రా (ఎండు కొబ్బరి) నుంచి కాకుండా పచ్చి కొబ్బరి నుంచి ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తారనే అంశం కావ్యకు ఎక్కువ ఆసక్తి కలిగించింది. ఆ ఇంట్రెస్టే 2012లోకావ్యానాగ్ చేత కోకోనెస్‌ను ప్రారంభించేలా చేసింది. అలా సింగసండ్రలోని ఓ ప్రశాంతమైన ఫామ్‌లో కోకోనెస్ ప్రారంభమైంది.

రెండు దశాబ్దాల క్రితం వరకూ చూసుకుంటే..అప్పటిదాకా చాలామంది వంటల్లో కొబ్బరినూనెనే వాడారు (కేరళ,కర్నాటక ). ఐతే అందులో ఉండే హైలెవల్ శాచురేషన్ ఫ్యాట్ కారణంగా...కోకోనట్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా వేరే నూనెలు రంగప్రవేశం చేశాయ్. కొబ్బరినూనెలోని ఇతర విలువల కారణంగా..పర్సనల్ కేర్ రంగంలో కోకోనట్ ఆయిల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇండస్ట్రీలో 90శాతం మారికో బ్రాండ్ అయిన పేరాచూట్ ఆక్రమించిందంటేనే అర్థం చేసుకోవచ్చు.

హై క్వాలిటీ..ప్యూర్ ఆర్గానిక్

కావ్యానాగ్ ఎప్పుడైతే తన సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేశారో..ఆమె స్నేహితులు, కుటుంబసభ్యులు ప్రోత్సాహం బాగా లభించింది. 8వేల కోట్ల రూపాయల మార్కెట్లోకి కోకోనెస్ అలా తొలి అడుగు వేసింది. అనతికాలంలోనే కోకోనెస్ తన సత్తా చాటగా...కంపెనీ టార్గెట్ గురించి కాకుండా..అప్పటిదాకా మార్కెట్లో ఉన్న అన్ని కోకో ప్రొడక్ట్స్‌కు భిన్నంగా తన ఉత్పత్తులు ఉండాలని భావించారు. పూర్తి సేంద్రియ ఉత్పత్తులుగా...హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేయడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

కోకోనెస్ ప్రొడక్ట్స్

కోకోనెస్ ప్రొడక్ట్స్


తన సొంత ఫామ్స్‌లో కొబ్బరికాయలనుంచి నూనె తీసి కొన్ని ప్రయోగాలు చేయగా...వాటి రిజల్ట్స్ కావ్యను ఆశ్చర్యపరిచాయ్. ఉత్పత్తి అయిన ఆయిల్ మార్కెట్లో లభిస్తున్న నూనెలకన్నా తేలికగా..క్లియర్‌గా ఉండగా..బాగా పండిన కొబ్బరి వాసన వెదజల్లడం గమనించారు. అలా తీసిన కొబ్బరి నూనె రిఫైనింగ్, బ్లీచింగ్, డీ ఓడరైజింగ్ పధ్దతుల్లో ఫంగస్ , మురికి నుంచి కోప్రాను వేరు చేయడం ప్రారంభించారు. సాల్వంట్ ఎక్స్‌ట్రాక్ట్ ప్రాసెస్‌లో ఎక్కువ మొత్తం ఆయిల్ తీసేందుకు ఉపయోగపడుతుంది. మంచి క్వాలిటీతో కూడిన ఆయిల్‌ను తయారు చేయాలంటే ఇదే సరైన పధ్దతని చెప్తారు కావ్య. ఐతే ఇలా తయారు చేసిన ఆయిల్ పసుపు రంగులో బాగా బరువుగా వచ్చేది.. బాగా ఫ్రై చేసిన వాసన వెదజల్లేది.

కోకోనెస్ బ్రాండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్

" ఆ తర్వాత వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారుచేసేవారనే అంశంపై బాగా రీసెర్చ్ చేశామని" చెప్పారు కావ్యానాగ్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్‌టిట్యూట్ దగ్గర ఇందుకోసం ఫెసిలిటీలున్నా..వారు బల్క్ ప్రొడక్షన్ మాత్రమే చేయగలరు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ సంస్థ తమ అవసరాలకు తగినంతగా వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను తయారు చేస్తుందని కావ్యకు తెలిసింది. ఇక అక్కడి నుంచి బిజినెస్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. అందులో పని చేసేవారంతా మహిళలే... ప్రస్తుతం లభిస్తున్న సింథటిక్ పర్సనల్ కేర్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కోకోనెస్‌ను మార్చారు. కంపెనీ ఉత్పత్తుల తయారీకి కావ్యానాగ్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలనే సంస్థలో నియమించుకున్నారు. కోకోనెస్ ఫాంలో రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ తయారీలా కాకుండా... వర్జిన్ కోకోనట్ ఆయిల్ పచ్చి కొబ్బరి నుంచే తయారయ్యేది.

కోోకోనెస్ టాన్ ఆయిల్

కోోకోనెస్ టాన్ ఆయిల్


టార్గెట్ అండ్ సేల్స్

రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ తయారు చేసే క్రమంలో చాలా వేస్టేజ్ బై ప్రొడక్టుగా వస్తుండేది. డ్రై కోప్రా నుంచి కోకోనెస్ ఓ హెల్త్ టానిక్ తయారు చేసేది. దాంతో పాటు మహిళలకోసం, పసికందులకోసం చిన్న చిన్న మొత్తాల్లో మసాజ్ ఆయిల్స్ కూడా తయారు చేసేవారు. 

" జులై నెలలో మదర్, బేబీ కేర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేశాం. క్లౌడ్ 9 తో పాటు మెటర్నిటీ బొటిక్స్ , ఆన్ లైన్ రిటైలర్లకు ఇవి సప్లై చేస్తున్నాం" అంటారు కావ్యా. అమెజాన్ డాట్ కాంలో ఇప్పటికే మా ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు వివరిస్తారు. విస్తరించడం ప్రారంభమైతే..మంగళూరులో కూడా ఇప్పటికే పార్ట్‌నర్లను కూడా సిధ్దం చేసుకున్నారు.

ప్రస్తుతం నెలకు రెండు నుంచి మూడు లక్షల రెవెన్యూ సాధిస్తున్న కోకోనెస్ వచ్చే ఆరు నెలల్లో పది లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. ఇదంతా సాధించడంలో కావ్యకు సాయపడుతున్న కుసుమ, దేవమ్మ గురించి తప్పకుండా చెప్పుకోవాలి.

కుసుమకు 14ఏళ్లకే పెళ్లైంది...కొద్దిగా సిగ్గు పడుతూ" నేనప్పటికి టెన్త్ కూడా పాసవలేదు..కానీ పెళ్లైపోయింది.. ఆ తర్వాత ఇక నా ముగ్గురు పిల్లలను చూసుకోవడమే సరిపోయింది.." పెళ్లికి ముందు జిల్లా కమిషనర్ కావాలని తెగ కలల కనేదట కుసుమ. అవన్నీ ఇప్పుడు కలలుగానే మిగిలిపోయాయ్..ఐతే ఆమె ఇప్పుడు వాటిని తన పిల్లలు సాధించాలని కోరుకుంటోంది. హవేరీ అనే ఓ కుగ్రామం నుంచి వచ్చిన ఆమె " అక్కడేం చేస్తాం..పొలం పని తప్ప"..బాగా కష్టంగా ఉండేది..సుఖమనేదే తెలియదు.. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత హాయిగా ఉంది..నే చదివింది తక్కువైనా..ఇప్పుడు దానిని ఉపయోగించగలుగుతున్నాను..అక్కడుంటే ఎంత చదివి ప్రయోజనమేంటి.."

కోకోనెస్ యాంటీ క్రాక్ నిపిల్ బామ్

కోకోనెస్ యాంటీ క్రాక్ నిపిల్ బామ్


కోకోనెస్ ప్రొడక్ట్స్‌లో టానింగ్ ఆయిల్స్ ప్రత్యేకించి పాలిచ్చే మహిళల నిపిల్ క్రాక్స్ ను నివారించే ఆయిల్స్‌తో పాటు..బేబీ మసాజ్ ఆయిల్స్ కూడా ఉన్నాయ్..ఈ నూనెల తయారీలో వాడే ఔషధాలన్నీ తమ సొంత వ్యవసాయక్షేత్రాల్లోనే పెంచుతారు కావ్యానాగ్.

ఇక దేవమ్మ విషయానికి వస్తే..కృష్ణరాజపేట అనే గ్రామంలో పుట్టి పెరిగింది..స్కూల్ మొహమే చూసి ఎరుగదు. అలానే ఇంటి దగ్గర ఉండీ ఉండీ విసుగుపుట్టి మూడేళ్ల క్రితం కావ్య దగ్గరకు వచ్చిందట. కోకోనెస్ ప్రొడక్ట్స్ పై లేబుల్స్ అంటించడం ఆమె పని. అలానే ఆ తర్వాత వాటన్నింటినీ చక్కగా ఓ క్రమపధ్దతిలో అమర్చుతుంది.. " గ్రామం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైనా మేం ఇంటికి అద్దె కట్టుకుంటున్నాం..ఖర్చులూ కూడా అక్కడలానే అవుతున్నాయ్. ఐతే అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే జీవితంలోనే పెద్ద మార్పు వచ్చింది..ఇక్కడెంతో బావుంది" చెప్తుంది దేవమ్మ. దేవమ్మ పిల్లలు కూడా దగ్గర్లోనే ఉన్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. వాళ్లంతా దేవమ్మ సబ్బులూ నూనెలు తయారు చేస్తుందంటే నమ్మరట. పైగా తమాషా చేస్తారట. ఎందుకంటే దేవమ్మకి ఎలాంటి చదువూ లేకపోవడమే.

కావ్య ఓ రోజు వాళ్లని ఫామ్‌కు పిలిచి వాళ్లమ్మ చేసే పనిని చూసిన తర్వాత వాళ్లందరికీ నోట మాట రాలేదని దేవమ్మ చెప్తుంది. ఆ తర్వాత క్షణం నుంచీ దేవమ్మ అంటే ఆమె పిల్లల్లో గౌరవం పెరిగిందట. అప్పటిదాకా కేవలం తమకి వండి వార్చి పెట్టే తల్లిగానే తెలిసిన దేవమ్మలోని ప్రతిభను గుర్తించి మెసులుకోసాగారట. కుసుమ,దేవమ్మలను మీకంటూ సొంతంగా ఏమైనా లక్ష్యాలున్నాయా అని అడిగినప్పుడు.. " సొంతంగా అంటే దాన్ని నేను మా ఊళ్లోనే మొదలుపెడతాను" అని నవ్వుతూ చెప్పింది..దాని వెనుక ఏదైనా సాధిస్తే..తన వాళ్లముందు సాధించి చూపాలనే అర్దం కన్పించింది..

ఇంకా పనిచేయాలనే ఉత్సాహం

అర్బన్ ఫామ్ లో కుసుమ,దేవమ్మ ఇద్దరూ ఓ లక్ష్యం ఏర్పరచుకున్నారు..ఈ ముగ్గురు మహిళలూ కలసి కోకోనెస్ బ్రాండ్ తో అందరిలోకీ చొచ్చుకుపోవడంతో పాటు భారీ ఆదాయం సాధించే దిశగా కలసి పని చేస్తున్నారు. కావ్య ఫామ్ హస్‌ను చూస్తే.. ఎలక్ట్రానిక్ సిటీ రణగొణధ్వనులేం విన్పించవ్. ప్రశాంతమైన ఆకుపచ్చని ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అక్కడ పని చేస్తున్నంత సేపూ ఇంకా పని చేయాలనే ప్రోత్సాహకర వాతావరణమే ఉంటుంది. దీనికి కావ్య వాళ్లను ట్రీట్ చేసే విధానమే కారణం. అంతా ఓ కుటుంబంలా కలసి ఉండటంతో... అసలు అదో పనిలా అన్పించదంటే అతిగా చెప్పడం కాదు.

" హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ను తయారు చేయడం ఒక్కటే కాదు.. మార్కెట్లో స్ట్రాంగ్ బ్రాండ్ బిల్డ్ చేయాలి. మా క్వాలిటీనే మా గురించి చెప్తుంది... మేం కాదు. మా ప్రొడక్టే మా బ్రాండ్ గురించి..మా క్వాలిటీ గురించి వాడిన కస్టమరే చెప్పాలి. ఆ స్థాయి కోసమే మేం కష్టపడి పని చేస్తున్నాేం. కస్టమర్లకు మేం ఏం ఇవ్వగలమో..ఎంతవరకూ హై క్వాలిటీతో ఇవ్వగలమో అంతవరకే పని చేస్తున్నాం. అంతేకానీ విపరీతమైన సంఖ్యలో మార్కెట్లోకి భారీగా ఆర్డర్లు దింపేయాలనుకోవడం లేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాబోం. అదే మా కాన్సెప్ట్ " చెప్తారు కావ్య.


ఒక చిన్న ఆలోచన.. కొంత మందికి ఉపాధిని ఇవ్వడంతో పాటు కొత్త మార్కెట్‌ను కూడా సృష్టించుకుంది. కావ్యానాగ్ విషయంలో అదే జరిగింది. మీరు కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో స్ఫూర్తి పొందితే.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.