ఫౌండర్ వర్సెస్ ఫౌండర్ ! సకల సమస్యలకు ఇవే పరిష్కారాలు !!

ఫౌండర్ వర్సెస్ ఫౌండర్ ! సకల సమస్యలకు ఇవే పరిష్కారాలు !!

Monday January 18, 2016,

2 min Read

స్టార్ట‌ప్స్ ఫెయిల్యూర్స్ కు ప్రధాన కార‌ణాల‌పై ఆంట్రప్రెన్యూర్లు రాసిన కొన్ని వ్యాసాల‌ను 2014లో సీబీ ఇన్ సైట్స్- విశ్లేషించింది. ఫౌండర్ లేదా టీమ్ సంబంధిత స‌మ‌స్యలే స్టార్ట‌ప్స్ ఫెయిల్యూర్స్ కు రెండో ప్రధాన కార‌ణమన్నది వాటి సారాంశం! కొంత మంది ఫౌండ‌ర్లు ప‌ర్ఫార్మెన్స్ ను నిల‌క‌డ‌గా కొన‌సాగించ‌లేరు. మ‌రికొంద‌రు నిజాయితీగా ప‌నిచేయ‌లేక‌పోతున్నారు. మోస‌మో, దొంగ‌త‌న‌మో అయితే ఏదో ఒక‌టి చేయొచ్చు. కానీ ప‌ర్ఫార్మెన్స్, కాంట్రిబ్యూష‌న్ విష‌యంలో తేడావ‌స్తే అంతే సంగ‌తులు!

image


ఆ మ‌ధ్య ఓ కంపెనీలో పెట్టుబుడులు పెట్టాం. నెల తిర‌క్కముందే ముగ్గురు ఫౌండ‌ర్లలో ఇద్దరు మా ద‌గ్గరికొచ్చి ప‌ని మానేస్తామ‌న్నారు. ఎందుకో మాకు అర్థంకాలేదు. త‌ర‌చూ మా ద‌గ్గరికి రావ‌డం, జాబ్ మానేస్తాన‌ని చెప్పడం! మూడేళ్లుగా ఇదే తంతు. కో-ఫౌండ‌ర్ గా వారెందుకు ఇమ‌డ‌లేక‌పోతున్నారో ఆ త‌ర్వాత మాకు తెలిసింది. స్టార్టప్ లో కో-ఫౌండ‌ర్ గా ఉండే క‌న్నా ఏదో ఒక ఎమ్మెన్సీలో మూడేళ్లు ప‌నిచేయ‌డం మేల‌న్నది వారి ఆలోచ‌న‌. స్టార్టప్ ల విష‌యంలో ఇలాంటివి మామూలే. అందుకే కొన్ని జాగ్రత్తలు అవ‌స‌రం. స్టార్టప్ స్టార్ట్ చేయాల‌న్నా, కో-ఫౌండ‌ర్లను నియ‌మించుకోవాల‌న్నా- కొంత కేర్ తీసుకోవాలి. అందులో ముఖ్యమైంది అగ్రిమెంట్! ఒప్పందం ప‌క్కాగా ఉంటే ఫ్యూచ‌ర్ లో ఏ ఇబ్బందీ రాదు. అలాంటి అగ్రిమెంట్ త‌యారు చేసే ముందు ఈ కింది సూచ‌న‌లు పాటిస్తే మంచిది..

1. పాత్రలు, బాధ్యత‌లు

అగ్రిమెంట్ లో ఫౌండ‌ర్లకు సంబంధించిన ప్రాథ‌మిక పాత్రలు, బాధ్యత‌లు స్పష్టంగా నిర్వచించాలి. అందుకు ఫౌండ‌ర్ల అనుభవం లేదా వారి ప్రయోజ‌నాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకోవాలి. ఒక్కోసారి కో-ఫౌండ‌ర్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. లేదా కంపెనీ న్యూ మోడ‌ల్ కి అప్ డేట్ అవొచ్చు. అందుకే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మార్చుకునేలా అగ్రిమెంట్ లో నిబంధ‌న‌లు ఉండాలి.

2. డెసిష‌న్ మేకింగ్

ప్రతీ కో-ఫౌండ‌ర్ సీఈవో లేదా కో-సీఈవో అవ్వాల‌న్న రూలేం లేదు. స్టార్టప్ ల డెసిష‌న్ మేకింగ్ ఒక క‌మిటీలో లేదా మెజారిటీ ఓటు ద్వారానో నిర్ణయించ‌డం టైం వేస్టు య‌వ్వారం. పైగా నిర్ణయాలు తీసుకోవ‌డంలో స్పష్టత ఉండ‌దు. అందుకే డెసిష‌న్ మేకింగ్ అధికారం ఎవ‌రో ఒక్కరి చేతిలోనే ఉండాలి. అప్పుడే స్టేక్ హోల్డర్లంద‌రికీ క్లారిటీ ఉంటుంది. అయితే ప‌ర్ ఫెక్టుగా నిర్ణయాలు తీసుకునే ఆ ఒక్క లీడ‌ర్ కంపెనీలో ఎవ‌రో గుర్తించాలి. రొటేష‌న్ ప‌ద్ధతిలో కాకుండా ప‌ర్ ఫార్మెన్స్ ఆధారంగా లీడ‌ర్ షిప్ ఛేంజ్ చేయాలి. కీల‌క‌మైన నిర్ణ‌యాల విష‌యంలో కో-ఫౌండ‌ర్లు అంద‌రూ క‌లిసి చ‌ర్చించుకుంటే బెట‌ర్. అయితే అన్ని నిర్ణయాల‌కూ ఏకాభ్రిప్రాయం ఉండాల‌న్న నిబంధ‌నేమీ లేదు. డెమోక్రసీ అన్నది కొలాబ‌రేష‌న్, డిస్క‌న్స్ లో బాగుంటుంది గానీ డెసిష‌న్ మేకింగ్ కు సూట‌వ‌దు.

3. స‌మాన ఈక్విటీ

ఫౌండ‌ర్లంద‌రికీ ఈక్విటీ స‌మానంగా ఉండాల‌న్నది స్టార్టప్ స‌ర్వేల సారాంశం. ముఖ్యంగా ఫౌండ‌ర్లంద‌రికీ ఒకే ర‌క‌మైన అనుభ‌వం, నేప‌థ్యం ఉన్నప్పుడు ఈ సూత్రం పాటించ‌డం త‌ప్పనిస‌రి. ఒక స్టార్టప్ లో ఈక్విటీ అంటే కంపెనీ భ‌విష్యత్ విలువ‌ను పెంచ‌డ‌మ‌ని అర్థం. అలాగ‌ని టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ స‌మానంగా కాంట్రిబ్యూట్ చేయాల‌ని లేదు. ఒకేర‌క‌మైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడమూ అసంభ‌వ‌మే! ఒక‌వేళ కో-ఫౌండ‌ర్ల‌కు స‌మాన‌మైన ఎక్స్ పీరియెన్స్, బ్యాక్ గ్రౌండ్ లేక‌పోతే- అంద‌రికీ స‌మానవాటా ఉండాల్సిన‌ అవ‌స‌రం లేదు. లీడ్ కో-ఫౌండ‌ర్ లేదా సీఈవోకు మిగ‌తా వారి క‌న్నా ఎక్కువ షేర్ ఉండాలి. ఈ నిబంధ‌న‌లు కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ.. పాటించ‌క త‌ప్పదు. లేదంటే ఫౌండ‌ర్ల మ‌ధ్య పొరప‌చ్చాలు రావొచ్చు. అది కంపెనీ భ‌విష్యత్తునే సంక్షోభంలో ప‌డేయొచ్చు. మ‌రో ముఖ్యమైన అంశం వెస్టింగ్! మార్కెట్ ఆధారంగా ఫౌండ‌ర్లకు షేర్లు కేటాయించాలి. ఒక‌వేళ ఎవ‌రైనా కో-ఫౌండ‌ర్ మ‌ధ్యలో త‌ప్పుకుంటే, ఆ వ్యక్తి పేరు మీద ఉన్న అన్ వెస్టెడ్ షేర్లను ప్రత్యామ్నాయంగా ఉప‌యోగించుకోవ‌చ్చు.

సూటిగా చెప్పాలంటే, ఫౌండ‌ర్/టీమ్ రిలేష‌న్ షిప్ పెళ్లి లాంటిది! అది చిర‌కాలంగా కొన‌సాగాల‌నే అంద‌రూ కోరుకుంటారు. కానీ నిజ‌మైన వైవాహిక బంధాల్లో ఉన్నట్టే ఇందులోనూ కొన్ని ట్విస్టులు ఉంటాయి! త‌ర్వాతి ప‌రిణామాల‌కు బాధ‌ప‌డ‌కుండా ఉండాలంటే ముందే అగ్రిమెంట్ ఒక‌టి కుదుర్చుకోవ‌డం మంచిది!

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి