ఫేస్‌బుక్ గ్రూప్ నుంచి స్టార్టప్ కంపెనీగా మారిన కెచప్!!

ఫేస్‌బుక్ గ్రూప్ నుంచి స్టార్టప్ కంపెనీగా మారిన కెచప్!!

Thursday February 04, 2016,

5 min Read

ప్రజల అలవాట్లు రోజు రోజుకి మారిపోతున్నాయి. వెరైటీ రుచుల కోసం ఇప్పుడు చాలామంది రెస్టారెంట్లకు వెళ్తున్నారు. వెళ్లిన ప్రతీసారి ఒకే రుచి చూసే ఏం బాగుంటుంది. అయితే ఏ రెస్టారెంట్‌లో ఏ ఫుడ్ బాగుంటుంది? మంచి ఫుడ్ అందించే రెస్టారెంట్లు ఎక్కడున్నాయి? ఇలాంటి సమాచారం మాత్రం కనుక్కోవడం కస్టమర్లకు కష్టమైపోతున్నది. ఇలాంటి సమస్యలను తీర్చేందుకు కెచప్ సిద్ధమైంది.

ఫుడ్‌టెక్, ఫుడ్ రెకమండేషన్స్, ఫుడ్ డెలివరీ.. ఈరోజుల్లో చాలా కామన్‌గా మారిపోయింది. ఈ రంగంలో ఇప్పటికే చాలా స్టార్టప్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ మరికొన్నింటికి కూడా చోటుంది. సిరీ, గూగుల్ ప్లస్ వంటివి చాట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రెకమండేషన్స్‌ను అందిస్తున్నాయి. పుణెకు చెందిన క్వింటోతోపాటుగా ఇటీవలే ఈ రంగంలోకి అడుగుపెట్టిన గుర్గావ్‌కు చెందిన కెచప్ కూడా ఫుడ్ రెకమండేషన్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

వివిధ రెస్టారెంట్లు, చెఫ్స్, మెనూ, ఫుడ్ డెలివరీ సమాచారాన్ని చాలా ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే రెస్టారెంట్లలో అవసరమైన వివరాలను ఇస్తున్నాయి.

ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలి..? ఎలాంటి ఫుడ్‌ను ఆర్డర్ చేయాలి? అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికోసమే ఏర్పాటైంది కెచప్. కన్ఫ్యూజన్‌లో ఉన్న యూజర్లకు ప్రతిసారీ, ఎక్కడైనా మంచి ఫుడ్ రెకమండేషన్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెచప్ అంటోంది. ఇతర యాప్స్ మాదిరిగానే ప్రిన్సిపల్స్ ఉన్నప్పటికీ కెచప్ నాచురల్ లాంగ్వేజ్ ప్రొగ్రామింగ్, కన్జూమర్ రెకమండేషన్స్‌ను కూడా అందిస్తోంది. వ్యక్తుల అభిరుచి, ప్రవర్తన, వాతావరణం, నగర పరిస్థితులను బట్టి వ్యక్తిగత రెకమండేషన్స్‌ను అందిస్తామని కెచప్ టీమ్ అంటోంది.

కెచప్ కోర్ టీమ్

కెచప్ కోర్ టీమ్


పుస్తకం టు కెచప్ గ్యాంగ్..

నరేంద్ర కుమార్, చిరాగ్ తనేజా.. చాలాకాలం నుంచి మంచి మిత్రులు. ఢిల్లీ పరిసర ప్రాంతంలో మంచి ఫూడ్ అందించే ప్రదేశాల కోసం వీరు తరుచుగా అన్వేషిస్తుంటారు. ఓసారి చిరాగ్‌కు సర్జరీ జరిగింది. దాని కారణంగా ఆకలి తగ్గిపోయింది. భోజన ప్రియులైన వీరిద్దరూ లంచ్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఓ రెస్టారెంట్‌లో ఏదో ఓ ఫూడ్ ఐటమ్‌తో పనికానిచ్చేవారు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న జమాటో వంటి ఫూడ్ స్టార్టప్స్ మంచి రెస్టారెంట్ల పేర్లను సూచించిస్తున్నప్పటికీ, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలా మాత్రం కస్టమర్లకే వదిలేసేవి. దీంతో చిరాగ్, నరేంద్రలకు కూడా రెస్టారెంట్‌కు వెళితే ఏం ఆర్డర్ చేయాలో అర్థమయ్యేది కాదు. దీంతో తమలాంటి కస్టమర్ల కోసం నగరంలో మంచి ఆహారం దొరికే రెస్టారెంట్ల సమాచారం కోసం ఓ పుస్తకం రాయాలని నిర్ణయించారు.

ఈ స్టోరీని కూడా చదవండి

పుస్తకం రాయడం అంత ఈజీకాదని మొదలు పెట్టాకకానీ తెలియలేదు. అది టైమ్ టేకింగ్ ప్రాసెసని, అలాగే పూర్తి వివరాలు కూడా ఇవ్వడం వీలుకాదని వీరిద్దరికి తొందర్లోనే అర్థమైంది. దీంతో మరింత సమాచారం కోసం మరికొందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్‌లో కెచప్‌గ్యాంగ్ పేరిట ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

‘‘ఫేస్‌గ్రూప్‌లో మెంబర్లు తమ అభిప్రాయాలను, అనుభవాలను వివరించేవారు. నగరంలోని వివిధ రెస్టారెంట్లలో అవి అందించే వివిధ రకాల డిషెస్ గురించి చెప్పేవారు. ఈ సమాచారాన్ని గ్రూప్ మెంబర్స్‌కే కాకుండా మిగతా వారికి కూడా ఎందుకు అందించకూడదన్న ఐడియా అప్పుడే వచ్చింది. అలా మొబైల్ యాప్‌కు శ్రీకారం చుట్టాం’’ అని 30 ఏళ్ల చిరాగ్ వివరించారు.

హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాహుల్ మక్కర్‌ కూడా సోషల్ మీడియాలో ఫుడ్ గురించి ఎప్పటికప్పుడు అభిప్రాయాలందిస్తుంటారు. అలా అతను కూడా నరేంద్ర, చిరాగ్‌లతో కలిశారు. నగరంలోని వివిధ రెస్టారెంట్లు, ఈవెంట్ల వివరాలను బిపిన్ తనేజా అందిస్తున్నారు. యాప్ సక్సెస్ కావాలంటే మంచి టీమ్ ఉండాలనుకున్న చిరాగ్, నరేంద్ర ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థి అబ్దుల్ ఖలీద్‌ను తమతో చేర్చుకున్నారు. అప్పటివరకు హౌజింగ్‌లో పనిచేసిన ఖలీద్.. కో ఫౌండర్‌గా కెచప్‌లో చేరారు.

‘‘మా అందరి కామన్ థీమ్.. నగరంలో మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో వివరించడం. మనకు వంట గురించి తెలుసుంటేనే మంచి డిషెస్‌ను గుర్తించగలం. అందుకే మా టీమ్‌లో చేరే వ్యక్తుల మినిమం క్వాలిఫికేషన్ వంట చేయడం వచ్చి ఉండటం’’ అని చిరాగ్ వివరించారు.

వివిధ రకాల ప్రజల అభిప్రాయాల సమాహారంగా ఈ యాప్ ఏర్పడటం కారణంగా, కన్జూమర్ మంచి ఫుడ్‌, మంచి రెస్టారెంట్ల వివరాలను కెచప్ అందిస్తున్నది. ‘‘ఎవరై తమ ప్రాంతంలో మంచి మసాలా దోశ ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని కోరితే, అలాంటి రెస్టారెంట్ల వివరాలను క్షణాల్లో అందిస్తాం’’ అని చిరాగ్ చెప్పారు. సోషల్ మీడియా, బ్లాగ్‌లలో వివిధ రకాల ప్రజలు చెప్పిన అభిప్రాయాలను విశ్లేషించి, మంచి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది కెచప్ టీమ్. వీరు ఇచ్చే రెకమండేషన్లు చాలా నమ్మకమైనవాటిగా అందరూ గుర్తిస్తారు.

‘‘ఢిల్లీలోని సోడా బాటిల్‌ ఓపెనర్ వాలా రెస్టారెంట్‌లో బెర్రీ పులావ్‌ ఐటమ్‌ను తప్పనిసరిగా ఓ సారి రుచి చూడాల్సిందే. ఈ ఐటమ్ చాలా బాగుంటుందని మా కస్టమర్లు అంటుంటారు. దీని వివరాలు మా యాప్‌ను వినియోగించే ఓ ఫ్రెండ్ అందించారు. అలాగే బెర్రి పులావ్‌ డిష్‌ను రెకమండ్ చేసిన తన స్నేహితుల వివరాలను కూడా ఆ యూజర్ అందిస్తారు’’ - చిరాగ్ -

గ్రోత్..

గత ఏడాది నవంబర్‌లో కెచప్‌ టీమ్ తమ యాప్‌ను ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గుర్గావ్ ఏరియాలో వెయ్యిమందికిపైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఐఓఎస్‌లో కూడా త్వరలోనే కెచప్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. అలాగే ఢిల్లీలో జరిగే ఏషియన్ హాకర్స్ మార్కెట్, పాలేట్ ఫెస్ట్-2015, ఢిల్లీ కాక్‌టైల్ వీక్ ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో కెచప్ పాలు పంచుకుంటోంది. ఈ ఫుడ్ ఫెస్టివల్స్ గురించి, ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుందో కెచప్ యాప్‌లో వివరాలు అందిస్తోంది. ఈ సమాచారం ఆధారంగా భోజన ప్రియులు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటారు.

సొంతమూలధనంతోనే..

ప్రస్తుతానికైతే కెచప్ సొంత మూలధనంతోనే ఏర్పాటైంది. ఇందులో పనిచేసేవారి కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ కొంత పెట్టుబడి పెట్టారు. ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులను ఆశిస్తోంది కెచప్ టీమ్. అలాగే మంచి మెంటర్‌షిప్, గైడెన్స్ ఇచ్చే వారి కోసం కూడా ఎదురుచూస్తోంది. ప్రస్తుతానికైతే మూడువేల డిషెస్ వివరాలు అందిస్తున్న కెచప్ ఈ సంఖ్యను త్వరలోనే 15 వేలకు చేర్చాలని ప్లాన్ చేస్తున్నది. వచ్చే ఏడాది కల్లా ఈ డిషెస్ సంఖ్యను 2 లక్షలకు చేర్చాలనుకుంటోంది. వచ్చే మూడు నెలల్లో నార్త్ ఇండియాలోని మరి కొన్ని నగరాలకు విస్తరించి, అమృత్‌సర్, లుధియానా, చండీగఢ్, జమ్మూ కశ్మీర్, లక్నో, షిమ్నా, మనాలిలో దొరికే డెలిషస్‌ వివరాలు కూడా అందించాలనుకుంటోంది. జమాటో, స్విగ్గీ మాదిరిగానే లీడ్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా కెచప్ టీమ్ ఉంది.

యువర్‌స్టోరీ టేక్..

ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే సిరీ, గూగుల్ నౌ వంటివి మంచి రెకమండేషన్స్ అందిస్తూ ఫుడ్ స్టార్టప్స్ రంగాన్ని ఏలుతున్నాయి. అలాగే గత ఏడాది అక్టోబర్‌లో మ్యాజిక్ టైగర్ కూడా ఏఐ బేస్డ్ స్టార్టప్ జోయోను సొంతం చేసుకుని యూజర్లకు మంచి వివరాలు ఇస్తున్నది. ఫూడ్, ఫుడ్ రిలేటెడ్ ప్రాడక్ట్స్ గురించి చాట్ ద్వారా మ్యాజిక్‌ టైగర్ తమ రెకమండేషన్లు అందిస్తున్నది. 

ఇక పుణెకు చెందిన క్వింటో కూడా ఫాసాస్ ఫౌండర్ జైదీప్ బర్మన్ నుంచి పెట్టుబడులు స్వీకరించింది. ఇప్పుడు కెచప్ కూడా వీటి మాదిరిగానే ఏర్పాటైనప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి రెవెన్యూను సంపాదించలేకపోయింది. యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఫేస్‌బుక్ పేజ్ మెంబర్లతో ఎలాంటి ఆదాయాన్ని సంపాదించలేరు. ఇన్వెస్టర్లు, మార్కెట్‌ సంఖ్యను పెంచుకోవడం ద్వారానే రెవెన్యూను ఆర్జించొచ్చు. 

ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందడం, ఆదాయాన్ని ఆర్జించడంపై కెచప్ దృష్టిసారించాలి. స్విగ్గీ వంటి సంస్థలు మరిన్ని పెట్టుబడులు స్వీకరిస్తున్న సమయంలో వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా రెకమండేషన్స్ ఇవ్వడం సాధ్యమవుతుందా? అన్న అంశాన్ని కూడా కెచప్ పరిశీలించాలి. ఇప్పటికే స్విగ్గీ సోషల్ రెకమండేషన్ మాడ్యూల్స్‌ను అందిస్తున్నది. పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాదు, చాలా రెస్టారెంట్లతో టైప్, పార్ట్‌నర్‌షిప్‌లను పెట్టుకుంటున్నాయీ సంస్థలు.

అయితే ఫుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఫుడ్ సర్వీస్ మార్కెట్ 50 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా నిపుణులు అంచనా వేస్తున్నారు. కెచప్‌ను ప్రారంభించిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్లు అభివృద్ధి కోసం ఎంతో కృషిచేస్తున్నారు. కొద్దికాలంలోనే ఎంతోమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరపడమే ఇందుకు ఉదాహరణ. అయితే ఈ రంగంలో ఇప్పటికే వేళ్లూనుకుపోయిన పోటీదారులతో పోటీని వీరు తట్టుకోగలరా అన్నదే ప్రశ్న.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టో్రీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి