నేతలను ఆన్‌లైన్‌లో ఉతికి ఆరేసే వేదిక ఓట్ రైట్

నేతలను ఆన్‌లైన్‌లో ఉతికి ఆరేసే వేదిక ఓట్ రైట్

Wednesday September 02, 2015,

3 min Read

ఢిల్లీ ఎన్నికలు పూర్తయ్యి అందరూ ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో బెంగళూరుకు చెందిన విక్రమ్ నలగంపల్లి, శిరీష కోగంటి, లక్ష్మి దాసం చాలా ఆసక్తికరమైన ఓ పని చేశారు. ఓట్ రైట్ డాట్ కామ్ (Voterite.com) అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇది ఓటరుకు, పోటీ చేసిన అభ్యర్థికి మధ్య సమాచార మార్పిడికి దోహదపడుతుంది.

ఓట్ రైట్ లోగో

ఓట్ రైట్ లోగో


ఓట్ రైట్ ఐడియా

ఓట్ రైట్ వెబ్ సైట్.. వినియోగదారుల సమస్యల ప్రస్తావనకు ఒక వేదిక. దీని ద్వారా ఎవరైనా సమస్యలు తెలియజేయవచ్చు. ఇలాంటి సమస్యలపై ఉమ్మడిగా చర్చించడం ద్వారా వాటికి పరిష్కారాలు లభిస్తాయని ఓట్ రైట్ విశ్వసిస్తోంది. రాజకీయ నాయకులను కూడా ఈ సైట్ లో భాగస్వాములు కావాల్సిందిగా ఓటరైట్ కోరుతోంది. తద్వారా సమాజంలోని సమస్యలను నేరుగా తెలుసుకునే వీలవుతుందని చెబుతోంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క రాజకీయ నాయకుడు కూడా భాగస్వామి కాలేదు. అయితే గత నెలలో ప్రారంభమైన ఈ వెబ్ సైట్‌లో ఇప్పటివరకూ 7వందల మంది సాధారణ ప్రజలు లాగిన్ అయ్యారని విక్రమ్ చెప్పారు. 

“ రాజకీయ నేతల దగ్గరకు వెళ్లలేనివారికి, పరిపాలనా భవనాల చుట్టూ తిరగలేనివారికి ఈ వెబ్ సైట్ ద్వారా సహాయం చేయాలనేది మా ఆలోచన. వెబ్ సైట్లో తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం లభించాలనేది మా లక్ష్యం. ఇదో పెద్ద సామాజిక వేదిక. ఎవరికివారు ఇక్కడ తమ సమస్యసు ప్రస్తావించుకోవచ్చు. ఇలా ఓ ప్రాంతంలోని వారంతా ఒకరికొకరు అనుసంధానం కావచ్చు.” అని తమ ఆలోచనను పంచుకున్నారు విక్రమ్. ఉదాహరణకు బెంగళూరులోని ఇందిరానగర్ లో రహదారులు పాడైపోయాయి. ఆ ప్రాంతవాసులంతా తమ సమస్యను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో వారు నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ ఇందిరానగర్ ఎమ్మెల్యే కూడా ఓట్‌ రైట్ లో భాగస్వామి అయితే అప్పుడు స్థానికులంతా ఆయనతో సమస్యను నేరుగా ప్రస్తావించి పరిష్కారం కోసం అడిగే అవకాశం ఉంటుందని '' వివరించారు విక్రమ్.

సామాజిక అనుసంధానానికే కాకుండా ఓట్ రైట్ ఒక డిజిటల్ డైరీగా కూడా ఉపయోగపడుతుంది. ఓ అభ్యర్థికి సంబంధించిన ఐదేళ్ళ పనితీరు అందులో నమోదు చేయచ్చు. అ వ్యక్తి ఆ ఐదేళ్లలో చేసిన పనులు, వైఫల్యాలు.. లాంటి వాటిని ఇందులో పొందుపరుస్తారు. దీన్ని బట్టి అధికారంలో ఉన్న ఆ వ్యక్తి ఈ ఐదేళ్లకాలంలో ఎంతమేర పనికొచ్చే పనులు చేశారు.. అతణ్ణి తిరిగి అధికారంలోకి తీసుకురావచ్చా.. లేదా అనే అంశాన్ని నిర్ణయించుకోవచ్చు.

దీని ద్వారా ఆదాయం ఎలా వస్తుంది..?

ఓట్ రైట్ ద్వారా ఆదాయం ఎలా వస్తుంది అన్నప్పుడు తాను వ్యాపారవేత్తల ప్రకటనల ద్వారా పొందగలనని ధీమాగా చెప్పాడు విక్రమ్. ఓ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా ఆన్ లైన్‌లో ఒక్కతాటిపైకి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలను సంప్రదించి ప్రకటనలు పొందవచ్చనేది విక్రమ్ ఆలోచన. అయితే ఇప్పటికిప్పుడు ఆదాయం గురించి ఆలోచించట్లేదు.. ప్రస్తుతం తన తక్షణ కర్తవ్యం వీలైనంతమందిని ఓట్ రైట్ లో భాగస్వాములను చేయడమే.!

సొంతఖర్చులతో దీన్ని ప్రారంభించాడు విక్రమ్. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగొచ్చేశాడు. వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి ఈ ఐడియా వచ్చింది. భారత్‌లో గ్యాస్ కనెక్షన్ పొందడం, ఫోన్ కనెక్షన్ పొందడం లాంటి సమస్యలు ఎదుర్కొన్న విక్రమ్‌కు ఇలాంటి ఒక వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. సేవా కేంద్రాలైన ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు మెరుగుపడకుండా.. రాజకీయ నాయకత్వం మారినంత మాత్రాన ఉపయోగం ఉండదనేది విక్రమ్ భావన. అలాంటప్పుడు వాళ్ళకు జవాబుదారితనం ఉండదంటారు. “ రాజకీయ నాయకులందరినీ ఈ దిశగా నడిపించాలంటే ముందు ఓటర్లు వాళ్ల వాయిస్ వినిపించాలి. ప్రస్తుతం ఎక్కువ శాతం ఓటర్లు 18 నుంచి 35 ఏళ్లలోపువారే. ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో చాలా మంది ఓటేయడానికి కూడా ముందుకు రావట్లేదు. ఈ అంతరాన్ని పూడ్చడమే ఓట్ రైట్ లక్ష్యం” అంటారు విక్రమ్.

మా ఆలోచన

ఆలోచన బాగుంది.. కాని ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే దిశగా ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే ప్రతిష్టాత్మకం. ఇప్పటికే గ్రీన్ పీస్, ఆవాజ్ లాంటి సంస్థలు ఈ దిశగా పెద్ద ఎత్తున కృషిచేస్తున్నాయని చెప్పారు విక్రమ్.

ఓట్ రైట్ యూజర్ అగ్రిమెంట్ ప్రకారం.. దీని పరిధి తక్కువ. అంతేకాక.. ఓట్ రైట్ వాడడం వల్లే తలెత్తే వివాదాలకు తాను బాధ్యత వహించదని స్పష్టంచేసింది. ప్రజలకు ఇదొక మంచి వేదిక అని చెప్పినప్పుడు ఓట్ రైట్ కీలక పాత్ర పోషించాలని అందరూ కోరుకుంటారు. తాను వేదిక కల్పిస్తానని చెప్తున్న ఓట్ రైట్.. సమస్యలను చూస్తూ ఊరుకోకుండా.. వాటి పరిష్కారం కోసం తమదైన పాత్ర పోషిస్తేనే ఉపయోగం ఉంటుంది.. లేకుండా పెద్దగా పట్టించుకోరు.

విక్రమ్, సహ వ్యవస్థాపకుడు

విక్రమ్, సహ వ్యవస్థాపకుడు


కేవలం పర్యవేక్షణకే పరిమితమైతే ఎలా ఉంటుందని కూడా ఓట్ రైట్ ఆలోచిస్తోంది. వ్యాపారం, రాజకీయాలు భిన్నధృవాలు అని అందరికి తెలిసిందే. అలాంటప్పుడు వ్యాపారవేత్తలు ఓట్ రైట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ముందుకొస్తారు..? ఇక లోకల్ పొలిటీషియన్ గురించి వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకెవరు ముందుకొస్తారు..?

ఇటీవలికాలంలో చాలా రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఓట్ రైట్ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయ నాయకులను తన వైపు మళ్లించుకోగలిగితే సక్సెస్ అయినట్లే..! అప్పుడే ఎన్నికైన రాజకీయ నాయకులకు జవాబుదారీతనం పెరుగుతుంది.