భారీ జీతాలు వదిలి ఫ్యాషన్ పరిశ్రమలో దూకిన ఇద్దరు ఫ్రెండ్స్

భారీ జీతాలు వదిలి ఫ్యాషన్ పరిశ్రమలో దూకిన ఇద్దరు ఫ్రెండ్స్

Thursday November 19, 2015,

4 min Read

పెప్పీకి గుండెకాయలాంటిది వర్లీలోని హోమ్ ఆఫీస్. దానికి.. నాడీ కేంద్రం బాస్ క్యాబిన్. ఉత్తేజితమైన నాడులతో, క్రమపద్ధతిలో నిర్వహించబడే వీరి బేస్ క్యాంప్ ఎప్పుడూ కూడా పరిహాసాలతో కూడిన వాదోపవాదనలతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంది. రెండు నాజూకైన ధమనులు మొత్తం కంపెనీకి అవసరమైన రక్తాన్నీ, జీవాన్ని అందిస్తూ.. అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆ రెండు ధమనులు.. ఇద్దరు యువ ప్రాణ స్నేహితులు త్రిశ్లా మెహతా, యాసిని కొఠారి. వాళ్లిద్దరూ శ్రేష్టమైన మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల దృష్టిలో మంచి సమయం అంటే ఇప్పటికిప్పుడే వ్యాపారాన్ని ప్రారంభించి దానిని ఎవరి ఊహలకూ అందనంత ఎత్తులో నిలపాలని భావిస్తున్నారు.

లండన్ ఫ్యాషన్ కాలేజీలో చదువుకున్నప్పుడు రూమ్‌మేట్స్‌గా ఉంటున్నప్పటి నుంచి వీళ్లిద్దరూ కలిసి అనేక అంశాలపై అధ్యయనం చేశారు. త్రిశ్లా, యాషిని ఇద్దరూ ఒకే వ్యక్తిత్వం గల యువతులు. వాళ్లిద్దరూ కొన్నేళ్లపాటు కలసి ఉండటంతో ఇద్దరూ పరిపూర్ణత సాధించారు. కోర్సు చేసే సమయంలో ఇద్దరూ కలిసి నేర్చుకున్నారు, కలిసి ఎదిగారు.

image


‘‘లండన్‌లో ఏడాది పాటు యాషినితో కలసి ఉండటం వల్ల.. నా లక్ష్యాన్ని సాధించడానికి ఆమెతో కలసి పనిచేయవచ్చన్న నమ్మకం కుదిరింది. వంట చేసుకోవడం, క్లీనింగ్, లాండ్రి, అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకోవడం మా ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేసింది. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, అనుకూలతల కారణంగా మేం ఒక బలమైన టీంను తయారు చేయగలమన్న నమ్మకం కలిగింది ’’ అంటూ ఆనందదాయకమైన గతాన్ని గుర్తు చేసుకున్నారు త్రిశ్లా.

మాస్టర్ డిగ్రీకి సంబంధించి పరిశోధన చేస్తున్నప్పుడు, ఆమె ఓ విషయం గుర్తించారు. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్లకు విసృతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ పరిధి సామాజికంగా తెలిసినవారికి, క్లయింట్ మీద ఆధారపడేవారికి, క్లయింట్లకు మాత్రమే పరిమితమైపోతోంది. ‘‘వారికి సంబంధించిన వివరాలు ఒక డిజిటల్ ఫ్లాట్‌ఫాం ద్వారా అందిస్తే దానిని పెద్ద సంఖ్యలో సామాన్యులు అందుకోగలగాలి. సహజంగానే ఆలోచనకు ఆకారం, రూపం ఇచ్చేందుకు నేను నేరుగా యాషిని వద్దకు వెళ్లాను’’ అంటారు త్రిశ్లా.

కాఫీ తాగేటప్పుడు, రాత్రి పూట భోజనం చేసేటప్పుడు వ్యాపార సంబంధమైన చర్చలు కొనసాగేవి. దాని ఫలితంగా ఈ ఆలోచన పుట్టింది. తాము తలపెట్టి కార్యక్రమం చాలా పెద్దదన్న విషయం వాళ్లు గ్రహించగలిగారు ‘‘మేం ఒక ప్రత్యేకమైన ఫ్యాషన్ వ్యాపారాన్ని నిర్మించాలని కోరుకున్నాం. విశ్వసనీయత, సృజనాత్మకత దానిని మూలస్తంభాలు కావాలని నిర్ణయించుకున్నాం. దాని కోసం ప్రతిభ కలిగిన కొత్తతరం ఫ్యాషన్ , లైఫ్ స్టయిల్ డిజైనర్లను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.’’ అంటు తమ వ్యూహాలను వివరించారు.

‘‘దీనిని ఆచరించడానికి అత్యంత అనుకూలమైన మార్గం.. డిజైనర్లు, కస్టమర్లు ఉండే ప్రాంతాన్ని పర్యావరణపరంగా పారదర్శకంగా నిర్మించడమేనని భావించాం. దీని వల్ల వారు ఒకరితో మరొకను నేరుగా మాట్లాడతారు, ఒకరి స్టయిల్ మరొకరికి సులభంగా అర్ధమవుతుంది. ఇందులో అమ్మకానికి సంబంధించిన కార్యకలాపాలేవీ జరగవు. ఇదే కలర్డ్ ట్రంక్ కాన్సెప్ట్. మా నమ్మకమే, మేం భారీజీతాలు పొందే ఉద్యోగాలను వదులకునే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.’’ అంటారు యాషిని.

‘‘ కలర్ ట్రంక్ ప్రారంభించే ముందు మాకు.. వ్యవస్థాపకంగా మేం అడుగు వేయడానికి వ్యతిరేకంగా చాలా సలహాలు వచ్చాయి. మంచి జీతాలు, భద్రతతో కూడిన ఉద్యోగాల్ని వదులుకోవడం తెలివైన పని కాదని, మేం తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని.. చాలా మంది మమ్మల్ని హెచ్చరించారు.’’ అంటారు త్రిశ్లా. ఉద్యోగాలను వదిలేసి చాలా పరిమితంగా తాము దాచుకున్న డబ్బులనే పెట్టుబడిగా పెట్టి వ్యాపార రంగంలోకి దిగారు. ఆరంభంలో ఆర్థిక పరమైన అవరోధాలను ఎదుర్కొన్నారు.

సంస్థను ప్రారంభించిన తొలినాళ్లలో వాళ్లు ఇంటిని విడిచి బయటకు వెళ్లి పనిచేయాల్సి వచ్చేది. అంటే తమ మేలు కొరుకునే వారి సంరక్షణ నుంచి అయిష్టంగానైనా బయటకు వెళ్లాల్సి వచ్చింది.

image


‘‘మహిళలుగా మేం ఒక సురక్షితమైన భవిష్యత్తును కోరుకన్నాం, ఎటువంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోలేదు. బహుశా అందుకే ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఏది ఏమైనా మా కుటుంబ సభ్యులు కూడా మాకు అండగా నిలబడ్డారు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు కావాల్సిన అత్మవిశ్వాన్ని అందిస్తూ మేం ధైర్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు సాయపడ్డారు.’’ అంటూ మనసులోని మాటల్ని బయటపెట్టారు త్రిశ్లా.

ఒక విజయవంతమైన మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడనే అభిప్రాయం ఒకటి ఉంది. కానీ దీనిని తోసిపుచ్చేందకు నిదర్శనం త్రిశ్లా, యాషిని వారికి ఎప్పుడు కూడా ఎవరి అవసరం రాలేదని తేలిపోయింది. ద్వేషించేవాళ్లు ద్వేషించినా.. సందేహాలు వ్యక్తం చేసేవాళ్లు సందేహాలు వ్యక్తం చేసినా, వారి యొక్క అసాధారణ పట్టుదల ముందు అవన్నీ చాలా బలహీనమైపోయాయి.

‘‘ ఫ్యాషన్ అనేది స్త్రీ కేంద్రంగా నడిచే పరిశ్రమ. మేం ఎప్పటికప్పుడు మమ్మల్ని నిరూపించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే వయస్సు కూడా ముఖ్యం. కాస్త వయసు మళ్లిన స్త్రీలు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అప్పుడే కాలేజ్ నుంచి బయటపడిన విద్యార్థులుగా మేం తరచూ తప్పులు చేస్తుంటాం.. మేం యుక్తితో బ్లాగ్ కూడా నడుపుతున్నాం. మేం ధృడంగా ఉంటూ మా వ్యాపారం గురించి ప్రజలందరికీ తెలిసేలా చేయాలి.’’ అంటారు త్రిశ్లా.

‘‘ మేం మా కోసం ఉన్నత ప్రమాణాలు నిర్దేశించుకున్నాం. వాటిని సాధించడానికి భూమికి, స్వర్గానికి మధ్య కదలాడుతున్నాం. గందరగోళ పరిస్థితులను వ్యవస్థికృతం చేయవచ్చని మేం బలంగా నమ్ముతాం. ఎందుకంటే రోజువారి కార్యకలాపాలు ఊపిరిసలపనంత తీవ్రంగా, గందరగోళంగా ఉంటాయి కానీ ఏ రోజుకారోజు వాటిని చక్కదిద్దుకోవచ్చు.’’ అని చెబుతున్నారు యాషిని.

ది కలర్డ్ ట్రంక్ వెనుక వందమంది డిజైన్లర్లు సైనికుల్లా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక బ్రాండ్లు ఉన్నాయి. సోషల్ మీడియాకి సంబంధించి అనేక పేజీల ద్వారా దాదాపు 8 వేలమంది వీక్షకులు ఉన్నారు. ప్రారంభించి ఇప్పటికి 9 నెలలే అయినా, ప్రస్తుతం నెలకి 190 శాతం వృద్ధి కనిపిస్తోంది. వాళ్ల సరికొత్త వెబ్ సైట్ అక్టోబర్ 22న ప్రారంభించారు. వాళ్లు వేరు వేరు రంగాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులో పరిశ్రమలు, వినియోగదారులు ఎదుర్కొనే ప్రయోగాత్మక అంశాలు, ఇంట్లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే ఫ్యాషన్ మ్యాగ్జైన్లు వంటి వాటిలోకి ఈ ఏడాది చివరికల్లా ప్రవేశించాలని భావిస్తున్నారు.

‘‘ముందుకు ప్రయాణించే క్రమంలో ఒక ఫ్యాషన్ ఫ్లాట్ ఫామ్ కంటే విస్తృతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాం. మేం అగ్రిగేటర్లుగా ఎదగాలనుకుంటున్నాం. బహుశా ఒక యాక్సిలేటర్ గా లేదా ఇంకుబేటర్ గా మేం సరఫరా చేసే దుస్తుల్లో పూర్తి స్థాయి సృజనాత్మకతను చూపించాలనుకుంటాం. ఇందుకోసం ఆధునికంగా వచ్చే డిజైనింగ్ ట్యాలెంట్ ని వాడుకుంటాం.’’ అని చెబుతున్నారు.