ప్రయోగం చేద్దామనుకున్నారు..అంతలోనే పాపులర్ అయింది! విశాఖలో ఓ స్టార్టప్ సక్సెస్ స్టోరీ!!

ప్రయోగం చేద్దామనుకున్నారు..అంతలోనే పాపులర్ అయింది! విశాఖలో ఓ స్టార్టప్ సక్సెస్ స్టోరీ!!

Thursday January 14, 2016,

3 min Read

దాదాపు ఏడాది క్రితం సంగతి ఇది. వైజాగ్ గీతం కాలేజీలో డిజిటల్ మార్కెటింగ్, స్టార్టప్ లపై ఓ సెషన్ జరిగింది. అందులో ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ప్రయోగాత్మకంగా వైజాగ్ హౌసింగ్ డాట్ కామ్ ని ప్రారంభించారు. అది అప్పుడు జస్ట్ ఎక్స్‌పరిమెంటలే. కానీ ఇప్పుడా స్టార్టప్ వైజాగ్ లో యమ పాపులర్ అయింది. ఎంతగా అంటే.. రెంట్ హౌస్, బై అండ్ సెల్ లాంటి సర్వీసులకు అది కేరాఫ్ గా మారింది. దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న సైట్లు కూడా వైజాగ్ లోని ప్రాపర్టీస్ ని లిస్టింగ్ చేయడం ప్రారంభించాయి.

image


“పూర్తి స్థాయి కమర్షియల్ ప్లాట్ ఫాంగా మేం మారాలనుకోవడం లేదు,” వెంకటేశ్వర్లు

వైజాగ్ హౌసింగ్ లో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వారి దగ్గర నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయమని వెంకటేశ్వర్లు చెబుతున్నారు.

వైజాగ్ హౌసింగ్ అందించే సేవలు

సాధారణ హౌసింగ్ సైట్ లు ఇచ్చే సేవలను ఈ సైట్ అందుబాటులోకి తెచ్చింది. కానీ పూర్తిగా ఇది చంటిగాడు లోకల్ టైప్. స్థానికతకే ప్రాధాన్యం. వైజాగ్ లో ఉండే మూడు నాలుగు మిలియన్ల జనాభాకి ఇది అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ సిటీ, ఆంధ్రా ఇన్వెస్ట్ మెంట్ జోన్ గా మారిన సిటీ ఆఫ్ డెస్టినీలో ఇళ్లు కొనాలనుకున్నా, లేదా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా ఈ సైట్ పక్కా సమాచారం అందిస్తుంది. ఇందులో కొన్ని సేవలకు కొంచెం ప్రియారిటీ ఎక్కువ. అవేంటో చూద్దాం..

  1. ఇళ్లు అమ్మకం, కొనడం, రెంట్, కమర్షియల్ ప్రాపర్టీలు, షాప్స్, హాస్పిటల్స్ తాలూకు సమాచారం ఇందులో ఉంటుంది.
  2. చిన్నా చితకా వ్యాపారులు.. అంటే శానిటరీ, ఫర్నిచర్ లాంటివి అమ్మే షాపులు ఈ వెబ్ సైట్ ద్వారా బిందాస్‌గా బిజినెస్ చేయొచ్చు.
  3. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇందులో రిజిస్టర్‌ చేస్తే ఫీజు బాదుడేం ఉండదు. జస్ట్ నామినాల్ అంతే.
  4. రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ లు ఈ సైట్ ద్వారా అమ్మకాలు సాగించొచ్చు.
  5. ఇప్పటి వరకూ యాభై వేల ప్రాపర్టీలు ఇందులో లిస్ట్ అయ్యాయని వెంకటేశ్వర్లు చెబుతున్నారు.
  6. లిస్ట్ అయిన ప్రాపర్టీలను సర్వేచేసి జెన్యూనిటీ తెలపడానికి ఓ టీం పనిచేస్తుంది.
  7. వైజాగ్ సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతానికి బిటుబి

బిటుబి సెక్టార్ లోనే ప్రస్తుతానికి కాన్సన్ ట్రేట్ చేస్తున్నామని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే వారికి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకూ పదివేల మంది యాడ్ అయ్యారు. 2,500మంది సైట్ ద్వారా ప్రయోజనం పొందారు. ఇందులో కొనడం అమ్మకంతోపాటు, రెంట్ లాంటి సర్వీసులున్నాయని చెబుతున్నారు. యూజర్ బేస్ ఎక్కువగా ఉన్నందున కంపెనీలకు ఇదొక అద్భుత అవకాశమంటున్నారు. కస్టమర్ల దగ్గర నుంచి ఎలాంటి సబ్ స్క్రిప్షన్ వసూలు చేయకపోవడం వల్ల వ్యాపారం బిటుబి గానే సాగుతుందన్నారాయన.

image


వైజాగ్ హౌసింగ్ టీం

వెంకటేశ్వర్లు వైజాగ్ హౌసింగ్ ఫౌండర్లలో ఒకరు. గీతమ్ నుంచి బీబీఎం, గాయత్రి కాలేజీ నుంచి ఎంబీయే పూర్తి చేసిన వెంకటేశ్వర్లు.. దాదాపు 9 ఏళ్ల పాటు కోకాకోలా, రిలయన్స్ లాంటి కంపెనీల్లో పనిచేశారు. తర్వాత టీచింగ్ పై ఉన్న మక్కువతో గీతంలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఇక్కడ దాదాపు 6 ఏళ్లు పూర్తి కావొస్తున్నాయి. అరుణ్ కుమార్ ఈ స్టార్టప్ కు మరో కో- ఫౌండర్. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి మెరైన్ ఇంజినీరింగ్ చేసిన ఆయన దాదాపు 15 ఏళ్ల పాటు హెచ్ఎస్‌బీసి లో పనిచేశారు. నాలుగేళ్ల క్రితం గీతంలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు సంతోష్ అనే మరో టీం మెంబర్ ఉన్నారు. బీటెక్, ఎంబీయే కంప్లీట్ చేసిన సంతోష్- ప్రమోషన్స్, బ్రాండ్ బిల్డింగ్ వ్యవహారాలు చూస్తున్నారు.

సవాళ్లు, ఇతర ప్లేయర్లు

వైజాగ్ హౌసింగ్ డాట్ కామ్ కి కొన్ని పరిమితులున్నాయి. సిటీ దాటి బయటకి వెళ్లడానికి లేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైజాగ్ సిటీ లవర్స్ ఇక్కడి ప్రాపర్టీ, ఇతర సేవలను పొందొచ్చు. ఈ రకంగా ఈ పరిమితులను అధిగమించొచ్చంటున్నారు వెంకటేశ్వర్లు. ఇక ఇతర పోటీదారుల విషయానికొస్తే- ఇప్పుడిప్పుడే గ్లోబల్ ప్రాపర్టీ సంస్థలు వైజాగ్ ప్రాపర్టీ లను లిస్టింగ్ చేస్తున్నాయి. అయితే స్థానికంగా బలమైన యూజర్ బేస్ ఉన్న తమకు- వీరి నుంచి పోటీ పెద్దగా ఉండదని వెంకటేశ్వర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాలికలు

మొదలుపెట్టి దాదాపు 8 నుంచి 9 నెలలు కావస్తోంది. బలమైన యూజర్ బేస్ ఉంది. ఇక ఫండింగ్ వస్తే మరింత మందికి సేవలు అందించగలమని వెంకటేశ్వర్లు చెబుతున్నారు. క్రెడాయ్ లాంటి సంస్థలతో కలసి ప్రాపర్టీ లిస్టింగ్ సేవలను అందిచడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా మొబైల్ ప్లాట్ ఫాం లోకి రావాలని చూస్తున్నట్లు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.

“ పెట్టుబడులు పెట్టడానికి క్రౌడ్ ఫండింగ్ వచ్చినా ఆహ్వానిస్తాం- వెంకటేశ్వర్లు”