మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేసి భద్రపరిచే తెలుగు స్టార్టప్ 'ఈకిన్ కేర్'

మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేసి భద్రపరిచే తెలుగు స్టార్టప్ 'ఈకిన్ కేర్'

Wednesday October 21, 2015,

3 min Read

హెల్త్ కేర్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ‘ఈకిన్ కేర్’(ekincare.com) ను మొదటి సారి యువర్ స్టోరీ కలసి నప్పుడు సాధారణ వెబ్ పోర్టల్ గా సేవలందించే స్టార్టప్. హైదరాబాద్ కేంద్రంగా 2014లో ప్రారంభమైన ఈ స్టార్టప్ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకుపోతోంది.మామూలు స్టార్టప్స్‌తో పోలిస్తే ఈకిన్ కేర్ ఇచ్చే సేవలు చాలా ఉపయోగపడేవే.

‘మా వెబ్ సైట్ లోఒక సారి రిజిస్ట్రర్ అయిన క్లైంట్ హెల్త్ రికార్డులు కలకాలం ఉంటాయి’ అంటారు ఫౌండర్ కిరణ్ కుమార్ కలకుంట్ల

ఏదైనా ఆసుపత్రికి వెళ్లి మనం తీసుకున్న ట్రీట్‌మెంట్ వివరాలకు సంబంధించిన ఫైల్‌ను ఆన్ లైన్లో జాగ్రత్తగా భద్రపరిచే సాధనమే ఈకిన్ కేర్.

image


హెల్త్ స్కోర్

మీ హెల్త్ స్కోర్‌ని చెప్పే సరికొత్త టూల్ 'హెల్త్ స్కోర్' అంటున్నారు కిరణ్. యూజర్ తనకు సంబంధించిన హెల్త్ రికార్డులను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. వాటి ఆధారంగా పూర్తి స్థాయి విశ్లేషణ జరుపుతారు ఈకిన్ కేర్ వాళ్లు. వాటితో ఓ రిపోర్టు తయారు చేసి మీకు అందిస్తారు. ఇందులో మీ హెల్త్ స్కోర్ వస్తుంది. రికార్డులను పరీక్షించి డయాబెటిస్, బ్లడ్ ప్రషర్‌తో పాటు అలాంటి సమస్యలు వచ్చే అవకాశాలను ఏమైనా ఉన్నాయోమో చెబుతారు. దీంతో యూజర్‌ ముందుగా అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. తమ పక్కా అనాలసిస్ అంటోంది ఈకిన్ కేర్ టీం.

‘'హైదరాబాద్ ఐటి ఉద్యోగుల్లో చాలా మంది డయాబెటిస్, బిపి బారిన పడుతున్నారు. ఇది ఈకిన్ కేర్ సర్వేలో తేలింది. అయితే మేం చెప్పేదాకా ఇలాంటి వాటి బారిన పడుతున్నట్లు వారికి సైతం తెలియదు’' - కిరణ్

యూజర్ ఫ్రెండ్లీ

ఈ స్టార్టప్‌లో హెల్త్ రికార్డులు అప్ లోడ్ చేయడం చాలా సులభం. గతంలో 256 బైట్ల స్టోరేజ్ ఎన్‌క్రిప్ట్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని మూడింతలు చేశారు. ఎంతో సౌకర్యవంతంగా ఈకిన్ కేర్ సేవలను వినియోగించుకోవచ్చు. పేపర్ పై రాసే మెడికల్ రికార్డులను పూర్తి డిజిటలైజేషన్ చేయడమే ఈ స్టార్టప్ లక్ష్యం. దీంతో యూజర్‌కి సంబంధించిన రికార్డును అప్ లోడ్ చేయడం ద్వారా డాక్టర్ దగ్గరకు వెళ్లే టప్పుడు మెడికల్ రికార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల రికార్డులకు సంబంధించిన వివరాలు ఆఫీసు నుంచి పిల్లలూ చూడొచ్చు. టూర్‌లో ఉన్నప్పుడు మనతో కూడా రికార్డులు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదు ఫ్యామిలీ మేనేజ్‌మెంట్ వీళ్ల టార్గెట్. ఎవరైనా ఓ వ్యక్తి సంబంధించిన రికార్డులు ఉంటే వారి ఫ్యామిలీ మెంబర్స్‌వి కూడా అక్కడే నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే యూజర్ ఐడి‌తో లాగిన్ కావొచ్చు.

image


ఈకిన్ కేర్ టీం

కిరణ్ కమార్... ఈకిన్ కేర్ ఫౌండర్. ఏటి అండ్ టీ తోపాటు ప్రాడక్ట్ అండ్ మార్కెటింగ్‌లో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. దినేష్ సంస్థ కో ఫౌండర్. ఈయన ఆపరేషన్స్ చూసుకుంటున్నారు. జిఈ హెల్త్ కేర్‌తో పాటు సేల్స్ అండ్ ఆపరేషన్స్ లో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఈయనతో పాటు 26 మంది సభ్యులు ఇందులో పనిచేస్తున్నారు.


యూజర్ బేస్

ఈకిన్ కేర్‌లో ఎవరైనా ఉచితతంగానే రిజిస్టర్ చేసుకుని, హెల్త్ రికార్డులను భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. ఈ సైట్ కి 150,000 డ్యాటా పాయింట్స్ ఉన్నాయి.ప్రతి నెలా 50% పెరుగుదల నమోదు చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్లు కొత్తగా తమ డేటాను అప్ డేట్ చేస్తున్నారు.

కాంపిటీటర్స్

హెల్త్ కేర్ అనగానేముందుగా గుర్తొచ్చే పేరు ప్రాక్టో. డాక్టర్ అపాయింట్‌మెంటుకు మాత్రమే చేసి పెట్టే ప్రాక్టోతో తమకెలాంటి పోటీ లేదంటారు కిరణ్. ఎందుకంటే ఈకిన్ కేర్ డాక్టర్ అపాయింట్‌మెంట్‌తో పాటు హెల్త్ రికార్డ్స్ భద్రపరచడం, వాటిని ఆన్‌లైన్‌లోనే డాక్టర్‌కు చూపించడం వంటివి చేస్తుంది. మై హెల్త్ రికార్డ్స్, మ్యాప్ మై ల్యాప్ లాంటివి పేషెంట్ రికార్డులకు కావాల్సిన స్టోరేజీ యాప్ లానే పనిచేస్తున్నాయి తప్పితే పేషెంట్లకు కావాల్సిన రికమండేషన్స్, రిమైండర్స్ లాంటి సేవలు అందించడం లేదు. ఈ రకంగా చూస్తే ఈకిన్ కేర్‌కు ఎంతో అడ్వాంటేజ్ ఉంటుందని చెబ్తున్నారు కిరణ్.

ఆదాయం ఎలా ?

రెకమెండేషన్స్, హెల్త్ రిమైండర్స్, చెకప్ రిమైండర్స్ వంటి సమయంలో.. తాము ఒప్పందం కుదుర్చుకున్న పార్ట్‌నర్స్‌ను పంపడం చేస్తారు. ఉదా. ఒక డయాబెటిక్ పేషెంట్‌ ఉంటే వాళ్లకు తరచూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే వాళ్లకు వీటిని గుర్తు చేయడంతో పాటు అవసరమైతే.. తమ వ్యక్తిని వాళ్ల ఇంటికి పంపి బ్లడ్ శాంపిల్ సేకరించి.. ఆ రిపోర్ట్ వివరాలను సైట్లో అప్‌లోడ్ చేస్తారు. దీని వల్ల బ్లడ్, గ్లూకోజ్ వంటి వివరాలన్నీ ఒకే చోట ఉంటాయి. దీనివల్ల పేషెంట్లకు ఎప్పటికప్పుడు ఆ వివరాలను తెలుసుకునేందుకు సులువుగా ఉంటుంది. అంతే కాదు ఆ రిపోర్టులను చూపించి సెకెండ్ ఒపీనియన్ తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అంటోంది ఈకిన్ కేర్ టీం.

image


ఫండింగ్

2014లో బిట్‌కెమి వెంచర్స్ అండ్ ఆండ్రోయిటెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రెండు కోట్ల ఫండ్‌ని రెయిజ్ చేసింది. ఇది టీం బిల్డింగ్‌తో పాటు ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ కోసం వినియోగించారు. దీంతో ఆశించిన దానికంటే మరిన్ని గొప్ప ఫలితాలు సాధించారు. మరో రౌండ్ ఫండింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఫౌండర్ కిరణ్ సంకేతాలిచ్చారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఈకిన్ కేర్ పూర్తి స్థాయి యాప్ ఫ్లాట్ ఫాం లోకి వచ్చాక మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకు రానుంది. అందులో ప్రధానమైనది ఇన్ బాక్స్. దీని ద్వారా కస్టమర్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను డాక్టర్లతో ఇంటరాక్ట్ అయి పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. డాక్టర్ చాట్ సెషన్ ఇప్పటికే నడుస్తోంది. దీన్ని మరింత విస్తృతంగా చేయాలని చూస్తున్నారు. సేవా కేంద్రాలను హైదరాబాద్ తోపాటు ఇతర మెట్రో నగరాలను విస్తరించాలని చూస్తున్నారు. యూజర్ బేస్‌ని మరింత పెంచుకోడానికి ప్రచారం కూడా మొదలు పెట్టారు. హోర్డింగ్స్‌తో పాటు ఈవెంట్లను ఆర్గనైజ్ చేసి బ్రాండ్ బిల్డింగ్‌ను ప్రారంభించనున్నారు.

website