మీలో స్పార్క్ ఉందా? దాన్ని స్పీడప్ చేస్తామంటున్న ‘స్పార్క్10’

 మీలో స్పార్క్ ఉందా? దాన్ని స్పీడప్ చేస్తామంటున్న ‘స్పార్క్10’

Tuesday February 02, 2016,

2 min Read

స్టార్టప్ లకు ఫండింగ్ ఎంత అవసరమో- యాక్సిలరేట్ కూడా అంతే అవసరం. ఇదే విషయాన్ని స్పార్క్ 10 ఫౌండర్ అటల్ మాలవియా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు మిలియర్ డాలర్ల ఇన్వస్ట్ మెంట్ ను మోసుకొచ్చిన ఈ సంస్థ- స్థానిక స్టార్టప్ లకే అధిక ప్రాధాన్యం అంటోంది. స్టార్టప్ యాక్సిలరేట్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

image


స్టార్లప్ లకు యాక్సిలరేట్ ఎందుకు?

స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ తోపాటు యాక్సిలరేట్ ఉంటేనే అవి విజయవంతం అవుతాయని ప్రపంచ వ్యాప్తంగా తేలిన విషయం. ప్రమోషన్ చేయాలి, దాన్ని అన్ని కోణాల్లో పెద్ద ఎత్తున చేయడమే ఈ యాక్సిలరేట్. వ్యాపార ప్రకటనల ద్వారా చేసే ప్రమోషన్ కంటే యాక్సిలరేట్ ప్రొగ్రాం ద్వారా చేసే ప్రమోషన్ ఎంతో ముఖ్యమైంది. ఓ రకంగా చెప్పాలంటే మన టార్గెట్ ఆడియన్స్ ను మనతో పెట్టుకొని వారిని కస్టమర్లను చేడయమే కాదు- పూర్తి స్థాయి క్లయింట్స్ గా మార్చే ప్రక్రియ ఇది.

“స్టార్టప్ అంటే పరిమితులు లేవని అంతా అనుకుంటారు. కానీ స్టార్టప్ కు చాలా పరిమితులుంటాయి. వాటిని అధిగమించడానికి యాక్సిలరేట్ అవసరం”- జాన్ బ్రాడ్ ఫార్డ్
image


యూరప్ లో ఫాదర్ ఆఫ్ స్టార్టప్ యాక్సిలరేట్ గా పేరొందిన జాన్- స్పార్క్ టెన్ ప్రారంభ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. స్పార్క్ టెన్ ఎడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు. దీనికి మెంటార్ గా కూడా వ్యవహరిస్తున్నారు. జాన్ చెప్పిన ప్రకారం స్టార్టప్ పూర్తి స్థాయి కంపెనీగా ఎదిగేక్రమంలో ఫండ్స్ ని సక్రమంగా ఖర్చు చేయాలి. దీంతోపాటు బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవాలి. భవిష్యత్ లో ఫండ్స్ అవసరం లేకుండా పూర్తి స్థాయి స్వయం సహాయక వ్యవస్థగా మారాలంటే యాక్సిలరేట్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

image


స్టార్టప్ కి హైదరాబాద్ అనుకూలం!

ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ స్టార్టప్ లకు అనుకూలమని అటల్ మాలియా అభిప్రాయపడ్డారు.

“మేం హైదరాబాద్ లో స్పార్క్ టెన్ ప్రారంభించడానికి కారణం ఇదే,” అటల్

లండన్ లో దశాబ్దం పాటు ఇండస్ట్రీయల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న అటల్ ,అక్కడే కొన్న స్టార్టప్ కంపెనీలను కూడా ప్రారంభించారు.ఇండియా లో స్టార్టప్ ఈకో సిస్టమ్ స్పీడ్ అప్ కావడాన్ని గమనించిన అటల్ -ఇక్కడ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్న సమయంలో ఆయనకు హైదరాబాద్ సరైన ప్రాంతంగా అనిపించింది. దీనికి కారణాన్ని కూడా ఆయన వివరించారు. కొత్తదనాన్ని తొందరగా ఎడాప్ట్ చేసుకునే శక్తి హైదరాబాదీలకు ఉందని, స్టార్టప్ లో బెంగళూరు ఇప్పటికే సక్సెస్ అయినా, భవిష్యత్ హైదరాబాద్ దే అని అభిప్రాయపడ్డారు.

“పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం, టీ హబ్ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతోంది,” జయేష్ రంజన్

స్టార్టప్ ఈకో సిస్టమ్ కు ఇక్కడి ప్రభుత్వం సైతం మద్దతు పలుకుతోంది. అందుకే టీ హబ్ కూడా ఏర్పాటు చేశాం.

image


స్పార్క్ 10 లో భాగస్వాములు కండి!

హైదరాబాద్ స్టార్టప్ లకు స్పార్క్ 10 ఓ అద్బుత అవకాశం అని సుబ్బరాజు అన్నారు. స్టార్టప్ కు యాక్సిలరేట్ చేయడానికి తాము సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు.

“మీ స్టార్టప్ కు యాక్సిలరేట్, మెంటర్షిప్ చేయడానికి మేమున్నాం,” సుబ్బరాజు

ఫండింగ్ సాధించినంత మాత్రాన స్టార్టప్ సక్సెస్ అయినట్లు కాదు. స్టార్టప్ స్వయంశక్తితో రాబడి తీసుకొనేలా ఉండాలి. ఆదాయం తక్కువగా ఉన్న స్టార్టప్ లను యాక్సిలరేట్ చేయడం ద్వారా ఆదాయాన్ని డబుల్ చేయొచ్చని సుబ్బరాజు చెప్పుకొచ్చారు. 

అట్టాహాసంగా జరిగిన స్పార్క్ 10 యాక్సిలరేట్ ప్రారంభ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన చాలా స్టార్టప్ ఫౌండర్లు హాజరయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెమైలాగ్, టీహబ్ తోపాటు చాలా స్టార్టప్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.