బట్టలివ్వండి.. ఉతికి ఆరేస్తాం !!

హైదరాబాద్ స్టార్టప్ ‘సేఫ్ వాష్’

0

హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన 6 నెలలు కూడా కాలేదు అప్పుడే వేల సంఖ్యలో కస్టమర్లను సంపాదించుకుంది సేఫ్ వాష్. సిటీలో 6 ఆఫ్ లైన్ స్టోర్ లను సక్సెస్ ఫుల్ గా నడుపుతోన్న ఈ సంస్థ కస్టమర్ల కోసం బేటా వర్షన్ వెబ్ సైట్ ని నడుపుతోంది.

“వాషింగ్ సర్వీసును ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి తీసుకు రావాలనేది నా టార్గెట్.” ఫౌండర్ శిశిర్

బట్టలను ఉతకడాన్ని ఓ ప్రొఫెషనల్ కంపెనీగా మార్చాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారాయన. ఎన్నో డబ్బులు పెట్టి కొన్న బట్టలపై మరకలపు ఉంటే వాటిని వేసుకోడానికి మనసొప్పదు. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదరయ్యే ఉంటుంది. తనకు కూడా చాలా సార్లు ఎదురైందని చెప్పుకొచ్చారాయన.

ఉతకడం ఇలా మొదలైంది

శిశిర్ యూకే నుంచి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఏ వ్యాపారం చేయాలో తెలియని డైలమాలో ఉన్న రోజులవి. శిశిర్ ది సాంప్రదాయ వ్యాపార కుటుంబ నేపథ్యం కావడంతో నాన్న గారి వ్యాపారంలో సాయం చేయమని ఇంట్లో పెద్దవారి నుంచి వచ్చిన సలహాతో ముందుకు వెళ్లిపోవాలా అని ఒక సమయంలో అనుకున్నారు. ఫ్రెండ్స్ కొంతమంది సోలార్ పవర్ బిజినెస్ లో ఉండటంతో మానిఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడదామని అనుకున్నారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎక్కువ కావడంతో వెనకడుగు వేశారు. రిలేటివ్స్ లో తనకంటే పెద్దయిన ఓ వ్యక్తి సలహాతో వాషింగ్ స్టార్టప్ మొదపెట్టాలనే నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆలోచన తను యూకేలో ఉన్నప్పుడే వచ్చింది. కానీ ఇక్కడున్న పరిస్థితులకు ఇది వర్కవుట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఇచ్చిన సలహా ప్రాఫిటబుల్ స్టార్టప్ కు కారణమైంది. ఉన్న 6స్టోర్లతో పాటు మరిన్ని స్టోర్ లను ఏర్పాటు చేయాలని ముందకు పోతున్నారు.

సేఫ్ వాష్ టీం

సేఫ్ వాష్ ఫౌండర్ శిశిర్ రెడ్డి. పక్కా హైదరాబాదీ అయిన శిశిర్ ఓయూ నుంచి బీఈ పూర్తి చేశారు. అనంతరం యూకే లో న్యూ క్యాజినో బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీయే కంప్లీట్ చేశారు. అక్కడ కొన్ని కంపెనీలో ఇంటర్న్ గా పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చారు. హిటాచీ లో హెచ్ఆర్ మేనేజర్ గా కొంతకాలం పనిచేశారు. అనంతరం ఎక్స్ పోర్ట్,ఇంపోర్ట్ బిజినెస్ ప్రారంభించారు. దాని తర్వాత ప్రారంభమైనదే సేఫ్ వాష్. శిశిర్ వైఫ్ మరో కో ఫౌండర్ గా ఉన్నారు. ఇన్ఫోసిన్ లో ఆరేళ్ల అనుభవం ఉన్న ఆమె ఆపరేషన్స్ చూసుకుంటున్నారు. వీరితో పాటు 35మంది టీం ఉన్నారు.

సేఫ్ వాష్ పనితీరు

సేఫ్ వాష్ హైదరాబాదులో ఆన్ లైన్ స్టోర్ లతో సర్వీసు అందిస్తోంది. టెలిఫోనిక్ సర్వీసుతో ఇంటి దగ్గరకే వచ్చి బట్టలను తీసుకెళతారు. తమ కస్టమర్ల కోసం ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. బేటా వర్షన్ లో బట్టల ట్రాకింగ్ లాంటి వివరాలు అందిస్తారు. దేశంలో రెండు లక్షల కోట్ల మార్కెట్ ఉంది. ఇందులో ఆర్గనైజ్డ్ సెక్టారు 5 నుంచి 7 శాతం మాత్రమే. ఆన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్న దాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ లోకి తీసుకొస్తే వండర్స్ క్రియేట్ చేయొచ్చని శిశిర్ అంటున్నారు. బట్టల ట్యాగింగ్ కు సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు. వాటర్ ప్రూఫ్ బార్ కోడ్ లుంటాయి. దీంతో ఏ బట్టలు మిస్ అయ్యే చాన్స్ లేదు. దీంతో పాటు ప్రతి రోజూ వందల ఆర్డర్లు వస్తున్నాయి. ఎంతో మంది తమ స్టోర్లకు వచ్చి బట్టలిచ్చి వెళుతున్నారు. రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ ఇస్తున్నారు.

పోటీ దారులు, సవాళ్లు

సేఫ్ వాష్ కు ఆఫ్ లైన్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ , యాప్ జనరేషన్ లో ఆన్ లైన్ పోటీ ని తట్టుకోవడం పెద్ద సవాలే. ఆన్ లైన్ సేవలను వినియోగం లోకి తీసుకు రావాలనే సవాలును అధిగమించాల్సి ఉంది. యస్ బ్రిక్స్, ఆస్క్ ఫర్ హెల్ప్ లాంటి స్టార్టప్ లు హైదరాబాద్ కేంద్రంగా యుటిలిటీ సెక్టార్ లో ఉన్నాయి. ఇవి అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చాయి. యస్ బ్రిక్స్ ఇప్పటికే మిలియన్ టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. ఇవి ఆన్ లైన్ లో వాషింగ్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్ లైన్ లో తమకి కస్టమర్ బేస్ ఉండటం వల్ల ఆన్ లైన్ స్టార్టప్ లు తమకు పోటీ కావనే దీమాతో ఉన్నారు శిశిర్.

భవిష్యత్ ప్రణాలికలు

హైదరాబాద్ లో స్టోర్ల సంఖ్యను పెంచడం ముందుగా టార్గెట్ గా పెట్టుకున్నారు. సిటీలో అన్ని చోట్ల సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ స్టోర్లు లేవు. వీటితో పాటూ ఆన్ లైన్ సేవలను విస్తరించాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరికి యాప్ ని లాంచ్ చేయాలని చూస్తున్నారు. 2016 లో టూ టియర్ సిటీలకు,2017లో కోల్కతా, పూణే, ఇందోర్ లాంటి మెట్రోల్లో సేవలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఫండింగ్ కోసం ఎదురు చూడకపోయినప్పటికీ లార్జ్ స్కేల్ లో ఎవరైనా ఇన్వస్టర్ వస్తే వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

నగర వాసులకోసం కిలోవాష్ ప్రాడక్టును అందుబాటులోకి తీసుకొస్తున్నామని ముగించారు శిశిర్
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik