ఈ హైదరాబాదీ స్టార్టప్స్ సంచలనం సృష్టించబోతున్నాయా ?

ఈ హైదరాబాదీ స్టార్టప్స్ సంచలనం సృష్టించబోతున్నాయా ?

Monday October 12, 2015,

3 min Read

image


స్టార్టప్ హబ్స్‌గా దేశమంతా బెంగళూరు, ముంబై, ఢిల్లీ ప్రాంతాలనే కీర్తిస్తూ ఉంటే.. కొన్ని నగరాలు మాత్రం సైలెంట్‌గా తమ పని తాము చేసుకుపోతూ.. ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అదే కోవలోకి ఇప్పుడు హైదరాబాద్, గోవా, కోయంబత్తూర్, చెన్నై చేరుతున్నాయి. నాస్కాం అంచనాల ప్రకారం దేశంలోని స్టార్టప్ యాక్టివిటీలో హైదరాబాద్ వాటా 8 శాతానికి పెరిగింది. దీన్ని బట్టే అర్థమవుతోంది.. హైదరాబాద్‌కు ఎంత ఫ్యూచర్ ఉందో !

image


Image credit - shutterstock

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం, ఇక్కడ ఉన్న యాక్సిలరేటర్స్ మద్దతుతో హైదరాబాద్ స్టార్టప్స్ మెల్లిగా తన సత్తాను ప్రపంచానికి చాటిచెబ్తున్నాయి. కొన్ని ఫండింగ్ విషయంలో దూకుడుగా ఉంటే.. మరికొన్ని ఏకంగా విలీనమైపోయే స్థాయికి ఎదిగాయి. అయితే బెంగళూరు నగరంలో ఉన్న స్టార్టప్స్‌కు దక్కినంత ఫోకస్ తమకు లేకపోవడం వల్లే గుర్తింపు రావడంలేదనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. సరైన మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచానికి తెలియడం లేదనే వాళ్లూ ఉన్నారు.

image


గతేడాది జనవరి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకూ.. ఓ సారి డేటా పరిశీలిస్తే.. ఆశ్చర్యమేస్తుంది. ఎన్నో కంపెనీలకు ఫండింగ్ వస్తే.. కొన్ని సంస్థల డీల్స్ డన్ అయ్యాయి. చెన్నైతో పోలిస్తే.. హైదరాబాద్ కాస్త వెనకబడే ఉన్నా.. గతంతో పోలిస్తే.. మాత్రం పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయనేది సుస్పష్టం.

వూలా (VOOLA)

ఆగస్ట్‌లో ప్రైవేట్ బీటా లాంచ్ అయింది. వూలా అనేది ఓ వీడియో షేరింగ్ యాప్. లైవ్ లేదా రికార్డ్ అయిన వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. నాలుగు నిమిషాల నిడివి గల వీడియోల చూడడంతో పాటు రీప్లే చేసుకునే సౌలభ్యం కూడా ఈ యాప్‌లో ఉంది. 20 సెకెండ్ల హైపర్ ల్యాప్స్ టైం కూడా ఇందులో ఉంది. వీడియో స్ట్రీమ్‌ను మనకు నచ్చినన్ని రోజులు సేవ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్, ఫ్రెండ్స్‌తో చాటింగ్, ఫాలో అప్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నెలాఖరులో పబ్లిక్ బీటా లాంచ్ కాబోతోంది. website

image


ఫ్లో యాప్ (FLOW APP)

వివిధ క్లౌడ్ యాప్స్‌ను అనుసంధానం చేసి.. బిజినెస్ వర్క్‌ఫ్లోను ఆటోమేట్ చేయడం ఫ్లో యాప్ ప్రత్యేకత. ఈ ఏడాది జూలైలో ఇది ప్రారంభమైంది. ఈమెయిల్స్, మార్కెటింగ్, సేల్స్ ఫ్లో, అంతర్గత పనితీరు వంటి వివరాలన్నింటినీ ఈ యాప్ ఆటోమేట్ చేస్తుంది. ఇది SaaS (సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సొల్యూషన్) మోడల్ కింద పనిచేస్తుంది. ప్రారంభించాలనుకుంటున్న టైం, వివిధ రకాల వర్క్‌ఫ్లో, టైం లైన్స్ వంటి వివరాలన్నింటినీ కస్టమర్ ఫీడ్ చేస్తే.. ఇక వీటన్నింటినీ అనుసంధానిస్తూ.. ఆటోమేషన్ చేసే బాధ్యతను ఫ్లోయాప్ చూసుకుంటుంది. Website

image


వాజట్ ల్యాబ్స్ (wazzat labs)

మీరు తీసుకునే ఫోటో ఆధారంగా.. మీకు నచ్చిన ఫేవరేట్ డ్రెస్, షూ, లేదా యాక్సెసరీస్‌ను వెతికిపెట్టే ఇమేజ్ రికగ్నిజషన్ స్టార్టప్ వాజట్ ల్యాబ్స్. మీకు నచ్చిన డ్రెస్‌ను ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో క్లిక్ చేస్తే చాలు. అంతే ఆన్‌లైన్‌లో అలాంటి రకాలు ఏమేం ఉన్నాయో వెతికిపెట్టి మీ ముందు ఉంచుతుంది వాజట్ ల్యాబ్స్. ట్రిపుల్ ఐటి హైదరాబాద్‌లో కొద్దికాలంగా దీనిపై విస్తృత పరిశోధన చేస్తోందీ బృందం. సాధారణ డిస్క్రిప్షన్ సెర్చ్‌తో పోలిస్తే.. ఈ తరహా సెర్చ్ అత్యంత వేగంగా.. ఆక్యురేట్‌గా ఉంటుందనేది వాజట్ ల్యాబ్స్ ప్రతినిధుల నమ్మకం. అంతే కాదు.. ఫోన్‌లో ఎక్కువ స్పేస్ తీసుకోకపోవడం ఒక ప్రత్యేకత అయినా.. బ్యాండ్‌విడ్త్ కూడా చాలా తక్కువగా అవసరమని చెబ్తున్నారు. website

image



షాప్‌ట్యాప్ (Shoptap)

ఇదో స్మార్ట్ సేల్స్ ఫ్లాట్‌ఫాం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో అమ్మకందార్లు, కొనుగోలుదార్ల మధ్య ఉన్న వారధిలా పనిచేస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్లను ఆన్‌లైన్ బాట పట్టించడం షాప్‌ట్యాప్ ప్రత్యేకత. పాయిట్ ఆఫ్ సేల్.. ప్లాట్‌ఫాం ద్వారా.. ఓ కస్టమర్‌కు అతిపెద్ద ఇన్వెంటరీని చూసే అవకాశం లభిస్తుంది. మొబైల్ డ్యాష్ బోర్డ్ ద్వారా అమ్మకాలు చేయడంతో పాటు కస్టమర్‌కు ఏవైనా అనుమానాలు ఉండే కూడా తీర్చుకోవచ్చు. ఇందులో మొత్తం 14 క్యాటగిరీలు ఉన్నాయి. కస్టమర్ ఒక ప్రొడక్ట్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత.. సేల్స్‌మెన్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. క్యాష్ ఆన్ డెలివరీతో సదరు ప్రొడక్ట్ కస్టమర్ ఇంటికి చేరుతుంది.

image


మెల్టాగ్ (Meltag)

మెల్టాగ్ ఓ మొబైల్ మార్కెటింగ్ వేదిక. ప్రమోషనల్ ఆఫర్లతో కస్టమర్లకు నేరుగా చేరుకునేందుకు వీళ్లు కంపెనీలకు సహాయపడ్తారు. బిజినెస్‌, బ్రాండ్స్‌ను నేరుగా కస్టమర్లకు కనెక్ట్ చేస్తున్నారు. కంపెనీలు.. టార్గెట్ కస్టమర్లను చేరుకునేందుకు వీళ్లు ఇచ్చే డేటా సహాయకారిగా ఉంటుంది.

బ్రాండ్ ఓనర్లు.. సెగ్మెంట్ల వారీగా మార్కెట్లను విభజించుకుని.. ప్రమోషన్స్‌ను ప్రకటించవచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్‌తో పోలిస్తే.. ఇందులో పది రెట్లు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. website

image


జిఫీ (zify)

కార్ పూలింగ్‌ను అత్యంత సులువు చేసే యాప్ ఈ జిఫీ. ప్యాసింజర్లను, కార్ ఓనర్లను అనుసంధానించడం వీళ్ల ప్రత్యేకత. 50K వెంచర్స్ ఈ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. ఐడియా నుంచి అమలు వరకూ.. అన్ని దశల్లోనూ మెరుగైన పనితీరు కనబర్చడంతో.. జిఫీ హాట్ టాపిక్‌గా మారింది.

image


తాజాగా ఎస్ఓఎస్ వెంచర్స్ సహా మరో ఇద్దరు హైదరాబాద్ బేస్డ్ ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ కూడా రాబట్టింది. website