విద్యకు సరికొత్త అర్థం చెబుతున్న “కల్కేరి” పాఠశాల

కల్కేరిలో హద్దుల్లేని చదువులుసర్వతోముఖాభివృద్ధిపై దృష్టి పెట్టిన కల్కేరిసంగీతంతో పాఠ్యాంశాల కలబోతవంద శాతం ఫలితాలు సాధిస్తున్న కల్కేరి

0

అది ధార్వాడ్ శివారు ప్రాంతం.. అలాంటి ప్రాంతాన్ని మీరు మరెక్కడా చూసి ఉండరు. కెనడా యాసలో అక్కడ ఫ్రెంచ్ భాష మాట్లాడుతారు. స్వీడిష్ భాషనూ మీరు వినొచ్చు. వీటన్నిటికీ మించి సంప్రదాయ కర్నాటక సంగీతం మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.. ఇవన్నీ చేస్తోంది కేవలం ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులే.!

వీరికి వేదిక కల్కేరి (Kalkeri).. ఇదో సంగీత పాఠశాల..! క్యూబెకర్ (Quebecker) దీని వ్యవస్థాపకుడు. సమాజంలో మార్పు, సంగీతం పట్ల అతనికున్న అంకిత భావమే కల్కేరి ప్రారంభానికి కారణాలు. సంగీత ప్రేమికుల స్వర్గధామంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది సంగీత ప్రేమికులు ఇక్కడికొచ్చి స్వచ్చంధంగా సేవలందిస్తున్నారు. ప్రత్యామ్నాయ సంగీతానికి ఇదొక వేదిక.

కల్కేరిలో చదువుతున్న విద్యార్థులు
కల్కేరిలో చదువుతున్న విద్యార్థులు

జాగృతియాత్ర పేరిట దేశమంతటా తిరుగుతన్న కొంతమంది యువకులతో కూడిన రైలు బుధవారం ధార్వాడ్ లో ఆగింది. వారంతా ఈ పాఠశాలను సందర్శించడానికే ఇక్కడికొచ్చారు. గురవారం ఉదయం వారంతా ఆ ఆహ్లాదకర వాతావరణంలో విద్య అనే అంశంపై ప్రసంగించారు..

గోడల్లేని ఈ పాఠశాలల్లో దేశాయ్ అనే విద్యార్థి తనకు తెలిసిన బాస్కిన్ రాబిన్స్ గురించి చెప్పాడు. దేశవిదేశాల్లో విస్తరించిన ప్రఖ్యాత ఐస్ క్రీమ్ కంపెనీకి అధిపతి అని.., ఏకత్వం, ఆర్జనలపై దృష్టిపెట్టి ఆయన పలు దేశాల్లో ఐస్ క్రీం షాప్ లను ఓపెన్ చేశాడని వెల్లడించాడు..

సుదీర్ఘ సాంస్కృతిక విజ్ఞానం ఉన్న భారతీయులు... సంపాదనకోసం చదివేందుకే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ గోడల్లేని మా స్కూల్ మాత్రం సాంస్కృతిక వారసత్వం, స్పహ, స్థానికతపై దృష్టిపెట్టింది అంటారు.

కర్నాటకలో నెలకొన్న ఈ స్కూల్ కు గోడల్లేవు.. ఎలాంటి పాఠ్య ప్రణాళికా లేదు. “పచ్చికబయలే పాఠ్యాంశం” అంటారు దేశాయ్ ఆశ్చర్యంగా చూస్తూ..! “స్థానిక సమస్యలపైనే దృష్టి పెడుతుంది.” పిల్లలు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్లు వచ్చి నేర్చుకుంటారు. ఆడుకుంటారు.. ఉదాహరణకు వాళ్ల వంటగదే ఓ ప్రయోగశాల. అక్కడే ప్రయోగాలు చేస్తారు. గతేడాది ఓ విద్యార్థి గులాబి సిరప్ తయారు చేశాడు. అది ఫుడ్ ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది. స్కూల్ కు 60 శాతం ఆదాయం విద్యార్థుల సమాజ సేవ ద్వారానే వస్తుంది..

సంతోషాన్ని వెతికే క్రమంలో మేమున్నాం. అయితే.. మేం దేనికోసం వెతుకుతున్నామో తెలియడం లేదు. “జ్ఞానోదయం కోసం వెళ్లు. అయితే అది హిమాలయాల్లో దొరకదు. అది నీలోనే ఉంది. నిన్ను నువ్వు ప్రశ్నించుకో.. నీలోనే దొరుకుతుంది.” అన్నారు దేశాయ్. అన్ని వయసుల స్థానికులూ ఇక్కడికొచ్చి నెర్చుకుంటూ ఉంటారు.

కల్కేరి ప్రారంభం నుంచి ఉన్న ఆడమ్ చివరగా మాట్లాడారు. పాఠశాల చరిత్ర, దాని యంత్రాంగం, సంగీతం, అవకాశాల గురించి వివరించారు. “ సంగీతం ఉన్నతమైంది” అంటారుతను. “ అందుకే మేం ప్రతిఒక్కరికీ అవకాశం కల్పించాలనుకున్నాం” చెప్పారు ఆడమ్.

పిల్లలు కళలతో పాటు సంప్రదాయ చదువులు కూడా నేర్చుకుంటారు. ఒకటో తరగతి విద్యార్థులు ప్రతి రోజూ మూడు గంటలపాటు ఆర్ట్స్ నేర్చుకుంటారు. తర్వాత స్వరాలు, నృత్యం, నాటకం, వాయిద్యంపై తర్ఫీదు పొందుతారు. వాళ్లు పెరుగుతున్నకొద్దీ వీటిలో ఏవేని రెండింటిని మాత్రమే ఎంచుకుంటారు. వాటిపైన రోజూ ఐదు గంటలపాటు పనిచేస్తారు. ఎనిమిది నుంచి పది తరగతుల మధ్య ఒకటి మాత్రమే చదువుతారు.

మధ్యాహ్నం సమయంలో విద్యార్థులంతా పాఠ్యాంశాలపై దృష్టి పెడతారు. ఇప్పటివరకూ జాతీయ పరీక్షల్లో వందశాతం పాసయ్యారు. 85 శాతం విద్యార్థులు యూనివర్సిటీ వరకూ చదవు కొనసాగించారు. ఇప్పుడు కల్కేరిలో 200 మంది విద్యార్థులున్నారు.

కల్కేరీ విద్యార్థుల ప్రదర్శనతో సందర్శకుల యాత్ర ముగిసింది. విద్యార్థుల ఆటపాటలతో సందర్శకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఓ రోజంతా విద్యలోని వివిధ కోణాలపై అధ్యయనం చేసిన విద్యార్థులు ఆ తర్వాత రోజు నుంచి యధావిధిగా సంగీతంలో మునిగిపోయారు..