రూ. 6 వేలకే ఆటోమేటెడ్ రూం

-బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ -నెలసరి చార్జీలు ఇబ్బందులు లేని సరికొత్త వెంచర్

0

ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఓ యువకుడి ఆలోచన నుంచి పుట్టింద ది ప్లగ్ఎక్స్. యూపిటియూ లో చదువుతున్న రోజుల్లోనే నిఖిల్ చాలా రకాలైన ప్రాజక్టులపై పనిచేశారు. ఇన్ఫారెడ్ తో పనిచేసే కంటికి కనపడని మౌస్ , చేతి కదలికలు కంప్యూటర్ ని కంట్రోల్ చేయడం లాంటివి తయారు చేశారు. అప్పటి నుంచి అలాంటి వాటిపై ఆసక్తి మొదలైంది. 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరు చేరుకున్న ఆయన మార్కెట్ ను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. బెంగళూరు ఐఐఎం నుంచి బయటకు వచ్చిన బిటి శ్రీహరి, హరినారాయణతో కలసి ఈ స్టార్టప్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఒక రూంని ఆటోమేటింగ్ చేయడానికి 50వేలు చార్జీని తీసుకుంటున్నారు. అయితే ఆ ఖర్చు దీనిలో పదోవంతు అవుతుందని చెప్పుకొచ్చారు నిఖిల్. టీం దగ్గర ఇప్పటికే ప్రధానంగా కొంత టెక్నాలజీ ఉంది. దీంతో పనులు మొదలు పెట్టారు. మార్కెట్ లో సరైన స్థానం కోసం ఎదురు చూస్తున్నారు.

గదిని ఆటోమేటింగ్ చేయాడానికి ప్లగ్ఎక్స్ కు చెందిన స్విచ్ ను ఇన్ స్టాల్ చేయాలి. ఇది స్మార్ట్ ఫోన్ యాప్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ప్లగ్ఎక్స్ స్విచ్ కనెక్షన్లు ఎంతో సులభంగా స్విచ్ బోర్డ్ లేదా పవర్ ఔట్ లెట్ కు కనెక్ట్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్‌ యాప్ తో లైట్లు, ఇతర ఎలక్ట్రానికి పరికరాలను కంట్రోల్ చేయొచ్చు అని నిఖిల్ వివరించారు.

కొన్ని ఫీచర్లు

యూజర్ అలవాట్ల నుంచి ప్లగ్ఎక్స్ క్లెయిమ్స్ నేర్చుకుంటుంది. దీంతో లైఫ్ స్టైల్ , స్కెడ్యూల్ ఇతర విషయాలను అప్పటికప్పుడు తెలియజేస్తుంది.

యూజర్లు యాప్ ని వాడుతున్నప్పటికీ.. మాన్యువల్ గా స్విచ్ లను వాడుకోవచ్చు.

ఇంటర్నెట్ అవసరం లేదు. డివైజ్ బ్లూ టూత్ వి2.0 తో పనిచేస్తుంది. 100 అడుగుల దూరం దీని రేంజ్‌

లైట్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం లాంటి షెడ్యూలింగ్ కు అవకాశాలున్నాయి.

ప్లగ్ఎక్స్ వన్ టైం పేమెంట్ కు సిద్ధపడింది. వేరేకంపెనీల్లో నెలసరి అద్దెలు లేవు.

నిఖిల్ శ్రీవాత్సవ
నిఖిల్ శ్రీవాత్సవ

ప్లాగ్ఎక్స్ ల్యాబ్స్ డీలర్ల ద్వారా ఇప్పటి వరకూ చాలా ఇళ్లలో డివైజ్ ని ఇన్ స్టాల్ చేసింది. వరుసగా గతేడాది జూన్ నుంచి కమర్షియల్ గా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ ఇందులో 15మంది సభ్యులున్నారు. బెంగళూరు కు చెందిన క్యూబ్ 9 క్యాపిటల్ గ్రూప్ తో మొదటి రౌండు సీడ్ ఫండ్ ని రెయిజ్ చేసింది. బెంగళూరులో ఇతర స్టార్టప్స్‌ సిల్వన్ ల్యాబ్స్ గుర్తించదగిన ట్రాంజాక్షన్ చేస్తోంది. ధర విషయంలో ప్లగ్ఎక్స్ ఇలాంటి కంపెనీలు ఊహించనంత ఎత్తులో ఉంది. యువరక్తంతో ఉన్న టీం ఉంది. దీంతో విజయం సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని ఫౌండర్ నిఖిల్ ముగించారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik