మీ బంధువుల్లో సెలెబ్రిటీలున్నారేమో, పరివార్ ట్రీ చూడండి

వంశవృక్షాన్ని తయరుచేస్తోన్న సరికొత్త సైట్ కుటుంబాలే సమాజానికి మూలాలంటున్న పరివార్ ట్రీవెబ్ సైట్ నుంచి యాప్ దాకా సాగిన ప్రయాణంప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తీసుకురావడమే లక్ష్యం

మీ బంధువుల్లో సెలెబ్రిటీలున్నారేమో, పరివార్ ట్రీ చూడండి

Tuesday May 19, 2015,

3 min Read

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో మీకేదైనా రక్త సంబంధముందేమో ఎప్పుడైనా చూసుకున్నారా ? ఇదేంటి ఇలా అడుగున్నారని ఆశ్చర్యపోతున్నారా ? నేరుగా ఎలాంటి సంబంధం లేకపోవచ్చుగానీ ఎక్కడో ఏదో విధమైన దూరపు సంబంధం ఉన్నట్టు గుర్తించే వీలుంది. అదే విధంగా రాజకీయం, ఫ్యాషన్, గ్లామర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ తదితర రంగాల సెలెబ్రిటీలతోనూ మీకు సంబంధం ఉండే ఉంటుంది. అదెలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా ? పరివార్ ట్రీ డాట్ కామ్‌లోకి లాగాన్ కండి. అందులో ప్రతిరోజూ కొత్త కుటుంబ సంబంధాలు కనుక్కోండి. మీరు అదృష్టవంతులైతే మీరుగాని మీ బంధువులుగాని తయారుచేసిన కుటుంబ వృక్షంలో ఏ శాఖలోనైనా దూరపు బంధువుగా ఒక స్టార్ ఆచూకీ దొరకవచ్చు.

image


హిందీలో ఆ సైట్ పేరు పరివార్. అంటే కుటుంబం. యూజర్లు తమ వంశవృక్షాన్ని తయారు చేసుకోవటానికి అది అవకాశం ఇస్తుంది. దీంతో కుటుంబంలో కొత్త సభ్యులను కనుక్కోవటానికీ, వాళ్లతో ఫొటోలూ, వీడియోలూ పంచుకోవటానికీ వీలవుతుంది. ఆ విధంగా పరివార్ ట్రీ అనేది పూర్తి కుటుంబ వ్యవస్థకు సంబంధించిన ఒక ప్రైవేట్ సామాజిక మాధ్యమ వేదిక. 

ఈ నెట్వర్క్‌ని విశిష్టంగా మార్చే ప్రత్యేక లక్షణాలూ కొన్ని ఉన్నాయి. ఇందులో గిలిగింతలు పెట్టే అంశమేమిటంటే టికిల్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆలోచనలు, ఫొటోలు, వీడియోలు ఇతర కుటుంబాలతో కూడా పంచుకోవచ్చు. స్టూడియో అనే మరో ఫీచర్ ఫొటో , వీడియో ఆల్బమ్స్ తయారు చేసుకొని భద్రపరచుకునే అవకాశం కల్పిస్తుంది. క్లౌడ్ షేర్ అనే మరో ఆప్షన్ ప్రతి కుటుంబ సభ్యునికీ సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రపరచుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రజలను అనుసంధానం చేయటానికి సోషల్ నెట్ వర్కింగ్ అతిపెద్ద వేదికగా మారిన సమయంలో నిజానికి పరివార్ ట్రీ అనేది ఒక స్వాగతించదగిన పరిణామం. 

తమకు అంతగా తెలియని బంధువులను తెలుసుకొని వాళ్లతో బంధం కొనసాగించటానికి ఇది పనికొస్తుంది. చాలా సందర్భాలలో జనం కేవలం కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్లలో మాత్రమే కలుసుకుంటారు. అదే చాలా సన్నిహిత బంధువులను మాత్రమే. పైగా మళ్ళీ కలిసేది ఏ రెండుమూడేళ్ళకో. కానీ ఈ వేదిక మాత్రం కుటుంబ సభ్యుల మధ్య మాయమైపోతున్న బంధాలను పునరుద్ధరించటానికి ఉపయోగపడుతుందని, సమయంలేక కలుసుకోలేక పోయిన వాళ్ళనూ కలుపుతుందని ఈ ఆలోచన వెనుక ఉన్న మనోజ్ లాడీ చెబ్తున్నారు.

కుటుంబాలను కలుపుతూ

“ నాకు బాగా పెద్ద కుటుంబం ఉంది. విశ్వవ్యాప్తంగా మా కుటుంబ నెట్వర్క్ ఉంది. అలా నేను ఆలోచిస్తూ ఉండగా ఈ పరివార్ ట్రీ అనే ఆలోచన వచ్చింది.” అంటారు మనోజ్ భార్య పూజ. ఆమె ఈ వెంచర్‌కి కో ఫౌండర్. తన సమయంలో ఎక్కువభాగం తన ఇద్దరు పిల్లలకే కేటాయించే గృహిణి ఆమె. ఆమెకు కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు కో ఫౌండర్ పాత్ర పోషిస్తుంది.

యాప్ తయారీలో ఎదురైన సవాళ్ళు

పరివార్ ట్రీ కోసం యాప్, వెబ్ తయారీ గతేడాది జూన్‌లో మొదలైంది. వాటిని రూపొందించే క్రమంలో మొత్తం బృందం అనేక సవాళ్ళు ఎదుర్కొంది. ఒకే ఉత్పత్తిలో అనేక ఫీచర్లు జోడించాల్సి ఉండటం వల్ల అభివృద్ధి పరచటం మొదలుకొని యాప్ ఫ్లో రూపొందించటం వరకూ సమస్యలు తప్పలేదు. దీన్ని ప్రారంభించిన తరువాత ఎదురైన అతిపెద్ద సవాలు మార్కెటింగ్ ! ఎక్కువమంది యూజర్లు దీన్ని వాడుకునేలా ప్రచారం చేయడమే. దానికోసమే ఒక ప్రచార వీడియో తయారైంది. దీని లక్ష్యాలను వినియోగదారులకు అర్థమయ్యేలా వివరించింది. పరివార్‌ ట్రీ వెబ్ సైట్ 2014 డిసెంబర్ లో మొదలైంది. ఆ తరువాత 2015 ఏప్రిల్‌లో యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ వచ్చాయి. ఈ ఉచిత యాప్ చాలా విశిష్టమైనది. వివిధ కుటుంబాలను కలుపుతూ సాగే ఈ యాత్రలో బంధువుల రూపంలో కొత్త సభ్యులు తారసపడుతూ ఉంటారు. అది ఒక విధంగా కుటుంబాల నిక్షిప్త వంశ చరిత్రను, కుటుంబాల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేట్టు చేస్తుంది.

ఫౌండర్ మనోజ్ లాడీ , పూజా లాడీ

ఫౌండర్ మనోజ్ లాడీ , పూజా లాడీ


బిజినెస్ మోడల్

ప్రస్తుతానికి ఈ సైట్‌లో 4000 మంది యూజర్లున్నారు. యాప్‌కి ఇప్పుడు మరిన్ని ఫీచర్లు జోడించి అప్ గ్రేడ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబాన్ని కలిపే ఈ వ్యవస్థ మొదట్లో కేవలం ఒకరినుంచి మరొకరికి నోటిమాటగా విస్తరిస్తూ వచ్చింది. కానీ కొద్దినెలల కిందట ఫేస్ బుక్ సాయం తీసుకున్న తరువాత బాగా వేగం పుంజుకుంది. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, అనేక వృక్షాల కలయిక. ఒకసారి అలా రకరకాల వృక్షాలు తయారైతే వాటి విలీనం జరుగుతుంది. అయితే ఒక భారీ వృక్షం మాత్రం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీని సృష్టికర్తలకు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టత ఉంది. అదేంటంటే యూజర్లను ఆకట్టుకుంటూ, ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకోవడం. అందుకే ఆదాయం కోసం త్వరలో వివాహ పరిచయ వేదిక కూడా ప్రారంభించాలనుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఈ టీం వెంచర్ కాపిటలిస్టుల నుంచి పదిలక్షల డాలర్ల పెట్టుబడికి ఎదురు చూస్తోంది. వాళ్ళు మొదలు పెట్టినప్పుడు అది వాళ్ళ సొంత డబ్బు. తెలిసినవాళ్ళిచ్చిన మరో లక్ష డాలర్లు కూడా తోడయ్యాయి. ఈ వేదిక మీదికి మరింత మందిని రాబట్టటానికి పరివార్ ట్రీ సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ , ఇన్స్‌స్టాగ్రామ్‌లను వాడుకుంటూనే ఉంది.

గూగుల్ ప్లే స్టోర్ లో లేదా యాపిల్ యాప్ స్టోర్ లో పరివార్ ట్రీ దొరుకుతుంది.

వెబ్ సైట్