న్యాయవిద్యను సామాన్యులకు చేరువ చేస్తున్న ప్రొఫెసర్

పేదలను అత్యుత్తమ లాయర్లుగా తీర్చిదిద్దేందుకు ఐడీఐఏ ఏర్పాటు..అత్యుత్తమ న్యాయ కళాశాలలో చేరేందుకు పేద విద్యార్థలకు శిక్షణ..మూడేళ్లలో 40 మంది స్కాలర్స్‌కు శిక్షణ ..సామాన్యులకు కూడా ఐపీ చట్టాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం..ప్రజా ప్రయోజన సమస్యల కోసం పీ-పిల్ ఏర్పాటు..ఐపీలో చేసిన పరిశోధనలకు గాను ఎన్నో అవార్డులు గెలుచుకున్న బషీర్..

న్యాయవిద్యను సామాన్యులకు చేరువ చేస్తున్న ప్రొఫెసర్

Saturday September 19, 2015,

3 min Read

ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం అత్యంత అనువైనది. కానీ భారతీయ చట్టాలు మాత్రం ఎవరికీ అర్థం కావు. పీజీలు సంపాదించి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ చట్టాలపై అవగాహన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో న్యాయాన్ని సామాన్యుడి వద్దకు చేర్చేందుకు అసాధారణ ప్రయత్నం చేస్తున్నారు షమ్నాద్ బషీర్. ఐడీఐఏ ఏర్పాటు చేసి పేదలకు న్యాయ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు.

బెంగళూరుకు చెందిన షమ్నాద్ బషీర్ లాయర్. కానీ ఆయన మాత్రం కాస్త విభిన్నం. పేదల్లో న్యాయ విద్యపై అవగాహన కల్పించేందుకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో అద్భుతమైన కెరీర్‌ను వదులుకున్నారు. ఇన్‌క్రీసింగ్ డైవర్సిటీ బై ఇన్‌క్రీసింగ్ యాక్సెస్ టు లీగల్ ఎడ్యుకేషన్ (ఐడీఐఏ), ప్రమోటింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయరింగ్ (పీ-పీఐఎల్)వంటి కార్యక్రమాలను ముందుకు తెచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మురికివాడల్లో నివసించే ప్రజలకు కూడా సాధ్యమైనంత వరకు చట్టాలపై అవగాహనను కల్పించడాన్ని ఈయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

image


’’ఐడీఐఏ దేశ వ్యాప్త ఉద్యమం, మురికివాడలలో మెరుగైన విద్యార్థులను గుర్తించి, వారు గొప్ప లాయర్లుగా, సమాజానికి ఉపయోగపడే అడ్వొకేట్లుగా తీర్చిద్దిద్దడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కాన్సెప్ట్ 2010లో అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులే స్వయంగా ముందుకు తీసుకెళ్తూ అడ్డుగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. దేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో చేర్పించేందుకు పేద విద్యార్థులకు తోడ్పడుతున్నారు. ఐడీఐఏ వాలంటీర్స్ (లా స్టూడెంట్స్) దేశం మొత్తం ప్రయాణిస్తూ న్యాయ విద్యపై ఆసక్తి ఉన్న మెరుగైన విద్యార్థులను గుర్తిస్తారు. ఈ ఐడీఐఏ స్కాలర్స్‌కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ ఇస్తూ దేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పరీక్షలు క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్), ఏఐఎల్ఈటీ (ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్) కోసం వారిని సంసిద్ధులను చేస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడంలో భాగంగా సాంఘిక సాధికారతలో న్యాయ శాస్త్ర పాత్రను ఈ ఐడీఐఏ వాలంటీర్లు కూడా గుర్తిస్తారు. ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ న్యా య కళాశాలలో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది మురికివాడల నుంచి వచ్చినవారు. ఈ ఐడీఐఏ ముఖ్య ఉద్దేశమేమిటంటే న్యాయ కళాశాలల్లో మరింత వైవిధ్యబరితమైన పరిస్థితులు కల్పించడమే’’ అని ప్రొఫెసర్ బషీర్ వివరించారు.

గత మూడేళ్లలో 40 మంది స్కాలర్స్‌కు ఐడీఐఏ వాలంటీర్లు శిక్షణ ఇచ్చి, జాతీయ లా యూనివర్సిటీల (ఎన్ఎల్యూ)లో అడ్మిషన్లు పొందేలా చేశారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలకు చెందిన రైతులు, స్టోన్ క్రషర్ వర్కర్స్, షాప్ కీపర్స్, క్లర్స్ పిల్లలు ఈ న్యాయ విద్యను అభ్యసించేందుకు ఈ ఐడీఐఏ వాలంటీర్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కసారి అత్యుత్తమ న్యాయ కళాశాలలకు ఎంపికైన తర్వాత ఈ స్కాలర్స్ కు ఐడీఐఏ స్కాలర్షిప్ అందిస్తూ అత్యుత్తమ విద్యార్థులుగా ఎదిగేందుకు ఐడీఐఏ సాయపడుతుంది. మురికివాడల పిల్లలు న్యాయ కోవిదులుగా మార్చడమే ఈ ఐడీఐఏ ప్రధాన లక్ష్యం.

మరోవైపు పీ-పిల్ కార్యక్రమం విద్యార్థులు, న్యాయవాదుల భాగస్వామ్యంతో నడుస్తోంది. దీని ముఖ్యం ఉద్దేశం ఏంటంటే..

  • విద్యాసంబంధిత వ్యవహారాలకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కోర్టులో దాఖలు చేయడం
  • నౌకయానంలో పనిచేస్తూ విదేశాలకు వెళ్లి అదృశ్యమైన సెయిలర్ల కుటుంబాలకు అండగా నిలవడం. గల్లంతైన వారి వివరాలు సేకరించడం, వారి కుటుంబాలకు సరైన నష్టపరిహారం ఇప్పించడం.
  • క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన మార్పులను విద్యార్థులకు తెలియజేయడం.
  • ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేయడంలో ఉన్న సమస్యలను ప్రపంచానికి తెలియజేసి .. అధిక ధరలకు విక్రయించే పబ్లిషర్లకు వివరించడం.

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రొఫెసర్ బషీర్ ప్రఖ్యాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంస్థ ఆనంద్ అండ్ ఆనంద్‌లో చేరారు. టెలి కమ్యునికేషన్స్ అండ్ టెక్నాలజీ ప్రాక్టీస్ విభాగంలో ఆ సంస్థకు నాయకత్వం వహించారు. ఈ రంగంలో ప్రఖ్యాత లాయర్‌గా ఆయన ఐఎఫ్ఎల్‌ఆర్ గుర్తింపు కూడా పొందారు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఆక్సఫర్డ్ వెళ్లిన బషీర్ వెల్‌కమ్ ట్రస్ట్ స్కాలర్‌గా అక్కడే బీసీఎల్, ఎంఫిల్, డీఫిల్ పూర్తి చేశారు. మొన్నటివరకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్‌లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా ప్రొఫెసర్ గా పనిచేశారు.

‘‘ప్రజలకు విలువైన పేటెంట్ డాటా ఉచితంగా అందుబాటులో ఉండేలా ప్రధానమంత్రి కార్యాలయంలో పారదర్శకత కోసం స్పైసీ ఐపీ ద్వారా పిటిషన్ వేశాను. మా ప్రయత్నం ఫలించింది. ఇప్పుడు పేటెంట్ డాటా అందరికీ అందుబాటులో ఉంది ’’ అని ప్రొఫెసర్ బషీర్ అంటారు.

అవార్డుల పంట

ప్రొఫెసర్ బషీర్ కు ఇన్ఫోసిస్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీస్ 2014-15 అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డు జ్యూరీకి ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహూమతి గ్రహీత అమర్త్యసేన్ నేతృత్వం వహించారు. మేధో సంపత్తి హక్కుల పరిశోధనలో అద్భుత కృషికి గాను ఈ అవార్డు వరించింది. చట్టం, న్యాయ విద్య ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు చేసిన కృషి కారణంగానే ఈ అరుదైన ఘనత బషీర్ సొంతమైంది.

వికలాంగులకు కూడా ప్రొఫెసర్ బషీర్ సేవలందించారు. వాళ్లకు కాపీరైట్ మినహాయింపుల గురించి వివరించారు. కాపీరైట్ చేయబడిన పనిని వికలాంగులు సులభంగా ఉపయోగించుకుని, మార్చుకునేందుకు ఈ చట్టం అనుమతి ఇస్తుంది. ముఖ్యంగా దృష్టిలోపంతో బాధపడుతున్నవారు ప్రింటెడ్ మెటీరియల్‌ను ఉపయోగించుకోవడంలో 90 శాతం మంది విఫలమవుతుంటారు. వారి కోసం బషీర్ రూపొందించిన కాపీరైట్ చట్టం ఎంతగానో సాయపడుతుంది.

‘‘మనం ఒకటి అనుకుంటే జీవితం మనకు ఇంకోటి అందిస్తుంది. అనుకోకుండా తీసుకున్న కోర్సే మనకు అత్యుత్తమంగా సరిపోతుంది’’ అని బషీర్ వివరిస్తారు.