అభివృద్ధికే కాదు..ఆటంకంలోనూ ఇంటర్నెట్‌ది కీలకపాత్రే !

0

వందల కోట్ల మందికి టెక్నాలజీని దగ్గర చేసిన ఇంటర్నెట్టే ఇప్పుడు ప్రపంచానికి విపత్తుగా మారింది. టెక్నాలజీ ఈవెంట్‌లో ఇలాంటి మాటలు చాలా అరుదుగా వినిపిస్తాయి. టివి మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయం సరిగ్గా ఇదే. ఈ ప్రపంచానికి ఇంటర్నెట్ అతిపెద్ద ఆటంకంగా మారింది అంటూ టెక్ స్పార్క్స్ 2015 ఆరో ఎడిషన్ ప్రారంభోపన్యాసంలో మోహన్ దాస్ చెప్పిన మాటలు అందర్నీ కట్టిపడేశాయి.

"ఈ రోజుల్లో చేతిలో ఒక మొబైల్ ఫోన్, వైఫై కనెక్షన్ ఉంటే చాలు ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే. టెక్నాలజీతో ప్రపంచం ఎంతో చిన్నగా మారిపోయింది. త్వరలో 700 కోట్ల మంది ఒకరినొకరు ఇంటర్నెట్ ద్వారా పలకరించుకుంటారు" అంటారు టీవీ మోహన్ దాస్.

ఇప్పుడే ఇలా ఉన్న ప్రపంచం స్వరూపం రాబోయే పదేళ్లలో చాలా మారిపోతుంది. ఇప్పటి సంగతి సరే... మరి గతంలో ప్రపంచం ఎలా ఉండేది ? ఆ ప్రపంచానికి వినాశనం ఎలా కలిగింది ? తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలన్నారు.

"200 ఏళ్ల క్రితం మనం మానవుడి కండరాల శక్తిపైనే ఆధారపడ్డాం. ఆ శక్తితోనే వేలాది మంది కష్టపడి పిరమిడ్స్ లాంటి గొప్పగొప్ప కట్టడాలను నిర్మించారు. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా స్టీమ్ ఇంజిన్‌ని కనుగొన్నారు. ఆ శక్తితో వందమంది చేయగలిగే పనుల్ని ఒక్కరే చేసేవారు" అంటారు పాయ్.

ప్రపంచానికి ఇబ్బంది కలిగించింది ఇదే అన్నది మోహన్ దాస్ అభిప్రాయం. ఈ సాంకేతికత పనిలో వేగాన్ని పెంచింది. ఊపు తీసుకొచ్చింది. తర్వాత రైళ్లొచ్చాయి. ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గింది. ఎక్కడ్నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్లగలుగుతున్నారు. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. ఫలితంగా వ్యాపారాలు విస్తరించాయి. ఇలా మార్పు చెందుతూనే వస్తోంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందికరంగా మారుతోంది ఏదైనా ఉందీ.. అంటే.. అది ఇంటర్నెట్ అంటారు మోహన్ దాస్.

ఇంటర్నెట్... ఇప్పుడు మనందరి రోజువారి జీవితాల్లో భాగమైపోయింది. కానీ అది సృష్టిస్తున్న వినాశనం తక్కువేమీ కాదన్నది మోహన్ దాస్ అభిప్రాయం. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల జనాన్ని దగ్గర చేస్తున్న ఏకైక వేదిక ఇంటర్నెట్. ఎక్కడి నుంచైనా సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ జ్ఞానాన్ని అందిస్తోంది. ఒక్క క్లిక్కుతో సమాచారాన్ని తెలియజేస్తుంది అంటారాయన.

"ఇకపై సమాచారాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరు. ట్విట్టర్ విప్లవానికి కృతజ్ఞతలు చెప్పాలి. దాని ద్వారా ప్రతీ ఒక్కరికీ సాధికారత లభిస్తోంది. ప్రతీ ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛాగళాన్ని ఇచ్చింది" అంటారు మోహన్ దాస్.

ప్రపంచంతో అనుసంధానం

ఇంటర్నెట్ కారణంగా కొత్తకొత్త పరికరాలు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతోంది. కొనుగోలుదారులకు వ్యాపారులకు మధ్య పారదర్శకత ఏర్పడుతోంది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో కూర్చున్న చోటి నుంచే చూడగలుగుతున్నారు. వాటి గురించి తెలుసుకోగలుగుతున్నారు. సాధికారత కూటెక్నాలజీ కారణమవుతోంది అంటారు పాయ్. బెనారస్ చీర తయారు చేసే కళాకారుడు ఎక్కడో బెంగళూరుకు చెందిన కస్టమర్‌తో నేరుగా మాట్లాడగలుగుతున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితం ఇది అస్సలు సాధ్యమయ్యేది కాదు. ఇలా పలు డొమైన్లు, విద్య, వ్యాపారం, మార్కెట్లు, పలు రంగాల్లో ఇంటర్నెట్ సౌలభ్యంగా మారింది.

జీవనశైలిలో మార్పులు

మోహన్ దాస్ పై ఉద్దేశం ప్రకారం దీర్ఘాయుష్షు పొందాలనుకోవడం ఇక ఏమాత్రం కల కాదు. స్టెమ్ సెల్ రీసెర్చ్ ద్వారా సాధ్యం. పునరుత్పాదక శక్తుల్ని ఉపయోగించడం సులువైంది. ఇంతకుముందెన్నడూ లేనంతగా టెక్నాలజీ అన్నింటినీ సులభం చేసేస్తోంది. "ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఆటంక పరుస్తూ ఉంటే, టెక్నాలజీ-కనెక్టివిటీ.. ఆవిష్కరణలకు దోహదపడుతున్నాయి" అంటూ ఉపన్యాసాన్ని ముగించారు మోహన్ దాస్.