టాప్ టెన్ మొబైల్ స్టార్టప్స్ పరిచయం చేస్తున్నాం.. అవేంటో తెలుసుకోండి!

టాప్ టెన్ మొబైల్ స్టార్టప్స్ పరిచయం చేస్తున్నాం.. అవేంటో తెలుసుకోండి!

Saturday November 19, 2016,

2 min Read

టెక్ స్పార్క్స్ గురించి వినే ఉంటారు. దాని ద్వారా భార‌త్ కు చెందిన 30 టెక్ స్టార్ట‌ప్ లు ప్ర‌పంచానికి తెలిశాయి. ఇక ఇప్పుడు యువ‌ర్ స్టోరీ మొబైల్ స్పార్క్స్.. మొబైల్ టెక్ రంగ స్టార్ట‌ప్ ల‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది.

ఏటా యువ‌ర్ స్టోరీ మొబైల్ స్పార్క్స్ ఈవెంట్ నిర్వ‌హిస్తోంది. ఇది ఐదోది. హాప్టిక్, క‌ల్చ‌ర్ యాలీ, డ్రైవ్ యూ, మై చైల్డ్ యాప్, స్క్వాడ్ర‌న్, మ్యాడ్ స్ట్రీట్ డెన్ లాంటి స్టార్ కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. వీటితోపాటు ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న కొత్త స్టార్ట‌ప్ లు కూడా ఈవెంట్ లో భాగ‌స్వాములు అయ్యాయి. అలాంటి 10 కంపెనీల విశేషాలు ఇవీ..

image


5బార్జ్: ఎంత మంచి మొబైల్ అయినా సిగ్న‌ల్ ప్రాబ్ల‌మ్ త‌ప్ప‌దు క‌దా! 5బార్జ్ కంపెనీ ప్ర‌స్తుతం అదే ప‌నిమీద ఉంది. సిగ్న‌ల్ స్ట్రెంగ్త్ పెంచ‌డానికి సెల్యూలార్ కంపెనీల‌తో క‌లిసి ప‌నిచేస్తోంది. ఇప్ప‌టికే ఒక ప్ర‌త్యేక‌మైన టెక్నాల‌జీ రూపొందించింది. దాన్ని ఇల్లు, ఆఫీస్ లేదా ఎక్క‌డైనా స‌రే ఇన్ స్టాల్ చేసుకుంటే.. సెల్ ఫోన్ లో ఫుల్ సిగ్న‌ల్ ఉంటుంది.

అడోరో: ఇదొక ఆన్ లైన్ ఫ్యాష‌న్ స్టోర్. ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల కోసం ఏర్పాటు చేశారు. క‌స్ట‌మ‌ర్ల అభిరుచి, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ప్రోడ‌క్ట్ త‌యారు చేసి ఇవ్వ‌డం వీళ్ల స్పెషాలిటీ.

అపాయ్: ఈ కంపెనీ ద‌గ్గ‌ర ఒక ప్ర‌త్యేక‌మైన టెక్నాల‌జీ ఉంది. డిజైన‌ర్లు ఎలాంటి కోడింగ్ అవ‌స‌రం లేకుండానే యాప్ త‌యారు చేసుకోవ‌చ్చు. బాట్ లో వంద‌లాదిగా ఉన్న సౌక‌ర్యాలను ఉప‌యోగించుకొని డెవ‌ల‌ప‌ర్లు వేగ‌వంత‌మైన‌, బ‌గ్ ర‌హిత యాప్స్ ను డిజైన్ చేసుకునే వీలుంది. మొబైల్ యాప్ అభివృద్ధి కోసం కంపెనీల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా బాట్ ల‌ను అందిస్తోంది యాపీ స్టార్ట‌ప్.

డేటా మెయిల్: మొబైల్ ఫోన్ల‌లో భాష అనేది మేజ‌ర్ ప్రాబ్ల‌మ్. ఇంగ్లిష్ రాక‌పోతే క‌ష్ట‌మే. అయితే డేటా మెయిల్ కంపెనీ అందుకు ఒక ప‌రిష్కారం చూపింది. ఈ- మెయిల్ ఐడీల‌ను వివిధ భాష‌ల్లో అందిస్తోంది. త‌ద్వారా ఇంగ్లిష్, నాన్ ఇంగ్లిష్ ప్ర‌జ‌ల మ‌ధ్య అంత‌రాత‌ల‌ను తొల‌గిస్తోంది.

ఫినోమెనా: ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ లోనూ అందుబాటులో ఉండే ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ ఇది. ఎలాంటి క్రెడిట్ కార్డు అవ‌స‌రం లేకుండా షాపింగ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తోంది. 50 కోట్ల మందికి సేవ‌లు అందించ‌డ‌మే ఈ కంపెనీ ల‌క్ష్యం.

గ్రే కెర్న‌ల్: నెక్స్ట్ జ‌న‌రేష‌న్ వ‌ర్చువ‌ల్ రియాలిటీ ప్లాట్ ఫామ్ ఇది. కంపెనీలు, వాటి ఉత్ప‌త్తుల‌ను 360 డిగ్రీ వీడియోలు, ఫొటోల ద్వారా మార్కెట్ లో ప్ర‌మోట్ చేస్తుంది.

మార్కెట్ డాట్ వూ: జీరో క‌మిష‌న్ ఈ-కామ‌ర్స్ స్టార్ట‌ప్ ఇది. రిటైల‌ర్లకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. స్టోర్ లో ఎంత స‌రుకుంది, ఆన్ లైన్ లో విక్ర‌యించిన స్టాక్ ఎంత లాంటి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డానికి ఉప‌యోప‌డుతుంది.

మ‌నీట్యాప్: ఈ కంపెనీ యాప్ లోకి వెళ్లి అప్పు అడిగితే స‌రిపోతుంది. అప్పటిక‌ప్పుడు రుణం మంజూరైపోతుంది. కాక‌పోతే నెల‌కు రూ.25 వేల పైన జీతం ఉన్న వారికే వ‌ర్తిస్తుంది.

పిక్ట‌ర్: ఈ-కామ‌ర్స్ ఫొటోగ్ర‌ఫీని స‌మూలంగా మార్చేస్తున్న స్టార్ట‌ప్ ఇది. యూజ‌ర్లు త‌మ స్మార్ట్ ఫోన్లో ఫొటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలి. మీరు తీసిన ఆ ఫొటోల‌ను పిక్ట‌ర్ ప్రొఫెష‌న‌ల్స్ ఒక క‌ళాఖండంగా త‌యారు చేసి ఇస్తారు.

స్టింట్ మింట్: మీరొక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. అందులో ప‌నిచేయ‌డానికి ఉద్యోగులు కావాలి. వెంట‌నే స్టింట్ మింట్ యాప్ లో లాగిన్ అయితే చాలు. మీ కంపెనీకి స‌రిపోయే నిష్ణాతుల్ని వాళ్లే వెతికిపెడ‌తారు.