3 ఇడియట్స్ స్టైల్‌లో పిల్లలకు విద్యను బోధిస్తున్న ‘ఇన్ఫినిట్ ఇంజినీర్స్’.

కేవలం పరీక్షల కోసం చదవుకోవద్దు... విజ్ఞానం పెంచుకోమంటున్న ‘ఇన్ఫినిట్ ఇంజినీర్స్’‘త్రీ ఈడియట్స్’ సినిమాని తలపించే స్టోరీ ఈ విద్యార్ధులదిచిన్నప్పుడు చదువులో ఫెయిల్ అయినా, నేర్చుకోవాలనే తపన వీళ్లదిస్కూల్ విద్యార్ధుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పించడానికి స్ధాపన


3 ఇడియట్స్ స్టైల్‌లో పిల్లలకు విద్యను బోధిస్తున్న ‘ఇన్ఫినిట్ ఇంజినీర్స్’.

Monday June 15, 2015,

3 min Read

స్కూల్లో ఓ సామాన్య విద్యార్ది ఎం సీ జైకాంత్. ఒక్కోసారి కొన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ కూడా అయ్యే వాడు. కాని ఎలాగోలా బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం గట్టెక్కాడు. కాలేజీలోనైనా పరిస్ధితి మారుతుందని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరాడు.

అందరిలాగే ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో డిజైన్, ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్ట్ చేయాల్సిన జైకాంత్, అందరిలా కాకుండా, ప్రత్యేకంగా గా చేయాలని ‘బ్లేడ్ లెస్ విండ్ టర్బైన్’ కాన్సెప్ట్ తయారు చేసాడు. కొద్ది రోజులు అయ్యాక తన స్నేహితుడు హరీష్‌తో కలిసి తన కాలేజ్ సెమినార్ హాల్ లో జరుగుతున్న ఓ ప్రెజెంటేషన్ చూడటానికి వెళ్లారు.

ఇన్ఫినిట్ ఇంజనీర్స్ టీం

ఇన్ఫినిట్ ఇంజనీర్స్ టీం


“లోనికి వెళ్లిన మేము చివరి బెంచీలో కూర్చుని ఎయిర్ కండిషన్ హాల్లో టైమ్ పాస్ చేద్దామనుకున్నాము. అయితే మా ప్రొఫెసర్ ఒకరు మేమక్కడ కూర్చోవడం చూసి పట్టుకున్నారు. ఆయన్ని కన్విన్స్ చేయాలనే ప్రయత్నంలో, మా ప్రాజెక్ట్ కూడా ప్రెజెంట్ చేయోచ్చా అని అడిగాము. ఇదంతా విని సీరియస్‌గా తీసుకోకుండా మమ్మల్ని బయటికి పంపుతారని అనుకున్నాము. కాని పది నిమిషాల తరవాత మమ్మల్ని నిజంగానే ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేయమని అనుమతి ఇచ్చారంటున్నారు జైకాంత్ ”.

ఉపిరి గట్టిగా పీల్చుకుని జైకాంత్, స్టేజ్ పైకి వెళ్లి 5 నిమిషాల్లో తన ప్రెజెంటేషన్ పూర్తి చేసి పారిపోయారు. ఓ వారం తరువాత తను ఊహించని పరిణామం జరిగింది, కాంపిటీషన్‌లో అందరికన్నా ఎక్కువ స్కోర్ చేసి, తనే ఫస్ట్ వచ్చాడు. 

“ నా జీవితంలో తొలి సారి, నేను గెలిచాను, ఈ ఊహించని వార్త విని తట్టుకోలేపోయిన నాకు, సాధారణ జీవితంలో రావడానికి వారం పట్టింది. ఈ పరిణామం నా జీవితాన్నే మార్చుతుందని అనుకోలేదంటారు జైకాంత్ ”.

ఈ సంఘటన తనని తాను పూర్తిస్థాయిలో రుజువు చేసుకునేందుకు, తన సత్తా పరీక్షీంచుకునేందుకు ప్రోత్సహించింది. ఇక అప్పటినుండి వివిధ కాలేజీల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. ఓ సారి తన ఫ్రెండ్స్‌తో గోవా ట్రిప్ నుండి తిరిగొస్తున్న జైకాంత్‌, తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. చెన్నై తిరిగొచ్చాక, తన ఐడియాలను పేపర్ పై పెట్టడం మొదలెట్టాడు. “నా రెండు ప్రాజెక్ట్స్‌పై పేటెంట్ కోసం అప్లై చేశాను. అప్పటి నుండి నా జీవితమే మారింది, నావైపు ఇతరులు చూసే ధోరణి మారింది, ఆ రెండు పేటెంట్లు నా జీవితాన్ని మార్చేసాయంటున్నారు జైకాంత్.”

ఆ పేటెంట్లు ఫైల్ చేసిన తరువాత అసలు విద్యార్ధులు ఎందుకు ఓ పరిమితిలోనే ఉంటున్నారు, ఎందుకు డిఫరెంట్‌గా ఆలోచించరని జైకాంత్ భావించేవారు. ఇదంతా అనలైజ్ చేస్తే, వీటి మూలాలు స్కూళ్లలో ఉన్నాయని తనకు అర్థమైంది. స్కూల్స్‌లో ఉన్నప్పటి నుండే, మనలో చాలా మందికి చదువుకోమని చెప్తారు కానీ.. నేర్చుకోవడం, వాటిని అమలు పర్చడం చాలా తక్కువ. ఎగ్జామ్స్ ఇతర కారణాల వల్ల, మనలో చాలా మంది నేర్చుకోవడం మర్చిపోయి, కేవలం పరీక్షలు, గ్రేడ్స్ కోసమే చదువుతున్నాము. నేర్చుకోవడంలో ఉండే మాజాను అందరూ కోల్పోతున్నారు.

ఇదంతా చూసిన జైకాంత్, తమ తరువాత జెనరేషన్ కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. వారు నేర్చుకున్న ధియరీ పై హాండ్స్ ఆన్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని భావించారు. “ నా కాన్సెప్ట్ గురించి మా డిపార్ట్‌మెంట్ లోని కొంత మంది మిత్రులతో చెప్పినవెంటనే వారు కూడా నాతో చేరడానికి సిధ్ధపడ్డారంటున్నారు జైకాంత్ ”. అనంతరం హరీష్‌తో కలిసి ‘ఇన్ఫినిట్ ఇంజినీర్స్’ ను సెప్టెంబర్ 15, 2013 (ఇంజినీర్స్ డే రోజు)న ప్రారంభించారు.

విద్యార్ధులు సృజనాత్మకత, వినూత్నతను పెంచుకునే విధంగా ‘ఇన్ఫినిట్ ఇంజినీర్స్’ రూట్ లెవల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తుంది. ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, రొబోటిక్స్, మొకానికల్, ఏరో మోడెలింగ్, కంప్యూటర్ సైన్స్ , బయోటెక్ లాంటి రంగాల్లో ఈ సంస్ధ శిక్షణ అందిస్తుంది.

జైకాంత్, హరీష్‌తో పాటు, ఎస్ జయ్‌విగ్నేష్, ఏ కిషోర్ బలగూరు, ఎన్ అమ్రిష్, ‘ఇన్ఫినిట్ ఇంజినీర్స్’ స్ధాపించిన సహ వ్యవస్ధాపకులు. ప్రస్తుతం చాలా ట్రైనింగ్ సెంటర్లు స్కూల్ విద్యార్ధులకు రొబోటిక్స్ , ఎరో మాడలింగ్ నేర్పిస్తున్నారు. “అయితే స్కూల్ సిలబస్‌తో సమానంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాలనేది మా ఐడియా, అప్పుడే వారి విద్య పూర్తవుతుంది. విద్యకేవలం పాఠ్య పుస్తకాలు, బ్లాక్ బోర్డ్, మరియు టీచర్ ని వనడం వరకే కాకుండా దాన్ని అనుభవించాలంటారు జైకాంత్”.

ఇప్పటి వరకు మా సంస్థ చెన్నై లోని సుమారు 70-80 స్కూల్స్‌ని సందర్శించింది. ఇన్ఫినిట్ ఇంజినీర్స్ రెండు స్కూల్స్‌లో శిక్షణ మొదలెట్టింది. విద్యార్ధులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడంతో పాటు, ఉన్న వనరులతో వారి ఆలోచనలను కూడా షేర్ చేసుకునే వీలు ఉండే విధంగా త్వరలో ‘అప్టైడ్ సైన్స్ రీసర్చ్ ఇన్స్‌స్టిట్యూట్’ లాంఛ్ చేయబోతున్నారు.

విమర్శలను బలంగా తీసుకున్న ‘ఐఇ’

“ప్రతికూల విమర్శలు నన్ను ప్రేరేపిస్తాయి. మా కాలేజ్ ప్రొఫెసర్ ఒకరు మా వెంచర్ స్ధిరంగా ఉండదని, వెళ్లి ఏదైనా ఐటీ జాబ్ వెతుక్కోమన్నారు. ఆయన మాటలు మా లక్ష్యాన్ని పొందడానికి మరింత కష్టపడేలా చేసాయి. మా విజయం వెనుక కొంత క్రెడిట్ ఆ ప్రొఫెసర్‌కు కూడా దక్కుతుంది.. నేను టీచింగ్ చేయడానికి నా దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటని కూడా కొంత మంది అడిగేవారు. అయితే వాళ్లకో విషయం తెలీదు, స్టూడెంట్స్ నిద్ర పోకుండా ఎలా టీచింగ్ చేయాలో ఆ పద్ధతి బ్యాక్ బెంచర్స్‌కే ఎక్కువ తెలుసంటారు జైకాంత్”.