మహిళా పారిశ్రామికవేత్తలను వెనక్కి లాగే ఆ 'ఐదు' మాటలు

ప్రోత్సాహంతోపాటు విమర్శలు మహిళా పారిశ్రామికవేత్తలకు సవాళ్లు ఆ 'ఐదు' మాటలతోనే వెనక్కి లాగడం మొదలు

మహిళా పారిశ్రామికవేత్తలను వెనక్కి లాగే ఆ 'ఐదు' మాటలు

Thursday June 18, 2015,

3 min Read

నాణేనికి ఎల్లప్పుడూ రెండు ముఖాలుంటాయి. మహిళా పారిశ్రామికవేత్తల విషయంలోనూ అంతే. మీరు మహిళా పారిశ్రామికవేత్త అయితే మిమ్మల్ని ఆకాశానికెత్తే వారే కాదు..కిందకు పడేయాలని చూసే వారు కూడా ఉంటారు.

ఇక అప్పుడప్పుడు ఏకాంతంగా మిమ్మల్ని మీరు ‘నేను చేస్తున్నది సబబేనా’ అంటూ ప్రశ్నించుకున్న సందర్భాలూ ఉంటాయి.

ఏదైతేనేం.. భారత్‌లో మీరు మహిళా పారిశ్రామికవేత్త అయితే ఈ 5 సందర్భాలనూ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంత మంది ఈ పాటికే వీటి అనుభవాన్ని చూసి ఉంటారు కూడా.

image


1. మీరు ఉంటున్న తీరును తరచూ మీకు గుర్తు చేయడం !

అమ్మమ్మలు, నానమ్మలు, అత్తయ్యలతోజాగ్రత్త. వీరే కాదు వేలాది మంది బంధువులు మిమ్మల్ని చూడగానే కామెంట్ చేస్తారు. ‘అమ్మా, హెయిర్ స్టైల్ ఇలా కాకుండా ఫలానా విధంగా ఉంటే బాగుండేదేమో ? ‘నీ చర్మం గురించి పట్టించుకో ?’ ఏంటమ్మా అంత లావయ్యావు. నీ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటూ ప్రశ్నిస్తారు.

ఇతరుల మాదిరిగా సాధారణ ఉద్యోగం చేయడం లేదన్న విషయాన్ని ఎలా చెప్పాలో మీరు ఆలోచిస్తారు. రోజులో 14 గంటలు మీరు పని చేస్తూ బిజీగా ఉంటున్నారు. మానసికంగా, శారీరకంగా ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించడంలో మీరు నిమగ్నమయ్యారు.

2. మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు ?

పెళ్లా...? నిజమా..? హెయిర్ కట్ చేసుకోవడానికే సమయం లేదు. అలాంటిది అందంగా కనిపించేందుకు ఓ ఏడాదిపాటు సమయం వెచ్చించడమా? వేడుకలకు ఏర్పాట్లు చేయడం, సంపాదించిందంతా ఖర్చు చేయడం, అది కూడా బట్టలకు వ్యయం చేయడం. పెళ్లికి కొన్న బట్టలను మళ్లీ తొడుక్కోము కూడా.

ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది కదూ!

3. ఫలానా వాళ్ల అమ్మాయి కూడా MNCలో ఉద్యోగం చేస్తోంది. నీ అంత బిజీ కాదు, సమయానికే ఇంటికొస్తుంది. వారాంతాల్లో తీరికగా గడుపుతుంది. మరి నువ్వెందుకు అలా ?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ? సమాధానం చెప్పడం అంత సులభమా ! వారాంతాల్లో తీరికగా ఉండలేనని, అంత తీరిక అవసరం లేదని చెప్పగలరా? పనిని ప్రేమిస్తామని, అదే తమకు తీరిక అని చె ప్పగలరా? ఏమీ చేయకున్నా జీతం వచ్చే జీవితం మాకొద్దు అని చెప్పగలరా..

4. ఉన్నత చదువులు చేయొచ్చుగా?

ఇది అన్నిటి కంటే క్లిష్టమైన ప్రశ్న. ఫలానా వాళ్ల అమ్మయి ఎంబీఏ చదువుతోంది. ఇంత ప్యాకేజీ వస్తోంది వంటి ఎన్నో స్టోరీలు మీ చెవిలో నూరి పోస్తారు. నిజ జీవితంలో వినడం ద్వారా నేర్చుకుంటున్నామని వివరించడం ద్వారా ఇతరుల ఆగ్రహానికి లోనవడం మీ వంతు అవుతుంది. నిజ జీవితంలో వేలాది అంశాల్లో స్టార్టప్‌ను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటున్నాం. డబ్బుల వెంట పడం. మా జీవితానికి సార్థకత కావాలి అన్నది మీ మనసులో మాట.

5. ఇవన్నీ ఎందుకు వదిలేయవు? పెళ్లి చేసుకుని మీ భర్త వ్యాపారంలో సహాయ పడొచ్చు కదా ?

ఓ తల్లీ.. ! నా వ్యాపారం వేరు, అతని వ్యాపారం వేరు. అతనిది ఇప్పటికే స్థాపించిన వ్యాపారం. ఇతరుల వ్యాపారంలోకి నేను దూరి వారి ఖాతాలను పరిశీలించాలని ఎలా ఆశిస్తున్నావు. వినూత్న ఆలోచనను వ్యాపారంగా మలిచే పనిలో ఉన్నాను. అంతేకాదు దానిని విస్తరించాలి. నేను నెలకొల్పిన కంపెనీ నుంచి ప్రతిఫలాలను చూడాలి. ఇదంతా నా చేతుల మీదుగానే సాగాలి. అంతేగానీ సహాయం పేరుతో భర్త బట్టల దుకాణంలో వెళ్లి అతని సీట్లో కూర్చోవడం కాదు.


స్టార్టప్‌ను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న అవివాహిత యువతిని దృష్టిలో పెట్టుకుని ఈ జాబితాను రూపొందించాం. పెళ్లి అయిన మహిళా పారిశ్రామికవేత్తల విషయంలో స్టోరీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏదైతేనేం అటువంటి విమర్శలకు, ఉన్నత కలలను దూరం చేసేలా అంటిపెట్టుకుని ఉండే వారి ప్రభావం మీపైన లేకుండా ఉండాలన్నది మా ఆలోచన.

About the author:

Garima Juneja, Co-Founder, Viral Curry 

యువతులూ.. ఇక విజయవంతంగా కంపెనీని ‘స్టార్ట్’ చేయండి ! ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే ! సబ్‌కా సునో.. అప్నా కరో

మీకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయా.. ? అవేంటో మాతో పంచుకోండి. తర్వాతి తరానికి సలహాలివ్వండి. కామెంట్ రాయండి.