స్థానిక వ్యాపారుల ప్రచారానికి అండగా Yo! యాప్

ఐఐటి పూర్వవిద్యార్థుల అపూర్వ సృష్టిలోకల్ కనెక్టివిటీతో స్థానిక వ్యాపారానికి సేవలు2014 ఐఐటి ఖరగ్‌పూర్ స్ప్రింగ్ ఫెస్ట్‌లో విడులైన యాప్మార్కెట్ పరిధి తెలుసుకొని ప్రచారం

0

ప్రాడక్ట్ డెవలప్‌మెంట్‌లో పదకొండేళ్ళ అనుభవమున్న ప్రసన్న ఝా. ఆయన ఝామొబి డాట్ కామ్‌తో తన వ్యాపార యాత్రకు శ్రీకారం చుట్టారు. అది మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసే సంస్థ. ఝామొబి సంస్థ లో ప్రధానమైనది మొబైల్ యాప్ Yo !. అది ప్రజలను వాళ్ళ చుట్టూ ఉన్న వ్యాపారాలతో అనుసంధానం చేస్తుంది. ప్రసన్న తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి మొబైల్ యాప్ డెవలప్ చేసే స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నారు. అయితే అప్పటికప్పుడు ఎలాంటి ముందస్తు ఆలోచన గాని, బిజినెస్ ప్లాన్ గాని లేదు. పెట్టుబడికి డబ్బుగాని భాగస్వామిగాని శూన్యం. 

“ నాకు ఉన్నదల్లా ఒకటే పట్టుదల. ఇక మీదట ఉద్యోగం చేయబోనన్న గట్టి ధీమా. ఎందుకంటే నాకు నేనే న్యాయం చేసుకోలేను, నాకుటుంబానికి, నా యజమానికి కూడా న్యాయం చేయలేను అనిపించింది. “ అంటారు ప్రసన్న.

ప్రసన్న, మనీశ్ ఇద్దరూ ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థులు. Yo! అనేది మీ పరిసరాల్లోని ప్రజలను, వ్యాపారాన్ని అనుసంధానం చేసే లోకల్ కనెక్టివిటీ యాప్. ఎవరైనా తమ చుట్టూ ఏమున్నదో మైక్రో బ్లాగ్ లేదా చాట్ సాయంతో మీతో పంచుకుంటుంది Yo!. ఇంకా ముఖ్యంగా అది వినియోగదారులకు ఆఫర్ల గురించి, క్యాంపెయిన్ల గురించి, ప్రకటనల గురించి నేరుగా వ్యాపారి దగ్గరి నుంచి చెబుతూ ఉంటుంది. అందువల్ల లోకల్ క్లాసిఫైడ్స్ చూసి ఉత్పత్తులు స్థానికంగా అమ్మాలన్నా, కొనాలన్నా చాలా వేగంగా జరిగిపోతుంది. అయితే, దీనికీ, లొకేషన్ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్స్ కీ తేడా ఉంది. షౌట్, యాడ్ నియర్, వూప్లర్ లాంటి లొకేషన్ ఇంటలిజెన్స్ ప్లేయర్లు దీనికి పోటీ దారులు. కానీ వాళ్ళు అప్పటికే వాళ్ళ డేటా బేస్‌లో ఉన్న సమాచారాన్నే ఇస్తారు.  

ఉదాహరణకు వూప్లర్ అనేది మీరు షాపింగ్‌లో తెలుసుకున్న విషయాలను మీ ఫ్రెండ్స్‌తో పంచుకోవటానికి పనికొచ్చే వేదిక. కానీ Yo! మాత్రం ప్రతి విషయాన్నీ మీ చుట్టుపక్కలవాళ్లతో పంచుకోవటానికి పనికొస్తుంది. “ఇది చాలా చురుగ్గా ఉంటూ చుట్టుపక్కల వాళ్లనుంచి అందే తాజా సమాచారాన్ని జోడిస్తూ ఉంటుంది. దగ్గర్లో ఉన్నవాళ్లను అనుసంధానం చేయటమే Yo! యు ఎస్ పి.” అంటాడు ప్రసన్న.

ఆ ఇద్దరి విజన్ ఏంటంటే ప్రాంతం ఆధారంగా స్మార్ట్ ఫోన్ లో ఒక వేదిక కల్పించటం ద్వారా ఎవరికివాళ్ళు వాళ్ళ పరిసరాల్లో ఎవరితోనైనా, ఏ మార్కెట్ తోనైనా సులభంగా అనుసంధానమయ్యేలా చూడటం. నేరుగా అటు వినియోగదారునితోనూ, ఇటు వ్యాపారులతోనూ అనుసంధానమయ్యే బిజినెస్ మోడల్ ఇది. వినియోగదారుల విషయానికొస్తే, తెలియనివాళ్ళను తెలిసేలా చేస్తుందిది. “ మీకు దగ్గర్లో ఉన్నవాళ్ళకు మీ ప్రాంతాన్ని తెలియజేయటం ద్వారా వాళ్లతో మీకు కమ్యూనికేషన్ ఏర్పాటుచేస్తుంది. Yo! మీకు లోకల్ క్లాసిఫైడ్స్ తెలియజేయటం ద్వారా మీరు స్థానికంగానే కొనుగోలు చేసేట్టు చూస్తుంది. మీరు మీ బైక్ గాని టెన్నిస్ రాకెట్ గాని అమ్మదలచుకుంటే Yo! లో పోస్ట్ చేయండి చాలు. మీకు రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళు వెంటనే కొనటానికి ఆసక్తి చూపే అవకాశాలు మెండుగా ఉంటాయి“ అంటాడు మనీశ్.

ఇక వ్యాపారాలతో అనుసంధానం విషయానికొస్తే, అన్ని వ్యాపారాలూ తమ స్థానిక ప్రజల గురించి అర్థం చేసుకోవాలన్నా, క్లయింట్స్ ను నిర్వచించుకొవాలన్నా, సమయం ఎంచుకోవాలన్నా, సందేశం వ్యాప్తి కోసమైనా, లాభదాయకంగా వ్యాపారం నడపాలన్నా Yo! ఒక మాధ్యమాన్ని సమకూరుస్తుంది. ప్రస్తుతానికి ఆఫ్ లైన్ స్థానిక మార్కెట్ కు కస్టమర్లను నిలువరించుకోగలిగేలా ఎలాంటి మాధ్యమమూ లేదు. ఆ సమస్యకు Yo! పరిష్కారం అందిస్తుందని చెబుతున్నారు ప్రసన్న. ప్రస్తుతానికి ఈ యాప్ గత ఆరు నెలల కాలంలో మార్కెటింగ్ మీద పైసా ఖర్చుపెట్టకుండా దాదాపు 500 మంది యూజర్లను సంపాదించుకోగలిగింది. దీన్ని 2014 జనవరిలో ఐఐటి ఖరగ్ పూర్ లో జరిగిన స్ప్రింగ్ ఫెస్ట్ లో అధికారికంగా విడుదలచేశారు.

స్థానిక వ్యాపారాలు తమ ఉత్పత్తులకు, సేవలకు సమర్థంగా ప్రచారం కల్పించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ ప్లాట్ ఫామ్ ఆ అవకాశం కల్పిస్తుంది. వాళ్ళ మార్కెట్ పరిధి ఎంతో తెలియజేసి ప్రచారానికి సానుకూల పరిస్థితి కల్పిస్తుంది. ఎలాంటి హడావిడీ లేకుండా ప్రకటనలకు, ఆఫర్లకు ప్రచారం కల్పిస్తుంది. ప్రకటనల సమయం కొనాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. “ ముందుగా మేం స్థానిక వ్యాపారాలను ఇక్కడ పూణెలో ఉన్న కస్టమర్లతో అనుసంధానం చేస్తాం. ఆ తరువాత దీన్నే ఇతర ప్రధాన నగరాలకూ విస్తరిస్తాం. మొబైల్ ఆధారిత అడ్వర్టయిజింగ్ టెక్నాలజీ మార్కెట్ ను విప్లవాత్మకం చేయగల సామర్థ్యం Yo! కి ఉంది “ అంటున్నారు ప్రసన్న.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik