స్వచ్ఛందంగా 22 గ్రామాల ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు

స్వచ్ఛందంగా 22 గ్రామాల ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు

Wednesday April 12, 2017,

2 min Read

డేటా సేకరణ దేశంలో అతిపెద్ద సమస్య. దానికి కారణం ప్రభుత్వం దగ్గర సరైన సిబ్బంది లేకపోవడం.. లేదంటే సేకరించే సాధనాలు అందుబాటులో ఉండకపోవడం. ముఖ్యంగా ప్రజారోగ్యం విషయంలో మన దగ్గర కచ్చితమైన సమచారం లేదు. ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు? ఎక్కడ ఎలాంటి చికిత్స అవసరం అన్న సమాచారం వివరంగా లేదు. వాస్తవ పరిస్థితులకు, ప్రభుత్వం దగ్గరున్న లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. ఈ గ్యాప్ ని పూరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు అర్చన షివాలె, రేణుక ధనక్ అనే ఇద్దరు మహిళలు.

image


హెల్త్ అండ్ డెమోగ్రాఫిక్ సర్వైలెన్స్ సిస్టమ్స్ అనే సంస్థలో ఇద్దరు పనిచేస్తుంటారు. పుణెకు చెందిన ఈ ఆర్గనైజేషన్ జనన మరణాలు, వలసలు, వివాహాలు, ఆరోగ్య విషయాలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఇంకా అనేక వివరాలను సేకరిస్తుంది.

చుట్టుపక్కల 22 గ్రామాల్లో ఇలాంటి డేటాను ప్రతీ ఆరు నెలలకోసారి సేకరించి భద్రపరుస్తారు. 2002లో మొదలైన ఈ సంస్థతో ఎక్కువ శాతం మహిళలే అసోసియేట్ అయ్యారు. ఇంటిపని చేయడం, పిల్లల్ని కనడం, వారి ఆలనా పాలనా చూడటం తప్ప, నేటికీ గ్రామాల్లో మహిళకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అలాంటి నేపథ్యంలో వంటింటికే పరిమితమైన స్త్రీలకు టెక్నాలజీ పరంగా శిక్షణ ఇచ్చి, హెల్త్ డేటా సేకరించేందుకు నియమించుకుంటున్నారు. తద్వారా వాళ్లు కూడా ఎంతోకొంత ఆర్ధికంగా ఇంటికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

కమ్యూనిటీ ఆధారంగా నైతిక పరిశోధన చేసి, స్థిరమైన, హేతుబద్ధమైన గ్రామీణ జనాభా ఆరోగ్య వివరాలను సేకరించి, అందుకు అవసరమైన పరిష్కార మార్గాలను సూచించడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం అంటారు హెచ్డీఎస్ఎస్ సెంటర్ ఆఫీస్ ఇంచార్జ్ సంజయ్ జువేకర్.

ఎన్ఎస్ఎస్వో, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో పాటు అనేక ఏజెన్సీలతో హెల్త్ అండ్ డెమోగ్రాఫిక్ సర్వైలెన్స్ సిస్టమ్స్ టై అప్ పెట్టుకుంది. ఎందుకంటే వీళ్ల దగ్గర ఉన్న డేటా చాలా అసంపూర్తిగా ఉంది. అందులో కొంత నకిలీ సమాచారం కూడా వుంది. అదంతా ప్రభుత్వ నుంచి సేకరించిన వివరాలే. అందుకు కారణం నిధుల కొరత, సిబ్బంది కొరత అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే సమాచారం అరకొరగా తయారైంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో అన్వేషణ తప్పదని ఈ సంస్థ భావిస్తెంది. ఈ విషయంలో లోతైన విశ్లేషణ చేసి, ఎక్కువ మందిని ఇన్ వాల్వ్ చేస్తే తప్ప, గ్రాస్ రూట్ లెవల్లో ప్రజారోగ్యం ఎంత బలహీనంగా వుందో తేటతెల్లం కాదంటారు సంస్థ నిర్వాహకులు.