బడి తీరు మారాలి.. విద్యార్ధి నడిచే బాట మారాలి !

బడి తీరు మారాలి.. విద్యార్ధి నడిచే బాట మారాలి !

Sunday January 10, 2016,

2 min Read

విద్యావ్యవస్థలో మార్పు కోసం ప్రపంప వ్యాప్తంగా ఎన్నో సంస్థలు మరెన్నో రకాలుగా పోరాటాలు చేస్తునే ఉన్నాయి. మార్కులకోసం పాకులాడే స్కూళ్లు, ర్యాంకుల కోసం ఎగబాకే కళాశాలలు ఉన్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదనేది వాస్తవం. స్కూల్లో మాస్టార్లు, ఇంట్లో తల్లిదండ్రులు ఒతిళ్లతో విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. విద్యావేత్తలు సైతం ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తన్నా ఎక్కడి గొంగళి అక్కడిగానే ఉంటుంది తప్పితే ఫలితం మాత్రం శూన్యం.

image


ఇదే విషయంపై సెంటర్ ఫర్ ఎక్స్ పీరియన్స్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ రెండు దశాబ్దాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. స్కూల్ నుంచి కాలేజీ దాకా, విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల దాకా ,ఉపాధ్యాయుల నుంచి స్కూలు యాజమాన్యం దాకా అందరిలో అవగాహన తీసుకురావడంలో తనదైన వాణి వినిపిస్తోంది.

“విద్యార్థుల సాధికారికతే అసలైన విద్య,” విశ్వాస్ పర్చురే

విశ్వాస్ పర్చురే ఈ సంస్థ తరుపు నుంచి వేల సంఖ్యలో వేదికలపై ప్రసంగాలిచ్చారు. చిన్నారులే మన జాతి ఆశాకిరణాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సాధికారికత (ఎంపవరింగ్) అసలైనవిద్య (ఎడ్యుకేషన్) అని ఆయన విద్యకు నిర్వచనం ఇచ్చారు. వారిని స్కూల్ రోజుల నుంచే ఒత్తిడికి గురిచేచేయడం సరికాదని అంటున్నారాయన.

image


అడ్వంచర్ లో అసలైన విద్య దాగి ఉంది

విశ్వాస్ సైతం ఎన్నో అడ్వంచర్ టూర్ లకు వెళ్లారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ తరుపున ఇక్కడ జరిగే సెషన్స్ లలో చిన్నారులతోపాటు, మెంబర్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలోనే చిన్నారులు విద్యపై ఏర్పాటు చేసిన వేదికపై విశ్వాస్ ప్రసంగించారు.

“స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చి నేచర్ ని చూపించండి,” విశ్వాస్

స్కూల్లోనే రోజంతా గడుపుతున్న చిన్నారులకు రోజులో కొన్ని గంటలు బయటి ప్రపంచంలోకి తీసుకొస్తే వారు పది రెట్లు ఉత్సాహవంతులవుతారని అన్నారాయన. స్కూల్లో కూడా అడ్వెంచర్ టూర్లను ఏర్పుట చేయాలని అంటున్నారు. వాటివల్ల టీం బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ లాంటి ఎన్నో రకాలైన లాభాలున్నాయి. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఇది సరైన మెడిసిన్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచం మొత్తం స్కూల్స్ ఒకేలా ఉన్నాయి

స్కూల్ ఎడ్యుకేషన్, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని విశ్వాస్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో బ్లాక్స్ అండ్ వైట్స్, మిడిల్ ఈస్ట్ లో అరబ్స్, భారతదేశంలో కూడా కులాలు, మతాలు ఇలాంటి వ్యత్యాసాలు స్కూలు రోజుల నుంచే చిన్నారులు జీవితాల్లోకి ప్రవేశించడం మనం చూడొచ్చు. ఈ వ్యవస్థ మారాలి. మా ఒక్క సంస్థతో మార్పు వస్తుందని మేం అనుకోవడం లేదు. సమాజంలో ఉన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారాయన.

“25 ఏళ్లుగా ఎన్నో దేశాల్లో పర్యటించి గమనించిన కామన్ విషయం ఇదొక్కటే,” విశ్వాస్

చిన్న వయసు నుంచే పిల్లల్లో వ్యత్యాసాలు ఏర్పడితే అది పెద్దయ్యాక కూడా కొనసాగుతునే ఉంటుంది. దీన్ని మార్చడానికి సమాజం కలసి రావాలి. అందరి ఆలోచన సరళి మారాలని అంటున్నారాయన.

image


చివరగా చెప్పేవిషయం

ఎడ్యుకేష్ అందరి హక్కు కావాలి. అందరికీ విద్య అనేది సమాజం బాధ్యతగా మారాలి. దీనిపై ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువే. మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులకోసం మనం నడుంబిగించాలని అంటున్నారు.

“ఏదైనా చేయాలని అనిపిస్తే, దాన్ని చేయండి.” విశ్వాస్

నేనిచ్చేది సలహా అనుకోండి మరేదైనా అనుకొండి. కానీ మీరు ఏదైనా చేయాలని అనుకుంటే దాన్ని చేసి చూపించండి. మార్పు మీనుంచే మొదలవుతుంది. చెప్పినంత మాత్రాన ఎవరూ మారిపోవాలని ఆశించడం లేదని, కానీ ప్రతి ఒక్కరి ఆలోచనా విధానంలో మర్పు వస్తే సమాజంలో , దేశం, తద్వారా ప్రపంచం మారుతుందని ముగించారు విశ్వాస్.