విశాఖలో మొదటి కో వర్కింగ్ స్పేస్ ‘వైజాగ్ ఫస్ట్ ఆఫీస్’

విశాఖలో మొదటి కో వర్కింగ్ స్పేస్ ‘వైజాగ్ ఫస్ట్ ఆఫీస్’

Wednesday January 20, 2016,

3 min Read

వైజాగ్ లోస్టార్టప్ కల్చర్ బాగానే పెరుగుతోంది. స్టార్టప్ టాక్స్ ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. స్టార్టప్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న ఉత్సాహవంతులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఫ్రీలాన్సర్స్, రైటర్స్, ఫిల్మ్ మేకర్స్ లాంటి వారికి ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతో వైజాగ్ కేంద్రంగా ఓ కో వర్కింగ్ స్పేస్ ప్రారంభమైంది.

image


ఇది మొదలు

మూడేళ్ల క్రితం అంటే 2013లోనే వైజాగ్ కేంద్రంగా స్టార్టప్ కంపెనీల కోసం ఓ ప్లాట్ ఫాం, ఓ కాన్ఫిరెన్స్ హాల్ లాంటిది ప్రారంభిచాలని అనుకున్నారు శ్రీనివాస్ ఆయన స్నేహితులు.

“2015 ఏప్రిల్ నాటికి మేం ఒక కో వర్కింగ్ స్పేస్ ని ప్రారంభించగలిగాం,” శ్రీనివాస్ సవరం

శ్రీనివాస్ వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ కి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు ఆయన ఓ ఐటి కంపెనీని లో భాగస్వామిగా ఉన్నారు. ఆ కంపనీకి సంబంధించిన మరో ఇద్దరు పార్ట్‌నర్స్ కూడా వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ కు ఫౌండర్లుగా ఉన్నారు. 2014 లో ఆ ఐటి కంపెనీ కొత్త ఆఫీసు తీసుకొని అందులోనికి షిఫ్ట్ అయింది. అప్పుడీ ఆఫీసు ఖాళీ అయింది. దీన్ని రెంట్ కు ఇవ్వమని చాలా ప్రపోజల్స్ వచ్చాయి. అప్పటికే స్టార్టప్ కోసం ఓ ప్లాట్ ఫాం క్రియేట్ చేద్దామనుకున్న శ్రీనివాస్ తన పార్ట్‌నర్స్ దగ్గర అదే ప్రపోజ్ చేశారు.

“మా పాత ఆఫీసుని రెంట్ కి ఇస్తే మంచి రేట్ వస్తుంది కానీ, స్టార్టప్ కు సాయం అందిస్తామనే లక్ష్యం నెరవేరదు,” శ్రీనివాస్

ఉన్న ఆఫీసుని కో వర్కింగ్ స్పేస్ కు అంకితం చేశారు. మొదట్లో ఎవరైనా వచ్చి ఆఫీసులో పని చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరిన్ని సౌకర్యాలు కల్పించి మినిమం చార్జీలను నిర్ణయించారు. దీంతో అక్కడ పనిచేసే వారికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉంటుందని భావించినట్లు ఆయన అంటున్నారు.

image



వైజాగ్ లోఇదే మొదటి కార్యాలయం కావాలి

వైజాగ్ ఫస్ట్ ఆఫీసు పేరులోనే మొత్తం అర్థం అవుతుంది. ఎవరైనా స్టార్టప్ మొదలు పెడితే వారికి ఈ కోవర్కింగ్ స్పేస్ ఆఫీసుని అందిస్తుంది.

“వైజాగ్ ఫస్ట్ ఆఫీసే, స్థానిక స్టార్టప్ లకు మొదటి కార్యాలయం కావాలి,” శ్రీనివాస్

వైజాగ్ ఫస్ట్ ఆఫీసు ఆలోచన, లక్ష్యం కూడా ఒక్కటే. ఇక్కడ మొదలైన స్టార్టప్ ఏదైనా గొప్ప సంస్థగా మారాలంటున్నారాయన. ఇప్పటి వరకూ పదికి పైగా స్టార్టప్ కంపెనీలు ఈ కోవర్కింగ్ స్పెస్ లో ప నిచేస్తున్నాయి. ఇక్కడికొచ్చే స్టార్టప్ లకు మెంటార్షిప్ తోపాటు ఇతర విషయాల్లో సాయం అందిస్తామని శ్రీనివాస్ అంటున్నారు. కొన్ని కంపెనీలకు సీడ్ ఫండింగ్ అవసరం ఉంటుంది, కొంతమంది ఆంట్రప్రెన్యువర్లు స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి మక్కువతో ఉంటారు. ఈ ఇద్దరికి సరైన ఫ్లాట్ ఫాం కల్పించి వారధిగా తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారాయన. వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ నుంచి కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయంటున్నారు.

image


వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ టీం

శ్రీనివాస్ సవరం వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ కో ఫౌండర్. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన అనంతరం అమెరికా నుంచి ఎమ్ ఎస్ చేశారు. 9ఏళ్లు అక్కడ వివిధ సంస్థల్లో పనిచేసి తిరిగి ఇండియా వచ్చారు. రెండు దశాబ్దాల ఐటి, హెచ్ ఆర్ లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రవీణ్ సంఖ్ల మరో కో ఫౌండర్. బీఈ, ఎంబీయే, ఎల్ఎల్ బి చేసిన ప్రవీణ్ కి 22ఏళ్ల ఇండస్ట్రియల్ అనుభవం ఉంది. మన్మోహన్ జైన్ ఈ సంస్థకు మరో కోఫౌండర్. అమెరికాలో కేన్సాస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసిన ఆయన అక్కడే కొన్నాళ్లు పనిచేశారు. అనంతరం ఇండియాలో ఎమ్మెన్సీ కంపెనీల్లో మొత్తం రెండు దశాబ్దాల అనుభవం ఉంది. స్టార్టప్ లు, ఈ ఈకో సిస్టమ్ పై ఎంతో కాలంగా పనిచేస్తున్నారు. మొత్తం కలిపి అరవై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వ్యక్తుల బ్రెయిన్ చైల్డ్ ఇది.

image


పరిమితులు, సవాళ్లు

వైజాగ్ కేంద్రంగా కో వర్కింగ్ స్పేస్ ప్రారంభించడానికి చాలా పరిమితులున్నాయి. మెట్రో నగరాల్లో లాగా ఇక్కడ అంతగా ఈ సెక్టార్ పై జనం మొగ్గు చూపరు. దీంతో పాటు స్థానికంగా ఇంకా కో వర్కింగ్ స్పేస్ కి వచ్చి పనిచేసే స్థాయిలో స్టార్టప్ లు కానీ, ఫ్రీలాన్సర్స్ కానీ లేరు. అంతా వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్టుతో పనిచేసుకుంటున్నారు. దీంతో పాటు స్థానికంగా ఇలాంటి కాన్సెప్ట్ పై అవగాహణ తక్కువ. దీన్ని అధిగమించాల్సి ఉంది. కో వర్కింగ్ స్పెస్ అంటే ఇంకా ఆఫీస్ రెంట్ కు ఇస్తారనే వారే ఎక్కువ. ఈ కాన్సెప్ట్ ను పూర్తిస్థాయిలో జనంలోకి వచ్చే దాకా ఎదురుచూడాలి, దీన్ని అధిగమించాలి. అయితే ఇప్పటికే పది స్టార్టప్ కంపెనీలు తమ కో వర్కింగ్ స్పెస్ ద్వారా తమ కార్యకలాపాలు ప్రారంభించాయని, ఈ సవాళ్లను అధిగమించడం పెద్ద కష్టం కాదని ధైర్యంగా చెబుతున్నారు శ్రీనివాస్.

image


భవిష్యత్ ప్రణాళికలు

వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ ను భవిష్యత్ లో ఓ ఇంక్యుబేషన్ సెంటర్ గా మార్చాలనుకుంటున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. దీంతో పాట్ వైజాగ్ ఫస్ట్ ఆఫీస్ కేంద్రంగా స్టార్టప్ టాక్స్, ఈవెంట్స్ ఇప్పటికే మొదలుపెట్టామని, వీటిని మరింత విస్తరిస్తామని అంటున్నారు. ఫండింగ్ పై ఇప్పట్లో ఆలోచన లేకపోయినా, తమతో కలసి భాగస్వామి కావాలనుకునే సంస్థలతో కలసి పనిచేయానికి సిద్ధంగా ఉన్నట్లు శ్రీనివాస్ చెబుతున్నారు. వచ్చే ఏడాదికల్లా ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన డిజైన్డ్ టెక్నాలజీ పార్క్ అవకాశాన్ని వినియోగించుకుంటామని అంటున్నారు.