యాప్స్ తయారీలో రారాజు యాప్ స్టూడియోస్

యాప్స్ తయారీలో రారాజు యాప్ స్టూడియోస్

Sunday August 16, 2015,

3 min Read

వేగం, నైపుణ్యం యాప్ స్టూడియోస్ ప్రత్యేకత.

ధర ఎక్కువైన వెనుకాడని వినియోగదారులు.

ఏడాదిలో 20లక్షల డాలర్లకు టర్నోవర్.

గేమ్స్ యాప్స్ తయారీలోనూ తమదైన స్టైల్.

సేవారంగంలో ఎంత చేసినా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంటుంది. ఇప్పుడు వ్యాపారవేత్తలకు, టెక్నాలజిస్టులకు అదొక వ్యసనం. అయితే వ్యాపారాభివృద్ధి మాత్రమే దీని లక్ష్యం కాదు. యాప్ స్టూడియోస్ (AppStudioz) వ్యవస్థాపకుడు సౌరభ్ సింగ్ ఇలాగే ఆలోచించారు. టెక్అహెడ్ సాఫ్ట్ వేర్ (TechAhead Software) సంస్థలో సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన.. దాని నుంచి బయటకు వచ్చి సొంతంగా 2011 ఏప్రిల్లో AppStudioz స్థాపించారు.

సౌరభ్ సింగ్, యాప్ స్టూడియోస్ వ్యవస్థాపకులు

సౌరభ్ సింగ్, యాప్ స్టూడియోస్ వ్యవస్థాపకులు


App Studioz మంత్రం ఒక్కటే.. యాప్స్ ని తయారు చేయడం.. వీలైనంత వేగంగా అందించడం.

“ యాప్స్ తయారీ రంగంలో మాకు పూర్తి అనుభవం ఉంది. ఇందులో మా విధానం చాలా వేగంగా ఉంటుంది” అని చెప్తారు సౌరభ్. గతంలో పనిచేసిన కంపెనీల నుంచి సౌరభ్ ఎంతో నేర్చుకున్నాడు. అందుకే ఈ రంగంలో వేగంగా రాణించగలుగుతున్నాడు. కేవలం రెండేళ్లలోనే యాప్ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా 150 క్లయింట్స్‌ని పొందింది. దీన్నిబట్టే పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యాప్ స్టూడియోస్‌లో 160 మంది ఉద్యోగులున్నారు.

యాప్ స్టూడియోస్ టీం

యాప్ స్టూడియోస్ టీం


వేగం.. దూకుడు

ఈ రంగంలోనే ఎన్నో ఏళ్లుగా పని చేస్తుండడంతో సౌరభ్ కు విస్తృతమైన పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో.. క్లయింట్స్ ను పొందడం పెద్ద కష్టం కాలేదు. “ ప్రాజెక్టు పొందేందుకు మాకు సాధ్యమైనంతమేరకు మేం ప్రయత్నిస్తాం. ధర విషయంలో కూడా చాలా వరకూ పోరాడుతాం..” అంటారు సౌరభ్.

మొబైల్ అప్లికేషన్లు తయారుచేయడం యాప్ స్టూడియోస్ ప్రధాన ఉద్దేశం. అయితే.. ఇతర రంగాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది. 3D/2D, ఎంటర్ ప్రైజ్, వియరబుల్ కంప్యూటింగ్ లాంటి ఏరియాల్లో కూడా తన సేవలందిస్తోంది. సుమారు 7వందలకు పైగా అప్లికేషన్లను యాప్ స్టూడియోస్ తయారుచేసింది. క్లయింట్స్ సంతృప్తిగా ఉండడంతో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. “ మా దగ్గరకి క్లయింట్ వచ్చిన 24 గంటల్లోనే టీంను ఏర్పాటు చేయడంతో పాటు పని ప్రారంభమైపోతుంది. ఆ తర్వాత అది పూర్తయ్యే వరకూ ఆ టీం నిద్రపోదు..” అంటారు సౌరభ్.

వీటన్నిటికీ మించి యాప్ స్టూడియోస్‌కు ఉద్యోగులు పెద్ద బలం. “ మాకు చాలా చురుకైన యువకులు ఉన్నారు. ఎక్కువ వయసున్న వాళ్లను తీసుకోలేదు. దాదాపు ఒకే వయసున్న వాళ్లు కావడంతో చాలా సులువుగా పని వేగంగా జరుగుతోంది..” అంటారు సౌరభ్.

రోహిత్ సింఘాల్ (Rohi Singhal) స్థాపించిన సోర్స్ బిట్స్ (Sourcebits) కంపెనీ భారత్ లో అప్లికేషన్ల తయారీ రంగంలో ఎంతోకాలం నుంచి పనిచేస్తూ ఉంది. ఎలాంటిదైనా కాదనకుండా చేస్తారనే పేరు ఆ కంపెనీకుంది. ఆ విషయాన్ని సౌరభ్ కూడా అంగీకరిస్తారు. “ రోహిత్ చాలా అద్భుతమైన కంపెనీని స్థాపించారు. అతని సోర్స్ బిట్స్ కంపెనీ మాకు స్ఫూర్తి అని చెప్పకపోతే అది అబద్దమే అవుతుంది” అని సవినయంగా ఒప్పుకుంటారు సౌరభ్.

Sourcebits ప్రధానంగా డిజైన్ పైన ఆధారపడి ఉంది. App Studioz సృజనాత్మకత తమ ప్రధాన బలమని నమ్ముతుంది. అంతేకాక వేగం దానికి జతకలవడం వల్ల అద్భుతాలు సాధిస్తున్నట్టు చెబుతుంది. IndiaNIC, RoboSoft, OpenXcell లాంటి ఇతర కంపెనీలు కూడా అప్లికేషన్ల అభివృద్ధి రంగంలో ఉన్నాయి. ఎన్ని కంపెనీలు ఉన్నా.. వాటికి సరిపడనంత పని ఉండడం గొప్ప విషయం.

యాప్ స్టూడియోస్ సిబ్బంది

యాప్ స్టూడియోస్ సిబ్బంది


తక్కువ ధరకే సేవలు

అప్లికేషన్ల అభివృద్ధి చాలా పెద్ద మార్కెట్. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికి వెనుకాడట్లేదు. ఇతర కంపెనీలతో పోల్చితే App Studioz చాలా ఎక్కవ వసూలు చేస్తుందనే పేరుంది. నెల రోజుల్లో తయారయ్యే ఒక అప్లికేషన్ కు సుమారు 10-15వేల అమెరికన్ డాలర్లను App Studioz వసూలు చేస్తోంది. అంతకంటే ఎక్కువ సమయం, ఎక్కువ ఆప్షన్స్ అవసరమయితే 50-60వేల డాలర్ల వరకూ తీసుకుంటోంది..

“ మేం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. రెండో ఏడాదిలో అడుగుపెట్టే సమయానికి 20 లక్షల డాలర్ల టర్నోవర్ సాధించగలిగాం” అని చెప్పారు సౌరభ్. నోయిడా కేంద్రంగా ఉన్న App Studioz ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పలు చోట్ల సేవలందిస్తోంది.

App Studioz గేమింగ్ రంగంలో కూడా పనిచేస్తోంది. పది మందితో కూడిన ఓ బృందం గేమ్ యాప్స్ తయారు చేస్తోంది. వీటి వల్ల ప్రకటనలరూపంలో రోజుకు 600-700 డాలర్ల ఆదాయం సమకూరుతోంది. తన సంస్థ అభివృద్ధిపై పూర్తి సంతృప్తితో ఉన్న సౌరభ్ భవిష్యత్తులో మరింత వేగంగా పనిచేయాలని తపిస్తున్నారు. అద్భుతాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.