నోరూరించే ఇంటి రుచులు.. ఆర్డర్ ఇస్తే డబ్బా రెడీ

నోరూరించే ఇంటి రుచులు.. ఆర్డర్ ఇస్తే డబ్బా రెడీ

Monday March 21, 2016,

2 min Read


విద్య, ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అమ్మచేతి వంటకు దూరం కాక తప్పదు. హోటల్ లో ఎలాంటి భోజనం పెడుతున్నారో… నూనెలు ఎలాంటివి వాడుతున్నారో తెలియదు. అందుకే హోటల్ తిండి తినలేక చాలామంది అవస్తలు పడుతూ పస్తులుంటున్నారు. అందుకే ఇంటి వంట రుచి నగరవాసులకు చూపించాలనుకున్నారు గౌరవ్, అతని భార్య పల్లవి. ఎంకే డబ్బావాలా పేరుతో బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నైలో ఔట్ లెట్స్ పెట్టారు. సంప్రదాయ హోటల్స్ అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే దానికి టెక్నాలజీ జోడించారు. మొదట్లో మస్త్ కలాందర్ పేరుతో మార్కెట్లోకి వచ్చినా.. ఎంకే డబ్బావాలా అని పేరుమార్చి మీ ఇంటి రుచి అని ట్యాగ్ లైన్ పెట్టారు. 

హోటల్ బిజినెస్ కోసం ఆరంకెల జీతాలను, కార్పొరేట్ కొలువులను వదలుకున్నారు గౌరవ్, పల్లవి. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బెంగళూరులో ముందుగా ఒక షాపు పెట్టారు. తర్వాత దాన్ని మస్త్ కలందర్ పేరుతో 2006లోనే హోటల్ గా మార్చారు. పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఫుడ్ అందించారు. సౌత్ ఇండియాలో నార్త్ ఇండియన్ ఫుడ్ యమ టేస్టీగా దొరకడంతో కస్టమర్లు ఎగబడ్డారు. ఇప్పుడు బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నైలో 45 ఔట్ లెట్లు పెట్టారు. ఇప్పుడు గౌరవ్, పల్లవి దగ్గర 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా పలు నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నారు. 

డాట్ కాంతో బూమ్

2008లో mastakalandar.com ను స్థాపించారు. తర్వాత 2014లో MKDabbawala.com గా మార్చారు. ఏంకే డబ్బావాలా డాట్ కాంలోకి లాగిన్ అయ్యి… ఆర్డర్ ఇస్తే చాలు ఫుడ్ ఇంటి తలుపు తడుతుంది. డబ్బా అంటే క్యారేజ్ … ఆఫీసుకు వెళ్లేటప్పుడు రోజూ ఒకేలాంటి ఫుడ్ తీసుకెళ్లం… పైగా డబ్బా అంటే అందరికీ కనక్ట్ అవుతుంది. అందుకే ఈ పేరు పెట్టామంటున్నారు గౌరవ్. 

అప్పుడు ఇప్పుడు

ఫుడ్ టెక్ స్టార్టప్స్ వచ్చి ఏడాదిన్నరవుతోంది. సంప్రదాయ రెస్టారెంట్ గా ఉంటే ఎదగలేమని తెలుసుకుని … ఆన్ లైన్లోకి వెళ్లాలనుకున్నారు. ఫోన్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటే… డెలివరీ చేసినప్పుడు సమస్యలొస్తాయి. ఫోన్లో అడ్రస్ సరిగా వినిపించకపోతే ఒకచోటికి బదులు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. టైం వేస్ట్. మనీ వేస్ట్. ఎనర్జీ వేస్ట్. అందుకే యాప్, వెబ్ సైట్లతో బండిని పట్టాల మీదికి ఎక్కించారు. యాప్ లోగానీ, సైట్ లోగానీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అడ్రస్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డోర్ డెలివరీ సమయంలో ఎలాంటి సమస్య రాదు. ముంబై డబ్బావాలాలు ఎంత కచ్చితంగా క్యారేజ్ లు చేరవేస్తారో… అంత కరెక్టుగా వీళ్లు ఫుడ్ డోర్ డెలివరీ చేస్తున్నారు.

image


స్పేస్ ఉంటేనే రెస్టారెంట్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. 50 మంది ఒకేసారి కూర్చొని తినేందుకు స్పేస్ ఉందంటే… పీక్ అవర్స్ లో 2 వందలమందికి మాత్రమే వడ్డించగలరు. ఆన్ లైన్ డెలివరీ అలాకాదు… బైక్ బాయ్స్ ని పెట్టుకుంటే ఆకాశమే హద్దు. ఎన్ని ఆర్డర్స్ అయినా తీసుకోవచ్చు. 

ఎంకే డబ్బావాలా యాప్… ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో ఉంది. అంచనాలకు మించి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ కు తగ్గట్లు సర్వ్ చేయడానికి ఎక్కువమంది బాయ్స్ ను నియమించుకుంటున్నారు. వెబ్ సైట్, యాప్స్ వల్ల వ్యాపారమూ విస్తరిస్తోంది. ఎంకే డబ్బావాలా ఔట్ లెట్స్ లోని కిచెన్స్ సామర్థ్యాన్ని పెంచారు. వెబ్ సైట్, యాప్ లో ట్రాఫిక్ బాగా పెరిగింది. డిమాండ్ కు తగ్గ సప్లై చేసేందుకు స్పెషల్ కిచెన్స్ పెట్టారు. వంట దగ్గర నుంచి డెలివరీ వరకు క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీపడరు. ధరలు కూడా చాలా రీజనబుల్. పైగా ఫుడ్ విషయంలో మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది… అందుకే క్వాలిటీ విషయంలో రాజీపడొద్దంటున్నారు గౌరవ్ అండ్ పల్లవి.