మెయిల్ ఐడీ తెలియకపోయినా మెసేజ్ పంపే యాప్

నో మై ఐడి - వినూత్న ప్రయోగంఈమెయిల్ ఐడి తెలియకపోయినా సందేశం పంపొచ్చుమన ఫోన్ ద్వారా అవతలి వాళ్లకు సమాచారం చేరవేసేవీలుకార్పొరేట్లు, బ్యాంకులకు ఎంతో ఉపయుక్తం

0

NoMyID… భారత దేశలోనే రూపొందిన యాప్. ఇది ప్రపంచంలో మారుమూల ఉన్న ఏ మొబైల్ నెంబర్ కైనా ఈ-మెయిల్ పంపే అవకాశమున్న యాప్ ఇది. ఈ-మెయిల్ ఐడీలు తెలియకపోయినా తమ ఫోన్ బుక్ నుంచి సందేశాలు పంపే వీలుంటుంది.తక్షణ సందేశాల్లో అవకాశం లేని డాక్యుమెంట్లు, భారీ స్థాయి సమాచారాన్ని కూడా ఇందులో పంపే వీలుంది. వాణిజ్య పరంగా బ్యాంకులకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఖాతాదారుల ఫోన్ నెంబర్లు మాత్రమే నమోదై.. ఈ-మెయిల్ ఐడీ బ్యాంకులో నమోదు కాని సందర్భాల్లో ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లో పంపే బ్యాంక్ ప్రోత్సాహకాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా బట్వాడా చేసే వీలుంటుంది.

ఇమేజ్ క్రెడిట్ - shutterstock
ఇమేజ్ క్రెడిట్ - shutterstock

ఆండ్రాయిడ్ మరియు ఐఎఎస్ ఫ్లాట్ ఫాంపై ఈ యాప్ అందుబాటులో ఉంది.ఉచితంగా డౌన్ లోడ్ చేసి వాడుకోవచ్చు. యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత తమ ఫోన్లోకి అమర్చుకోవచ్చు. యూజర్ నేమ్ ఎంపిక చేసి, నమోదైన తర్వాత ఏ మొబైల్ నెంబర్‌కైనా మెయిల్స్ పంపే, స్వీకరించే వీలుంటుంది. వారితో ఛాటింగ్ కూడా చేసుకోవచ్చు..

యూజర్ ఒక సారి తన సంచాలకుడికి మెయిల్ పంపిన వెంటనే ‘nomyid.com’ డొమెయిన్‌లో అది ఈ-మెయిల్ గా మారిపోతుంది. గ్రహీత నెంబర్‌కు మెయిల్ పంపుతుంది. గ్రహీత ఈ యాప్ వినియోగించని వ్యక్తి అయితే వారికి ఎస్ఎంఎస్ వస్తుంది. అప్పుడు యాప్ డౌన్ లోడ్ చేసుకుని వెబ్ మెయిల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

ఇతర లక్షణాలు

  • యూజర్ మొబైల్ నెంబర్ ప్రత్యేకమైనది. అదే ఈ-మెయిల్ ఐడీగా ఉపయోగపడుతుంది.
  • ఈ-మెయిల్ ద్వారా యూజర్ ఎలాంటి డాక్యుమెంట్‌నైనా పంపే వీలుంది. స్వీకరించే అవకాశమూ ఉంది.
  • సందేశాలు, ఇమేజ్ లు , వీడియోలను యూజర్లు ఎక్కడ నుంచైనా ఎక్కడికైనా పంపే వీలుంది. లైవ్ ఛాటింగ్‌ వెసులుబాటుంది.
  • ఈ ప్లాట్‌ఫాంలో మొబైల్ నెంబర్‌ను వాడుతున్నందున మోసాలకు అవకాశం తక్కువగా ఉంది.ఇదీ నమ్మకమైన, సురక్షితమైన ఫ్లాట్‌ఫాం అని NoMyID చెప్పుకుంటోంది.

భార్యాభర్తల జట్టు రజులా సిక్కా, అమన్ సిక్కా ఈ NoMyID వ్యవస్థాపకులు. రజులా సీఈఓగా విధులు నిర్వహిస్తుంటే.. అమన్ ఈ స్టార్టప్‌కు సలహాదారుగా ఉన్నారు. లలితకళల్లో మాస్టర్స్ డిగ్రీతో పాటు వాణిజ్య ప్రకటనల విభాగంలో ప్రత్యేకత పొందిన రజులా.. తొలుత విద్యా, సృజనాత్మక కళల రంగంలో పదేళ్ల అనుభవం సంపాదించారు.అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అమన్ వృత్తి రీత్యా బ్యాంక్ ఉద్యోగి. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ఆయనకు ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆయన HDFC బ్యాంక్ లో డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యాపారం ఆయన పరిధిలోకి వస్తుంది.

అమన్ సిక్కా, రజులా సిక్కా
అమన్ సిక్కా, రజులా సిక్కా

“ కార్పొరేట్ సంస్థలు తమ సేవలకు సంబంధించి కస్టమర్లకు వివరణాత్మక సమాచారం పంపేందుకు ఈ యాప్ పనిచేస్తోంది. బ్యాంకులు, బీమా సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు లాంటి కార్పొరేట్ సంస్థల దగ్గర తమ కస్టమర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లుంటాయి. వారి ఈ-మెయిల్ ఐడీలు మాత్రం ఉండవు. ఈ యాప్‌ను వాడుకుంటూ మొబైల్ నెంబర్ ద్వారా ఎవరినైనా సంప్రదించే వీలుంది. ప్రస్తుతానికి వారు లేఖలు లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతున్నారు. ఇదీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఈ మొబైల్ యాప్ ద్వారా ఖర్చు తగ్గించుకుని.. పనులను వేగవంతం చేసుకోవచ్చు…. ” అని అమన్ చెబుతున్నారు.

స్వంత నిధులతో పాటు కొందరు ఇన్వెస్టర్లు ఉదారంగా అందించిన నిధులతో ఈ యాప్ నిర్వహణ సాధ్యమైంది. ఫేస్ బుక్ ప్రకటనలు, గూగుల్ యాడ్ వర్డ్స్, గూగుల్ యాడ్ మాబ్, ఇన్ మొబీ యాడ్స్.. ఇతర డిజిటల్ సౌకర్యాల ద్వారా వీరు తమ యాప్‌ను మార్కెటింగ్ చేస్తున్నారు. నెంబరు ఆధారిత మెయిల్ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లేని యూజర్లు, ఇంటర్నెట్ లేని ఫోన్లకు సేవలు అందించడం వీరికి పెద్ద సవాలుగా పరిణమించింది. ఇలాంటి ఫోన్ల విషయంలో పేరు నమోదు చేసుకుని కంప్యూటర్లో మెయిల్ చూసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు.

ప్రస్తుతానికి NoMyID తమ ఉత్పత్తిని వృద్ధి చేసే పనిలో ఉంది. భవిష్యత్తులో బీ2బీ తరహాలో పెద్ద సంస్థలకు సేవలు అందించి డబ్బు సంపాదించేందుకు వ్యూహరచన చేస్తోంది. ల్యాండ్ లైన్ నెంబర్లకు సైతం ఈ-మెయిల్ ఫ్లాట్ ఫాం అందించడం ఈ సంస్థ భవిష్యత్ ప్రణాళిక. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎవరూ ప్రవేశించని మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.

“భారత్‌లో 95 కోట్లు మంది మొబైల్ వినియోగదారులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 375 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వినియోగదారులను చేరడమే మా లక్ష్యం. ఈ-కామర్స్ రంగంలో ఉన్న వారికి కూడా ఇందులో ఆసక్తి ఉండొచ్చు…” అని అంటున్నారు అమన్…

పోటీ

వాట్స్ యాప్, వీ చాట్, హైక్ లాంటివి తక్షణ మెసేజింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. గూగుల్, యాహూ లాంటివి ఈ-మెయిల్స్ పంపుకునే అవకాశాన్నిస్తాయి. ఈ రెండు సేవలనూ కలిపి అందిస్తోందీ NoMyID.

NoMyIDని టెలిగ్రాంకు పోటీగా పరిగణించే వీలుంది. తక్షణ మెసేజ్ లతో పాటు 1.5జీబీ వరకూ ఉంటే పెద్ద అటాచ్‌మెంట్ లను కూడా ఇందులో పంపే అవకాశం ఉంది. తేడా ఏమిటంటే టెలిగ్రాం ఈ-మెయిల్ సేవలను అందించలేదు.

మాకు నచ్చిందేమిటి ?

మొబైల్ నెంబర్లకు అనుసంధానంగా ఈ-మెయిల్, ఈ-మెయిల్ ఐడీలను వాడటం ఆసక్తికర అంశం. దీన్ని అర్థం చేసుకోవడం,వాడటం సులభమే. వినియోగదారులు దీనిలో ఈ-మెయిల్స్ పంపడంతో బాటు ఇతర ఫ్లాట్‌ఫాంలతో లైవ్ చాట్ చేసుకోవచ్చు.

బ్యాంకుల లాంటి వాటికి దీనితో పని సులభమవుతుంది. ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఈడీల బదులు ఒక డేటా పాయింట్ ఫోన్ నెంబర్లు వాడితే సరిపోతుంది.ఎక్కువ మందితో కమ్యూనికేషన్ సులభం చేసేందుకు.. గ్రూపులను సృష్టించుకునేందుకు ఇదీ ఉపయుక్తంగా ఉంటుంది.

మెరుగు పరుచుకోవాల్సిందేమిటి ?

పూర్తి స్థాయిలో పనిచేసే యూఐ(user interface) బాగా మెరుగ్గా ఉండే యూఎక్స్ (user experience) ఈ యాప్ స్వంతం. అయినా కొంత మెరుగు పరుచుకునే అవకాశాలూ ఉన్నాయి. డ్యుయల్ సిమ్ ఫోన్ లో దీని వినియోగం పరీక్షించాలి. ఒక అప్లికేషన్‌లో బహుళ ఖాతాలు ఏర్పరచుకునే సమర్థతను సృష్టించుకోవాలి..

యువర్ స్టోరీ తీర్పు

ఈ యాప్ తన పనితీరులోనూ… అమలు పరిచే విధానంలోనూ ఆస్తకికరమైన, ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంది. కార్పొరేట్ల సంస్థ పనులు సులభతరం చేస్తుంది. వినియోగదారులను ఈ-మెయిల్ ద్వారా చేరుకోవడం పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే సాధ్యమవుతుంది. యూజర్లను నిరంతరం అనుసంధానించుకుంటూ విస్తరణకు ప్రయత్నించడమే ప్రస్తుతం NoMyID ముందున్న సవాలు..