పోటీపరీక్షల ప్రిపరేషన్‌ను ఆన్‌లైన్ బాటపట్టించి విద్యార్థులకు చేరువైన 'ఆకాశ్'

వేలాది మంది విద్యార్థులు,వందల సంఖ్యలో కేంద్రాలుఆకాశ్ పై ఆసక్తి చూపుతున్న టీచర్లుఐకనెక్ట్ ద్వారా ఐఐటి పాఠాలు నేర్చుకోడానికి విద్యార్థుల నుంచి మంచి స్పందనమారుమూల ప్రాంతాలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

పోటీపరీక్షల ప్రిపరేషన్‌ను ఆన్‌లైన్ బాటపట్టించి విద్యార్థులకు చేరువైన 'ఆకాశ్'

Thursday June 18, 2015,

3 min Read

1988 లో ప్రారంభమైన ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈరోజు భారతదేశమంతటా 100 కి పైగా కేంద్రాల నెట్ వర్క్ ఉంది. ఏటా దాదాపు 85 వేలమంది విద్యార్థులుండటమే కాదు, మొత్తం కోచింగ్ రంగంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడది పూర్తి స్థాయిలో కస్టమైజ్డ్ ఈ -లెర్నింగ్ ప్లాట్ ఫామ్ కల్పించే దిశలో ముందుకు సాగుతోంది. నిరుడు ఆవిష్కరించిన ఆకాశ్ ఐకనెక్ట్ ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన పాకేజీలు ఎంచుకునే విధంగా వైవిధ్యభరితమైన పాకేజీలు అందిస్తోంది. ఈ పోర్టల్ కు విద్యార్థులనుంచి, తల్లిదండ్రులనుంచి, టీచర్లనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

విద్యార్థులకైతే, ఐ కనెక్ట్ ద్వారా ఆకాశ్ వీడియో పాఠాలు, స్టడీ మెటీరియల్, ఆన్ లైన్ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. అది మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలనుకునే XI, XII తరగతుల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటుంది. అదే విధంగా స్కూలు/బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే VIII, IX, X తరగతులవారినీ లక్ష్యం చేసుకుంటూ వాళ్ళు రాసే NTSE, KVPY, JSTSE, ఒలంపియాడ్ లాంటి పోటీపరీక్షలకు సిద్ధం చేస్తుంది. విద్యార్థులకు నిపుణులచేత అనుమానాలు తీర్చటం, కోర్స్ మాప్, నోటిఫికేషన్లు లామ్టివాతి ద్వారా నేర్చుకునే అనుభూతిని పెంచటానికి ఈ పోర్టల్ లో అనేక ఫీచర్లున్నాయి. వీటితో పాటు త్వరలో చర్చా వేదికలు, కంటెంట్ మెరుగుదల, టాస్క్ మేనేజర్ లాంటి ఫీచర్లు కూడా చేరబోతున్నాయి. ఆకాశ్ సంస్థ బెంగళూరుకు చెందిన ట్రైబైట్ టెక్నాలజీస్ అనే క్లౌడ్ ఆధారిత ఇంటరాక్టివ్ లెర్నింగ్ సొల్యూషన్స్ సంస్థను టెక్నాలజీ భాగస్వామిగా చేర్చుకొని పనిచేస్తోంది.

ఈ లెర్నింగ్ కు వాడే ప్యాడ్

ఈ లెర్నింగ్ కు వాడే ప్యాడ్


విద్యార్థులు తమకు కావాల్సింది మాత్రమే కొనుక్కునే వెసులుబాటును కూడా ఆకాశ్ ఐ-కనెక్ట్ కల్పిస్తోంది. అంటే, పూర్తి కోర్సు కొనుక్కోవచ్చు, లేదా ఒక సబ్జెక్ట్ మాత్రమేగాని ఒక చాప్టర్ మాత్రమేగాని కొనుక్కోవచ్చు. చాప్టర్ల ఖరీదు రూ.99 నుంచి ఉండగా, పాకేజ్ ధర రూ.10,999 నుంచి మొదలవుతుంది. ఆకాశ్ కనెక్ట్ ఇకపై గూగుల్ ప్లే, యాప్ స్టోర్‌లోనూ ప్రారంభంకాబోతోంది. దీంతో విద్యార్థులు ఎక్కడున్నా నేర్చుకుంటూనే ఉండవచ్చు.

భారతదేశపు విద్యారంగంలో పరీక్షలకు సిద్ధం కావటమనేది ఒక ప్రత్యేకమైన విభాగంగా ఎదిగింది. అందుకే ఇప్పుడు అనేక స్టార్టప్ కంపెనీలు డిజిటల్ విప్లవం ఆధారంగా చేసుకొని అనేక సొల్యూషన్స్ రూపకల్పనలోనూ పరీక్షలకు సిద్ధం కావటం మీదనే దృష్టి సారిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటమే. 1999 లో కేవలం 1-2 లక్షలమంది విద్యార్థులు మాత్రమేIIT-JEE పరీక్ష రాయగా ఇప్పుడా సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. మిగిలిన పరీక్షలలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. అయితే, చాలామంది దీన్నొక వ్యాపార అవకాశంగా తీసుకున్నారు. అంతే తప్ప పిల్లల మనసులలో సరైన ధోరణిని నింపుతున్నామా లేదా అనేది పట్టించుకోలేదు.

ఆకాశ్ మాత్రం మొదటినుంచీ విద్యారంగంలో చురుగ్గా ఉంటూ 2008 లోనే డిజిటల్ బాట పట్టింది. మొదటిసారిగా బేసిక్ ఆన్ లైన్ అసెస్‌మెంట్ టూల్ ఒకటి తయారుచేసింది. ఆ తరువాత 2009 లో డివిడి ఆధారిత అధ్యయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే క్రమంలో విద్యార్థులు ఇంట్లోనే కూర్చొని ఆన్ లైన్‌లో పరీక్షించుకునే అవకాశం కల్పించింది. పైగా సమాధానాలమీద సవివరంగా విశ్లేషణ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షా వేదిక విజయవంతం కావటంతో ఆకాశ్ మరో అద్భుతమైన ఉత్పత్తిని ఆవిష్క్లరించింది. అదే.. ఆకాశ్ ఐ-ట్యూటర్. ప్రత్యేకంగా రూపొందించిన టాబ్లెట్‌లో అత్యుత్తమ స్థాయి పాఠాలు వినే అవకాశం అందులో ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఆఫ్‌ లైన్‌లోనూ పాఠాలు విని నేర్చుకోవచ్చు.

ఆకాశ్ ఐ-ట్యూటర్ విజయం సాధించాక మరింత ముందుకు సాగుతూ ఆకాశ్ ఐ కనెక్ట్ ఆవిష్కరించింది. ఇది చాలా అత్యాధునికమైన ప్రాడక్ట్. పరికరాల ఖరీదు లాంటి ఇబ్బందుల నుంచి విముక్తి పొందటానికి పనికొస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో ఉండటం కూడా దీని ప్రత్యేకత. ముందెన్నడూ కనీవినీ ఎరుగని అద్భుతమైన అనుభూతి పొందటానికి వీలుగా అనేక డిజిటల్ ఉత్పత్తులు త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ఆకాశ్ సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పుడు చిన్న చిన్న సంస్థలు సైతం పెద్ద మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఇది పరిశ్రమకు ఆరోగ్యకరమైన సంకేతం. స్టార్టప్‌లు వాళ్ళ అద్భుతమైన తెలివితేటలతో టెక్నాలజీని సద్వినియోగం చేస్తున్నారు. అయితే, ఇంకా సాధించాల్సింది చాలా మిగిలే ఉంది.

ఇలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల తరగతి గదిలో బోధన అనేది పూర్తిగా అంతరించి పోతుందని చెప్పలేం. పైగా దాని ప్రయోజనాలు దానికున్నాయి. కొన్ని దశాబ్దాలకాలంలో బోధనలో మార్పు తీసుకురావటంలో మాత్రం టెక్నాలజీ కీలకమైన పాత్ర పోషించింది. టెక్నాలజీకి అలవాటు పడకపోతే వెనకబడటం మాత్రం ఖాయం. వచ్చే ఐదేళ్లలో మారనిదల్లా కొత్త ఆవిష్కరణలపట్ల మన ఆకలి. విద్యార్థుల కలలు సాకారం కావాలన్న మన తపన. మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన విద్య అందాలన్నది తన లక్ష్యమంటున్నది ఆకాశ్. అర్హులైన విద్యార్థుల కలలకు అందుబాటు అనేది ఎప్పటికీ సమస్య కాకూడదని ఆకాశ్ భావిస్తోంది. అందుకోసం వెబ్, మొబైల్, టాబ్లెట్, వాయిస్ ..ఇలా టెక్నాలజీ ఏ రూపంలో ఉన్నా, వాడుకోవటానికి సిద్ధంగా ఉంది. ఈ పరిశ్రమలో పేరుమోసిన, అనుభవమున్న సంస్థగా దీని సేవలు, ఉత్పత్తులు మొత్తం పరిశ్రమనే సమూలంగా మార్చేస్తాయి.