2.5 లక్షల మంది కస్టమర్లతో రూ.25 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా సాగుతున్న క్యాష్ కరో

లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి కూపన్ వ్యాపారంలోకి..క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఆకట్టుకుంటున్న క్యాష్ కరోఅమెజాన్, జబాంగ్, మింత్రా వంటి సంస్థలతో ఒప్పందాలు

2.5 లక్షల మంది కస్టమర్లతో రూ.25 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా సాగుతున్న క్యాష్ కరో

Thursday April 02, 2015,

2 min Read

క్యాష్ కరో

image


గత రెండు సంవత్సరాలుగా ఆన్ లైన్ షాపింగ్, అనుబంధ, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లకు ఉన్న డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. వివిధ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం, రానున్న రెండేళ్ళ లో ఈ రంగం 500% పైగా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం క్యాష్ కరో కూపన్, ప్రైజ్ కాంపారిషన్, క్యాష్ బ్యాక్ వంటి అనుబంధ మార్కెటింగ్ ఫార్మాట్లలో ఉంది. భారతీయ అనుబంధ మార్కెటింగ్ కూపన్ దునియా , పెన్నిఫుల్, అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ క్యాష్ కరో ద్వారా ప్రభావితమైంది. ఈ రంగంలో గత ఆరు నెలల్లో భార్య భర్తలు అయిన స్వాతి, రోహన్ భార్గవ టీం రూ . 25 కోట్లు అమ్మకాలతో రికార్డు సృష్టించారు.

"మేము రోజుకు 1,000 లావాదేవీలు చేస్తుంటాం " అని క్యాష్ కరో సహ వ్యవస్థాపకురాలు స్వాతి ఎంతో ఉత్సాహంగా చెబ్తారు. 500 ఇతర ఇ-కామర్స్ వేదికలైన మిత్ర , జబొంగ్ , ఎబి, అమెజాన్, యాత్ర షాపింగ్ లో వంటి వాటిల్లో క్యాష్ కరో ద్వారా షాపింగ్ చేసి వినియోగదారులు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెంచాల్సి వచ్చింది. ఆ సంఖ్యా 12 నుంచి 32 కు చేరింది. ప్రతి రొజూ సుమారు 1000 లావాదేవిలకు మేము డబ్బులు చెల్లిస్తునాం. భారతదేశం లో మా సభ్యులకు రూ. కోటి వరకూ క్యాష్ బ్యాక్ చెల్లిస్తునాం అని స్వాతి అన్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో 150 వ్యాపారులతో ప్రారంభించిన క్యాష్ కరో ఇప్పుడు 500 మంది ఆన్ బోర్డ్ అమ్మకపుదార్లతో నిండుగా ఉంది. ఇక తమ దగ్గర రిజిస్టర్ అయిన కస్టమర్ల సంఖ్య అయితే ఏకంగా 40 వేల నుంచి 2.5 లక్షలకు పెరిగింది. ఇది సుమారు ఆరు రెట్ల వృద్ధి. కంపెనీ విస్తరణలో భాగంగా జూలై 2013 లో లండన్ కు చెందిన ఏంజెల్ పెట్టుబడిదారుల నుండి $ 750,000 సమీకరించాం.

భారత దేశంలో క్యాష్ కరో లాంచ్ చేయడానికి ముందు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో వీళ్లిద్దరూ చదువుకున్నారు. ఆ సమయంలో బ్రిటన్ లో 'పౌరింగ్ పౌండ్స్' ఈ తరహా వ్యాపారం ప్రారంభించాం. అతి తక్కువ సమయంలోనే ఈ సంస్థ అక్కడి మా భాగస్వాములకు రూ.125 కోట్లు తెచ్చిపెట్టింది. కూపన్ ఆధారిత బిజినెస్ మోడళ్లపై ఎంతో మంది చర్చోపచర్చలు చేస్తారు. ఈ వ్యాపారం మనుగడపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతారు. కానీ మెరుగైన వేల్యూ కూడా భారత దేశ ప్రజలు ఎదురుచూస్తున్నంత కాలం తమ వ్యాపారానికి ఢోకా లేదనేది ఈ జంట మాట. పెయిడ్ మార్కెటింగ్ పై ప్రధానంగా దృష్టి సారిస్తూనే మేము మా 2.5 లక్షల మంది కస్టమర్లకు నిత్యం సామాజిక అనుసంధాన సైట్ల ద్వారా ఆఫర్ల గురించి తెలియజేస్తూనే ఉంటాం. అంతా బాగానే ఉన్నా మరి లాభదాయకత మాటేంటి అని ప్రశ్నించినప్పుడు కూడా వీళ్ల దగ్గర సమాధానం ఉంది. ప్రస్తుతం లాభనష్టరహిత స్థితి(బ్రేక్ ఈవెన్)కి రాకపోయినప్పటికీ త్వరలోనే చేరుకుంటామని ధీమాగా ఉన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలోగా మెల్లిగా తాము ఆర్థికంగా బలపడ్తామని చెబ్తున్నారు.