18 ఏళ్లకే ఇతని బుర్రలో మెరిసిన పేపర్ బోయ్ యాప్ ఐడియా సూపర్

18 ఏళ్లకే ఇతని బుర్రలో మెరిసిన పేపర్ బోయ్ యాప్ ఐడియా సూపర్

Wednesday August 30, 2017,

1 min Read

రాజకీయ వార్తలు చదవాలంటే ఒక పేపర్. బిజినెస్ న్యూస్ కావాలంటే ఇంకో పేపర్. సినిమా సంగతులు తెలియాలంటే మరో మేగజైన్. ఫ్యాషన్ కోసం ఒకటి.. ఇంటీరియర్ కోసం మరొకటి. ఇలా ఎన్ని పేపర్లని కొనాలి. ఎన్ని మేగజైన్లని తెప్పించుకోవాలి. అన్నీ అరచేతిలో ఇమిడిపోతే ఎలా వుంటుంది. ఈ ఐడియా ఏదో బావుంది. డిజిటల్ మీడియాకాలంలో కూడా అన్నేసి పేపర్లు, మేగజైన్లు కొనడమేంటి? అప్ డేట్ అవ్వాలి. ఆ దిశగా ఆవిష్కరణలు జరగాలి.

image


ఐడియాలన్నీ ఏ కంప్యూటర్ లాబొరేటరీల్లోనో జరుగుతాయనుకుంటే పొరపాటే. కొన్ని కొన్ని ఇన్నోవేషన్స్ ఏ మాస్టర్ డిగ్రీ లేకున్నా బుర్రలో మెరుస్తాయి. అలాంటి కథే ఇదే. వెంకట కార్తీక్ రాజా అని 18 ఏళ్ల కుర్రాడు. బెంగళూరుకు చెందిన కార్తీక్ రాజాకు వచ్చిన ఆలోచన నిజంగా అరచేతిలో అద్భుతాన్నే సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంటా 400 దిన, వార పత్రికలను కళ్లముందుంచింది. ఒకే ఒక మొబైల్ యాప్ వందలాది న్యూస్ పేపర్లను దినపత్రికలను ఏకతాటిపైకి తెచ్చింది. అది కూడా రియల్ టైంలో చదువుకునేలా చేసింది.

పేపర్ బోయ్ మొబైల్ యాప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన స్కూల్ డేస్ లోనే వచ్చింది. అతని ఆలోచనకు తల్లిదండ్రులు పూర్తి మద్దతుగా నిలిచారు. ఇద్దరు టీం సభ్యులతో ప్రయాణం మొదలైన కార్తీక్ రాజా ప్రయాణం నేడు యాభై మందికి చేరింది. ముందుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై ఫోకస్ చేశాడు. ఎందుకంటే దేశంలోని జనాభాలో 31.16 శాతం టైర్ -2 టైర్ -3 సిటీల్లోనే ఉంటారు కాబట్టి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ దినపత్రికలు సహా అనేక మేగజైన్లకు ఒక ప్లాట్ ఫాం క్రియేట్ చేశాడు.

డిజిటల్ విప్లవం స్ఫూర్తితో పేపర్ బోయ్ యాప్ ని విశ్వవ్యాప్తం చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఐఓస్, యాండ్రాయిడ్ వెర్షన్ లో అందుబాటులో వుంది. వెబ్ మోడల్ కూడా చూడొచ్చు. ఎలాంటి పత్రిక అయినా మేగజైన్ అయినా మొబైల్లో క్షణాల్లో చూసుకోవచ్చు.