అట్టహాసంగా ప్రారంభమైన 'టి హబ్'

0

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మించిన స్టార్టప్ ఇంక్యుబేటర్ 'టి హబ్'ను టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. 'క్యాటలిస్ట్' పేరుతో సిద్ధమైన ఈ మొదటి దశ నిర్మాణం గచ్చిబౌలీలోని ట్రిపుల్ ఐటిలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందింది. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్‌ ఈ టి హబ్‌ కోసం రూ.40 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. మొదట 140 స్టార్టప్స్‌కు ఇందులో అవకాశం కల్పించనున్నారు. వాళ్లకు ఆరు నెలల సమయాన్ని కేటాయిస్తారు. అవసరం అనుకుంటే మరికొంత గడువును కూడా ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ ప్రారంభమైన సంస్థలు బయటకు వెళ్లి తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటే.. మళ్లీ కొత్త వారికి అవకాశమిస్తారు.

టి-హబ్‌ రెండోదశను రూ. 150 కోట్ల రూపాయలతో 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Image courtesy - Minister of IT, Telangana