యూత్ నయా ట్రెండ్‌.. స్టార్టప్ వీకెండ్!

0

స్టార్టప్ లో రాణించాలంటే అర్హతలేం అవసరం లేదు. అన్నింటి కంటే ముందు ఐడియా ఉండాలి. ఐడియాను ఎగ్జిక్యూట్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. వీటన్నింటితో పాటు లీడర్‌షిప్ క్వాలిటీ ఉండాలి. పుట్టుకతోనే ఎవరూ నాయకుడు కాడు. నాయకత్వ లక్షణాలు అనేవి ఏరోజుకారోజు వంటబట్టించుకునేవి. స్టార్టప్ ఫౌండర్లకు కనీసం తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఐడియాల్ని సానబట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు వెలిశాయి. హైదరాబాద్ లో కూడా అలాంటి సంస్థలు చలా ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది స్టార్టప్ వీకెండ్.

“స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం హైదరాబాద్ స్టార్టప్ ఈకో సిస్టమ్ లో భాగమే.” రమేష్ లోకనాథన్

రమేష్ లోక్ నాథన్ స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం ఆర్గనైజింగ్ కోర్ టీంలో ఒకరు. కొత్తగా స్టార్టప్ ప్రారంభించిన ఫౌండర్లకు తగిన ట్రైనింగ్ ఇవ్వడం సంస్థ ముఖ్య ఉద్దేశం.

వీకెండ్ ఈవెంట్స్

అన్ని స్టార్టప్ వీకెండ్ ఈవెంట్స్ ఒకేలా సాగుతాయి. ఎవరైనా స్టార్టప్ ఐడియా ను తీసుకొస్తే ఇతర స్టార్టప్ లీడర్స్ తో దానిపై ఫీడ్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది. పాపులర్ ఓట్ ద్వారా టీం లు ఏర్పడతాయి. దాదాపు 54 గంటల్లో బిజినెస్ మోడల్ ని తయారు చేస్తారు. కోడింగ్ దగ్గర నుంచి డిజైనింగ్, మార్కెట్ వేల్యూషన్ లాంటివి ఇందులో చర్చకు వస్తాయి. ఈ బిజినెస్ ని స్థానిక ఆంట్రపెన్యువర్ల దగ్గర ప్రజెంట్ చేస్తారు. వారి ఫీడ్‌ బ్యాక్ తో వ్యాపారావకాశాలను మరింత మెరుగు పరుచుకునే అవకాశం వస్తుంది. ఒక వీకెండ్ ఈ ఈవెంట్ లో పాల్గొంటే మన ఐడియాతో సొంత స్టార్టప్ ను ప్రారంభించేయొచ్చన్న మాట.

సక్సస్ స్టోరీస్

స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాంలో సక్సస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అందులో స్కూల్ మానిటర్ ఒకటి. పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులను చేయడం ద్వారా ఎడ్యుకేషన్‌ మెరుగు పరచడం దీని ప్రధానలక్ష్యం. ఇందులో భాగంగా స్కూల్ కమ్యూనిటీకి సంబంధించిన డేటాను సేకరించడం ఇందులో మొదటి ఫ్రేజ్. ఈ డేటాలో చిన్నారుల ఇష్టాయిష్టాలు, వారి సామర్థ్యం, బోధన ఎలా వుందనే విషయం, చెప్పే పద్దతి(స్టైల్), స్కూల్ వాతావరణ పరిస్థితి, అక్కడుండే భద్రత లాంటివాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఈ డేటాను సేకరిస్తారు. మానసిక అవగాహన పద్దతి(psychometric instruments) ద్వారా దీన్ని లెక్కిస్తారు.

“స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం మా స్టార్టప్ ప్రమోషన్ కు ఎంతగానో ఉపయోగపడింది.” కో ఫౌండర్ నవీన్

ఇది నవీన్ సక్సెస్ స్టోరీ. నవీన్ లాగా చాలా మంది ఫౌండర్లు, కో ఫౌండర్లకు దశ దిశను చూపించింది స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం.

కో-ఫౌండర్ వెతికి పెట్టే బాధ్యత

స్టార్టప్ ఐడియాతో వీకెండ్ ప్రొగ్రాంలో పాల్గొంటే సరిపోతుంది. దానికి కావల్సిన అన్ని రకాల సేవలను అందిస్తారు. ప్రధానంగా స్టార్టప్ ఐడియతో కంపెనీ మొదలు పెట్టిన వ్యక్తి సహ వ్యవస్థాపకుడి కోసం ఎదురు చూడటం తెలిసిన విషయమే. తన ఐడియాలను అర్థం చేసుకుని తనతో కలసి పనిచేసే వ్యక్తి దొరికితేనే స్టార్టప్ సక్సెస్‌ ఫుల్ అవుతుంది. ఈ ప్రొగ్రాంలో కలసిన వ్యక్తులు కొందరు ఫౌండర్లు, మరి కొందరు కో ఫౌండర్లుగా మారుతారు. ఈ మీటప్ హైదరాబాద్ స్టార్టప్ సర్కిల్ లో మోస్ట్ హాపెనింగ్ ఈవెంట్ గా కొనసాగుతోంది.

“సాధారణంగా వీకెండ్ అంటే సరదాగా గడపడానికి కేటాయిస్తుంటారు. కానీ ఔత్సాహికులైన ఎంతో మంది ఆ సమయాన్ని స్టార్టప్ వీకెండ్ కార్యక్రమం కోసం వినియోగిస్తున్నారు.” రవి కోరుకొండ

రవి కోరుకొండ స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం కి అసోసియేట్ గా ఉన్నారు. టీం లో కలిసి పనిచేసే తత్వాన్ని స్టార్టప్ వీకెండ్ నేర్పుతుంది. స్టార్టప్ కల్చర్, భవిష్యత్ కు ఇలాంటి ప్రొగ్రాంలు ఎంతో అవసరం అని రవి ముగించారు.

భవిష్యత్ ప్రణాలికలు

స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం ప్రారంభమైన ఉద్దేశంతోనే ఇప్పటి వరకూ కొనసాగుతోంది. ఎప్పటి కప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారాలనుకున్న ఆంట్రపెన్యువర్లకు సూచనలు సలహాలు ఇవ్వడం దీని లక్ష్యం. ఆఫ్ లైన్ లో సేవలందిస్తోన్న స్టార్టప్ వీకెండ్ ప్రొగ్రాం ఆన్ లైన్ లో కూడా సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తున్నారు. కాలేజీల్లో ఈవెంట్లు నిర్వహించి స్టార్టప్ ఈకో సిస్టమ్ కు తన దైన సేవలందించాలని చూస్తున్నారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik