MNC వదిలి చిన్నకంపెనీకే మొగ్గు..!

పెద్ద చదువు పూర్తి చేసుకున్నవారెవరైనా కార్పొరేట్ కంపెనీల్లో చేరి వెంటనే లక్షలు సంపాదించాలని కలలు కంటారు. కానీ వారికి భిన్నంగా జోయెల్ ఫెర్నాండెజ్ మాత్రం చిన్న కంపెనీకే పరిమితమయ్యాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అద్భుతాలు సాధిస్తున్నాడు.

MNC వదిలి చిన్నకంపెనీకే మొగ్గు..!

Monday May 11, 2015,

3 min Read

ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడంలేదు. ఎంతసేపూ కంప్యూటర్లు, ట్యాబ్లెట్లతోనే జీవితం గడిసిపోతోంది. అలాంటివారికోసం తెరపైకి వచ్చింది జూజో.బి (Zoojoo.be). ఆరోగ్యకరమైన సూత్రాలను, అలవాట్లను ఇది అందరికీ పంచుతోంది. ఉద్యోగులను ఎంకరేజ్ చేయడం, వారికి అవసరమైన ఆరోగ్య సూత్రాలను వెల్లడించడం దీని ప్రధాన ఉద్దేశం. గంటల తరబడి పని చేస్తున్న చోటే వారి సహోద్యోగులతో ఇలాంటి ఆరోగ్య సూత్రాలను చర్చించుకోవడం ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం కలుగుతుంది. “నాకు తెలిసి ఏ ఒక్కరూ మరొకరు చేసినట్లు చేయరు” అంటారు జోయెల్ ఫెర్నాండెజ్. ఆయనే ఈ వారం మన విశిష్ఠ స్టార్టప్ ఉద్యోగి.

image


వాస్తవానికి జోయెల్ జూజో.బి (Zoojoo.be) లో ఇంటర్న్‌షిప్ కోసం జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అదే సంస్థలో ఉద్యోగిగా మారారు. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన వారికి కార్పొరేట్ కంపెనీలు కాకుండా ఇలాంటి చిన్న కంపెనీలు మంచి అవకాశాలిస్తున్నాయా.. అంటే అవునంటున్నారు జూజో.బి (Zoojoo.be) వ్యవస్థాపకులు అవినాశ్ సౌరభ్. ఇంటర్న్‌షిప్ కోసం తీసుకుని.. వారికే తర్వాత తాను ఉద్యోగాలిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. “కాలేజ్ నుంచి నేరుగా తీసుకునేవాళ్ల నుంచి నాకు ఇంతవరకూ ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. అది చాలా శుభపరిణామం”. అనేది అవినాశ్ మాట. “ ఫ్రెషర్స్‌కు ఇలాంటి స్టార్టప్ కంపెనీలు ఫస్ట్ ఛాయిస్ అవుతాయని నేను ఎప్పుడూ భావించను. కానీ ఇలాంటి స్టార్టప్ కంపెనీల్లో పనిచేసేందుకు ఎంతోమంది యువతీయువకులు ఉత్సాహంగా ఉన్నారు. అది చాలా మంచి విషయం” అంటున్నారు అవినాశ్.


“ బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకో.. తప్పకుండా ఎమ్మెన్సీ కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది.” అని జోయెల్ కూడా మా లాగా ఎంతోమంది నుంచి సలహా పొందినవాడే. ప్రారంభంలో అతనికి ఇది మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఆ తర్వాత ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం పొందడం పెద్ద కష్టమేం కాదని గ్రహించాడు. “ నేను చదువుకునే రోజుల్లో పారిశ్రామికవేత్త అనే పదం బాగా ఆకర్షించింది. అలా కొత్తవారికి అవకాశాలు కల్పించాలని చాలా ఎదురుచూశాను.” అంటున్నారు జోయెల్. జూజో.బి (Zoojoo.be) లో ఆండ్రాయిడ్ పై పనిచేసే జోయెల్ ప్రథమ కర్తవ్యం మొబైల్ లో వెబ్ సైట్ అభివృద్ధికి కృషి చేయడం..


ఉద్యోగిగా జీవితం..

సంస్థలో ఫ్రెషర్‌గా జాయిన్ అయినప్పుడు జోయెల్ కేమీ అనుభవం లేదు. అందరిలో తానూ ఒకడు.. అంతే అంటున్నారు అవినాష్. అయితే అతనికి త్వరగా గ్రహించే సామర్థ్యం ఉంది. “ కేవలం ఒక నెలలోనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫస్ట్ వర్షన్‌ను విడుదల చేయడంలో అతను సాయపడ్డాడు. అప్పటి నుంచి ఐఫోన్ ఆప్ రెడీ చేసే వరకూ టీమ్‌ను నడిపించాడు.” అనేది అవినాశ్ మాట. కేవలం టెక్నికల్ సామర్థ్యం మాత్రమే కాకుండా బిజినెస్ ప్రాబ్లమ్స్ ను అర్థం చేసుకోవడం.. వాటిని అధిగమించడానికి మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిష్కారాలు చూపడం జోయెల్ కున్న అదనపు క్వాలిటీ. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది.


బెంగళూరులోని సెయింట్ జేసెఫ్ సంస్థలో చదువుకున్నాడు జోయెల్. డిగ్రీ చదువుతున్నప్పుడే ఆండ్రాయిడ్ ఆధారిత ప్రాజెక్టులో పనిచేసే అవకాశం వచ్చింది. అలా మొబైల్ అప్లికేషన్సో తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పీజీ ఫైనల్ సెమిస్టర్ లో ప్రాజెక్టులో భాగంగో ఓ సంస్థలో పనిచేసే అవకాశం లభించింది. అదే జూజో.బి(Zoojoo.be). అలా జూజో.బి(Zoojoo.be)లో ఆర్నెల్ల కాలానికి జాయిన్ అయ్యాడు జోయెల్.


అతనికి పై చదువులు చదువుకోవాలని ఉన్నా.. ఇంటర్న్ షిప్ అయిపోగానే అవినాశ్ ఇచ్చిన ఉద్యోగావకాశాన్ని వినియోగించుకున్నాడు. “నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి.. దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. అని మాత్రమే నేను ఆలోచించాను” అంటున్నాడు జోయెల్.


తొలి మజిలీ

“ ఓ చిన్న కంపెనీలో పనిచేసే అవకాశం రావడం ద్వారా నేర్చుకోవడంతో పాటు అనుభవం వస్తుంది” అంటున్నాడు జోయెల్. అంతేకాదు.. ఎవరైనా నేర్చుకోవాలనుకునే ఉత్సాహవంతులకు ఇలాంటి స్టార్టప్ కంపెనీలలో జాయిన్ అవ్వాలని సూచిస్తున్నాడు.


ఇటీవేలే జూజో.బి (Zoojoo.be)లో ఏడాది కాలం పూర్తి చేసుకున్నాడు జోయెల్. కంపెనీకోసం నిత్యం శ్రమించాడు. “నువ్వు టీమ్ లో జూనియర్ అయినా.. నువ్విచ్చే సలహాలు, ఫీడ్ బ్యాక్, ఉపాయాలు బాగుంటే ఎవరైనా అభినందిస్తారు. నిర్ణయం తీసుకోవడంలో ప్రతి వ్యక్తి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఏ కంపెనీకైనా చాలా ముఖ్యం”.

image


తన టీం కోసం జోయెల్ ఏం చెప్తున్నాడంటే.. “మీకు మీరే సాటి. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, వారిలో ఆరోగ్యకర అలవాట్లను పెంపొందించడానికి ఇదొక అద్భుతమైన సాధనం. దీన్ని కొనసాగించండి. అందరికీ ఆరోగ్యం అనే సూత్రాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లండి.”


వారాంతాల్లో జోయెల్ తన స్నేహితులు లేదా టీమ్ తో కెనాన్ 500D కెమెరాతో ఫోటోలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తాడు. లేదా ఇంటిదగ్గరే కూర్చుని హ్యాకర్ న్యూస్, క్యూరో, ఇంగ్లీష్ ఛానళ్లు లేదా కిండిల్ లో పుస్తకాలు చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తారు...

Website: http://www.zoojoo.be/