వైఫై కంటే వంద రెట్ల వేగంతో పనిచేసే 'లైఫై'ని తీర్చిదిద్దుతున్న స్టార్టప్ ఈ వెల్మని

టెక్నాలజీ రంగంలో దూసుకొస్తోన్న భారతీయ స్టార్టప్డేటా ప్రసారమాధ్యమం కాంతితోనే సాధ్యంభవిష్యత్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా విషయంలో కచ్చితమైన సెక్యూరిటీలైఫై లో జపాన్,యూరప్,అమెరికా తర్వాతి స్థానం ఇండియాదే

వైఫై కంటే వంద రెట్ల వేగంతో పనిచేసే 'లైఫై'ని తీర్చిదిద్దుతున్న స్టార్టప్ ఈ వెల్మని

Tuesday May 26, 2015,

3 min Read

వైఫై స్పీడ్ పెరగాలంటే.. యూజర్ల సంఖ్యను తగ్గించాలి. అలా కాకుండా యూజర్ల సంఖ్యను రెట్టింపు చేసి.. స్పీడ్ పెంచడానికి అవకాశం లేదా? ఈప్రశ్నకు జవాబే లైఫై. ఇదే టెక్నాలజీ ఇప్పటికే జపాన్, యూరప్,అమెరికాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. భారత్ నుంచి ఒకే ఒక వెల్మని కంపెనీ దీనిపై ప్రయోగాలు చేస్తోంది. ఆ కంపెనీ కథే ఇది. 

వెల్మని స్టార్టప్ 2014లో దీపక్ సోలంకి, సౌరభ్ గార్గ్ ప్రారంభించారు. మొదట్లో కొన్ని చిన్న చిన్న పరికరాల తయారీతో మొదలైన వెల్మని ప్రయాణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ట్రాఫిక్ లైట్ డౌన్ కౌంటర్స్, వెహికల్ ట్రాకింగ్ సిస్టం లాంటివి వెల్మని మొదటి రోజుల్లో చేసిన వాటిల్లో కొన్ని . ఈస్టోనియా లోని డెల్ హ్యాండ్ కేంద్రంగా ప్రారంభమైన ఈ కంపెనీ అత్యుత్తమ హార్డ్ వేర్ టెక్నాలజీ కలిగిన స్టార్టప్. వైర్లెస్ టెక్నాలజీతో హైస్సీడ్ (1జిబిపిఎస్) డేటా ట్రాన్స్‌ఫర్‌కు వాడే యంత్రాలను తయారు చేస్తోంది. సాధారణ కాంతితో పనిచేయడం ఇందులో ఉండే గొప్పవిషయం.

వెల్మెన్ సాయంతో నడుస్తున్న ఢిల్లి ట్రాఫిక్ సిగ్నల్

వెల్మెన్ సాయంతో నడుస్తున్న ఢిల్లి ట్రాఫిక్ సిగ్నల్


“మేం లైఫై(Li-Fi ) డెమోలను తయారు చేశాం. దీంతో డేటాను ల్యాప్ టాప్ స్క్రీన్ పైనుంచి హార్డ్‌వేర్ డివైస్‌లోనికి పంపిచొచ్చు. ఆ తర్వాత మేం ఒక ఎల్ఇడి బల్బ్ తయారు చేశాం. దీన్ని స్మార్ట్ ఫోన్‌తో ఆపరేట్ చేయొచ్చు. లైట్ ఇంటెన్సిటీతోపాటు రంగులను ఫోన్‌తో మార్చుకోవచ్చు. జుగ్నూగా దీనికి నామకరణం చేశాం” అని దీపక్ చెప్పుకొచ్చారు.

2014లో దీపక్, సౌరబ్ లకు ఈస్టోనియన్ హార్డ్వేర్ యాక్సిలరేటర్ బిల్డిట్ నుంచి ఇంక్యుబేషన్ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత టల్లిన్, ఈస్టోనియాల్లో వీరు టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఢిల్లీ తిరిగి వచ్చేసారు. ఇక్కడ డెవలప్‌మెంట్‌ టీంను సెట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రాడక్ట్‌ను మాత్రం మొదటగా యూరప్‌లో మార్కెట్ చేసే ఆలోచనలో ఉన్నారు. లైఫై టెక్నాలజీ తయారు చేయడానికి ముందు వెల్మని ఢిల్లీలోని ఎల్ఈడి ట్రాఫిక్ సిగ్నల్‌కి సంబంధించిన సమస్యని పరిష్కరించారు. “రేండేళ్ల నుంచి సగానికి పైగా ట్రాఫిక్ లైట్లు సరిగ్గా పనిచేయకుండా తలనొప్పులు తీసుకొచ్చేవి. దీనిపై మాకు అవకాశం వచ్చింది. హార్డ్‌వేర్‌ని రీ డిజైన్ చేశాం. దీనికి సరిపడ సాఫ్ట్‌వేర్‌ని కూడా మరోసారి రాయాల్సి వచ్చింది. ఇప్పుడివి చక్కగా పనిచేస్తున్నాయి,” అని దీపక్ అన్నారు

ఫౌండర్లు దీపక్, సౌరభ్

ఫౌండర్లు దీపక్, సౌరభ్


దీపక్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో రోబోటిక్స్ రీసెర్చ్ లేబొరోటరీపై పనిచేశారు. తర్వాత IEEEలో పేపర్ పబ్లిష్ చేశారు. సౌరభ్ ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, అల్గోరిథమ్‌పై ఈయనకు మంచి పట్టుంది.

లైఫై టెక్నాలజీ

లైఫై అనేది ఎంతో సంక్లిష్టమైన టెక్నాలజీ. దీనిపై యూరప్, జపాన్, అమెరికాల్లోని కొన్ని రీసెర్చ్ ల్యాబ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ టెక్నాలజీ డెమోలపై పనిచేస్తోన్న భారతీయ స్టార్టప్ కంపెనీ తమదే అని గర్వంగా చెబుతున్నారు దీపక్. అత్యంత వేగం, సంక్లిష్టమైన నమూనా కూడిన ఎల్ఈడిలను కంపెనీ తాయరు చేస్తుంది. రిసీవర్ అనేది ఈ సంక్లిష్ట మసకతో కూడిన నమూనాను గ్రహించి డేటాను డీకోడ్ చేస్తుందన్నారాయన. అయితే ఈ సిస్టమ్‌లో లైట్ పై ఎలాంటి ప్రభావం పడదు. రిసీవర్లు లైట్ తాలూకూ మసక నమూనాని మాత్రమే స్వీకరిస్తాయి. ఈ పద్దతిలో యూజర్లు హెచ్ డి వీడియోలు, సినిమా, ఆడియోలను పంపించుకొనే వీలుంది. భవిష్యత్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ ను వాడుకొనే వెసులుబాటు కలగనుంది.

ప్రస్తుతం, భవిష్యత్ మైలురాళ్లు

ప్రస్తుతం వెల్మని విఎల్సి(VLC) లింకులను 1mbps స్పీడ్ తో బ్రాడ్ కాస్ట్ చేస్తోంది. 20మీటర్ల వరకూ డేటాను పంపుతుంది. ప్లాన్ మారే కొద్దీ డేటా ట్రాన్స్‌ఫర్ల వేగం పెరుగుతుంది. దీంతో పాటు లైఫై టెక్నాలజీతో ఏవియేషన్‌కు సంబంధించిన అప్లికేషన్‌పై వెల్మెని పనిచేస్తోంది.

“చిన్న ఎయిర్ క్రాఫ్ట్‌ల కోసం ఇన్ ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్ తయారీలో ఉన్నాం. సీట్లకు స్క్రీన్ లేని విమానాలకు ఇది చక్కగా పనికొస్తుంది. స్మార్ట్ ఫోన్/ల్యాప్ ట్యాప్‌ను అనుసంధానం చేసే డివైజ్ ను తయారు చేశాం. ఇది లైట్ ద్వార డేటాను రిసీవ్ చేసుకుంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉండే లైట్ ద్వారా సినిమాలు/వీడియోలు/న్యూస్ ఫీడ్‌ను పంపించుకోవచ్చు. ఇది పాసింజర్ల ఫోన్లు లేదా ల్యాప్ ట్యాప్‌లకు అందుతుంది.” అని దీపక్ వివరించారు.

ప్రస్తుతానికి మనం వైఫై టెక్నాలజీ ద్వారా ఎన్నో రాకాలైన ప్రయోజనాలను పొందుతున్నాం. వైఫై బ్లూటూత్ పాయింట్లు రోజురోజుకీ పెరిగిపోతూ వస్తున్నాయి. మరో ఐదేళ్లలో మొత్తం సిస్టమ్ నిండిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రద్దీ పెరిగిన కారణంగా మనం వైఫైని యాక్సస్ చేయలేకపోవచ్చు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేయడానికి కావల్సిన టెక్నాలజీ పైనే మేం ఇప్పుడు పనిచేస్తున్నాం. వైఫై అనేది తాత్కాలికమే. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైఫై నెమ్మదించడమనే పరిస్థితులు ఇప్పుడు కూడా ఎదురవుతునే ఉన్నాయి. ఇలాంటప్పుడు లైఫై అనేది చక్కగా పనిచేస్తుంది . విమానయానం, ఆసుపత్రులు, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాల్లో వైఫై వాడకం నిషేదం. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో వాడగలిగేది లైఫై. వైఫైకి వందరెట్ల స్పీడ్ తో లైఫై పనిచేస్తుంది. అంటే హెచ్ డీ వీడియోను ఒక నిముషంలో డౌన్ లోడ్ చేయొచ్చన్నమాట. ఇలాంటి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను వివరించే ప్రయత్నం చేశారు దీపక్.

ప్యూర్ లైఫ్(యూరప్), ఎల్విఎక్స్ సిస్టమ్(యూఎస్), నకగవ ల్యాబ్స్(జపాన్) లాంటి కంపెనీలతో ప్రధానంగా వెల్మెనికి పోటీ ఉంది. బిగ్గర్ ఎల్ఈడి లైట్ లపై లైసెన్స్ ఉన్న కారణంగా ఆధాయానికైతే ఎలాంటి ఢోకా లేదు. విఎల్సి తో వచ్చే సమస్యలపై పరిష్కారం చూపే అప్లికేషన్ పై కంపెనీ పనిచేస్తోంది.