హైదరాబాద్‌లో మొదలైన న్యూ ఇయర్ హంగామా

0

హైదరాబాద్ లో పార్టీ యానిమల్స్ చాలా ఎక్కువ. చిన్న చితక పార్టీలను విడిచి పెడితే న్యూఇయర్ రోజు ఓ మోస్తరుగా జరిగే పార్టీలు దాదాపు 150 దాకా ఉంటాయి. ఆ ఒక్క రోజు ఈవెంట్ కోసం మిలియన్ డాలర్ల ట్రాన్సాక్షన్‌ జరుగుతుంది. లిక్కర్ , బొకేలు, కేకులు, కలర్స్, క్రాకర్స్‌, డిజే సౌండ్స్ ఇలా.. నగరమంతా మరో లోకంలోకి వెళ్లిపోతుంది.

“పదేళ్లుగా న్యూ ఇయర్ వేడలను నిర్వహిస్తున్నాం. ఆసియాలో అతిపెద్ద న్యూఇయర్ బాష్ కు మేం వేదిక కాబోతున్నాం,” కంట్రీ క్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి

హైదరాబాద్ లో సన్నాహాలు మొదలు పెట్టిన కంట్రీ క్లబ్ దాదాపు పదివేల మంది క్రౌడ్ తో పార్టీ చేపట్టాలని చూస్తున్నారు.

పార్టీల్లో 10లక్షల మంది

హైదారబాద్ లో జరిగే న్యూ ఇయర్ ఈవెంట్స్ కి దాదాపు ఒక మిలియన్ మంది జనం పాల్గొంటారని అంచనా. ఎమ్మెన్సీ తోపాటు ఐటి క్రౌడ్ ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. వీరితో పాటు విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఇలా చాల మంది న్యూ ఇయర్ పార్టీలో పాల్గొడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య తో పోలిస్తే పదిలక్షలు తక్కువగా కనిపించినా హైదరాబాద్ జనాభాలో పదో వంతు ఇది. దీనికోసం ఇప్పటికే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, క్లబ్ హౌస్ లు, స్టార్ హోటల్స్ ఇలా అన్నీ సన్నహాలను మొదలు పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పార్టీ మాది, ఎంజాయ్ మీది అంటూ ప్రకటనలను గుప్పిస్తున్నాయి.

గణనీయంగా లిక్కర్ సేల్

న్యూ ఇయర్ పార్టీల్లో లిక్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క రాత్రికే కోట్లలో మందు అమ్ముడవుతుందని అంచానా. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కంపెనీలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. గతేడాది కంటే ఈసారి ఐదుశాతం అమ్మకాలు పెరుగుతాయని కూడా అంచానా వేస్తున్నాయి. లిక్కర్ విషయంలో ప్రభుత్వం కూడా న్యూ ఇయర్ రోజు కొన్ని సవరణలను చేస్తుందని అనుకుంటన్నారు. అర్థరాత్రి వరకూ లిక్కర్ అమ్ముకునే వెసులు బాటు కల్పిస్తారు.

టాలీవుడ్ జోష్

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న చిత్ర పరిశ్రమకు న్యూ ఇయర్ యమ డిమాండ్ ఈవెంట్. స్టార్లతో ప్రత్యేక షోలను ఏర్పాటు చేయడం, డిజే మిక్సింగ్ సౌండ్స్ లాంటివి కొత్త ఏడాది వేడుకల్లో సాధారణంగా కనిపించేదే. ఈ సారి హీరోయిన్ పెర్ ఫార్మన్స్ కోసం దాదాపు రెండు లక్షల నుంచి 50 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ హిట్ సినిమాలు రావడం సినిపరిశ్రమలో స్టార్లను తమ పార్టీలకు ఆహ్వానించడంపై ఈవెంట్ మేనేజర్లు బిజీ అయిపోయారు.

హైదరాబాద్ లో ఎప్పుడూ చాలా పార్టీలు జరుగుతుంటాయి. కానీ న్యూ ఇయర్ పార్టీల కుండే ప్రత్యేకతే వేరు.
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik