బెంగళూరులో ఘనంగా టెక్ స్పార్క్స్ 2016 గ్రాండ్ ఫినాలే  

1

యువర్ స్టోరీ చేపట్టిన టెక్ స్పార్క్స్ 2016 గ్రాండ్ ఫినాలే బెంగళూరులో ఘనంగా ప్రారంభమైంది. కర్నాటక ఐటీ మినిస్టర్ ప్రియాక్ ఖర్గే ఈవెంట్ ని ఇనాగరేట్ చేశారు.

గత ఆరేళ్లుగా యువర్ స్టోరీ ఆధ్వర్యంలో జరుగుతున్న టెక్ స్పార్క్స్ సమ్మిట్ దేశవ్యాప్తంగా అనేక వ్యాపారవేత్తలను, స్టార్టప్ ఐడియాలను, ఇకో సిస్టమ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.

టెక్ స్పార్క్స్ 2016 సమ్మిట్ లో యువర్ స్టోరీ ఫౌండర్, సీఈవో శ్రద్ధా శర్మ ప్రారంభోపాన్యాసం చేశారు. ఈ ఏడేళ్ల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 3వేల మంది ఆంట్రప్రెన్యూర్లు, స్టార్టప్ ఫౌండర్లు ఈ ఈవెంటుకు హాజరయ్యారు.

బెంగళూరు నగరం దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని కర్నాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే అన్నారు. సాంకేతిక విప్లవంలో బెంగళూరు నగరం ఒక కరదీపికలా నిలిచిందని అన్నారు. సిలికాన్ వాలీగా చెప్పుకునే నగరంలో సుమారు 4వేలకు పైగా స్టార్టప్ కంపెనీలు ఉండటం గర్వకారణమని ఖర్గే తెలిపారు. కర్నాటక ప్రభుత్వం స్టార్టప్ ఫ్రెండ్లీ పాలసీ గురించి వివరించారు. స్టార్టప్ కంపెనీలను, ఆంట్రప్రెన్యూర్లను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేందుకు కర్నాటక వ్యాప్తంగా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఖర్గే అన్నారు.

రెండు రోజులపాటు జరిగే ఈ గ్రాండ్ ఫినాలేలో ఎందరో వక్తలు తమ స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలిస్తారు. కర్నాటక ఐటీ మినిస్టర్ సహా, అడిషన్ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ, ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీ, టాటా సన్స్ బ్రాండ్ కస్టోడియన్ డా. ముకుంద్ రాజన్, మ్యాప్ మై జినోమ్స్ అను అచార్య, జెన్ డెస్క్ నుంచి జులీ నూట్, బుక్ మై షోస్- ఆశిష్ హేమరజనీ, శైలేంద్ర సింగ్, షాపీఫైస్- బ్రమ్ సుగర్మన్, జస్ట్ మనీ- లిజీ చాప్ మన్, కునాల్ షా, బేబీ చక్ర- నయ్యా సాగి, విస్టా రూమ్స్- అంకితా సేథ్ తో పాటు అనేక మంది ఆంట్రప్రెన్యూర్లు, వ్యాపారదిగ్గజాలు తమతమ విజయగాథలను, వ్యాపార సూత్రాలను, అధిగమించిన ఆటుపోట్లను వివరించబోతున్నారు.

ఇదే కాకుండా టెక్ స్పార్క్స్ 2016.. జెన్ డెస్క్, డిజిటల్ ఓషన్ లాంటి ఎన్నో క్రెడిబుల్.. ఇన్నోవేటివ్ బ్రాండ్లకు చేయూతనిస్తోంది. 60కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్- దేశ ఆర్ధిక వనరులను పెంచడానికి స్టార్టప్ ఇకో సిస్టమ్ ను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. 

Related Stories