మీకు స్టార్టప్ ఐడియా ఉందా..? అయితే ఈ పది పాయింట్లు మీ కోసమే..

మీకు స్టార్టప్ ఐడియా ఉందా..? అయితే ఈ పది పాయింట్లు మీ కోసమే..

Sunday February 14, 2016,

3 min Read

నా తొలి స్టార్టప్ సేచీర్జ్. ఈ ప్రాజెక్ట్ ను 2015 మధ్యలోడెవలప్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడిప్పుడే మా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. మా ఫౌండర్లందరూ ఫుల్ టైమ్ స్టార్టప్ కోసం పనిచేసినా డబ్బుల్ని మేనేజ్ చేయడం, స్టార్టప్ ను వృద్ధి పథంలో నడిపించడం, ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేయడం కష్టంగా ఉండేది. నా స్టార్టప్ ప్రారంభించడంలో గత కొద్ది నెలలుగా నేను నేర్చుకున్న విషయాలు ఇవే...

image


1. నిజంగా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే?

స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు, "నువ్వు ఎంత కష్టపడ్డావని, ప్రయత్నించావన్న విషయం కస్టమర్లకు అవసరం లేదు. మీరు వాళ్లకు ఏమి ఇచ్చారన్నదే ముఖ్యం". నువ్వు ఏం చెప్పారన్నది ఎవరూ పట్టించుకోరు. నువ్వేం చేశావన్నదే ముఖ్యం. అందుకే దానిపైనే దృష్టిపెట్టండి. మీ విజయాన్ని మీరు అందించే సేవలతో కొలవండి. మీకు రోజూ ఎన్ని సేల్స్ కాల్స్ వచ్చాయని, రోజుకు ఎంతమంది కస్టమర్లు మిమ్మల్ని కలిశారన్న దాన్ని పట్టించుకోవద్దు. మీరు మీ ఉత్పత్తిని వాడుకునేలా ఎంతమందిని ఒప్పించారన్నదే ముఖ్యమైన విషయం. కస్టమర్లకు మీరందించే సేవల్ని కొలిచేందుకు సరైన కొలమానాల్ని గుర్తించడంలోనే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

2.కొత్తగా ఏమైనా నేర్చుకోండి

ప్రతీరోజూ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది ఏదైనా కావచ్చు. ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుందో చెప్పలేం కదా. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. అప్పుడే అక్కడే అసలైన మాయ జరుగుతుంది. కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, మర్చిపోవడానికి ధైర్యం లభిస్తుంది.

3. రిస్క్ తీసుకోండి

ఎలాంటి ప్లానింగ్ లేకుండా రిస్కులు తీసుకోవద్దు. రిస్కుకూ ఓ లెక్కుండాలి. కానీ రిస్కు తీసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. అంతర్లీనంగా ఉండే మీ శక్తిపై నమ్మకం ఉంచాలి. చాలావరకు ఆ రిస్కులు మిమ్మల్ని నిరుత్సాహపర్చవు.

4. ఫండింగ్ అనే మాట అవాస్తవం

చాలామంది ఆంట్రప్రెన్యూర్లు కేవలం ఫండింగ్ సాధించడంపైనే దృష్టిపెడతారు. నిధులు సాధించడమే వ్యాపారానికి సంబంధించన అంతిమ లక్ష్యం కాదు. లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడమే మీ మొదటి ప్రాధాన్యం కావాలి. ఇలాంటి వ్యాపారాన్ని ఏర్పాటు చేశారంటే నిధులు వాటికవే వస్తుంటాయి.

ఈ స్టోరీ కూడా చదవండి

5. దూసుకెళ్లడం

చొరవతో దూసుకెళ్లడం ద్వారా ఇన్వెస్టర్లను, కొత్త మిత్రుల్ని కలుసుకోవచ్చు. మీ ఈక్విటీ విలువలో ఇది ఐదు నుంచి పదిశాతమే. దాని గురించి ఆలోచించండి. తెలివిగా ఎంచుకోండి.

6. ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉండండి

పని తప్పించుకోవడానికి మీ ఉద్యోగులు ఎప్పుడూ ఏవో సాకులు వెతుకుతూనే ఉంటారు. వారిని వారి పరిధులు, పరిమితులు దాటి పనిచేసేలా ప్రోత్సహించండి. ఒక ఫీచర్ తయారు చేయడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందని మీ టెక్నికల్ ఉద్యోగి చెబుతున్నాడంటే అది అబద్ధమే. ఫలానా ఫీచర్ వచ్చే వరకు ప్రొడక్ట్ ని అమ్మలేనని మీ సేల్స్ ఉద్యోగి చెబుతున్నాడంటే పని తప్పించుకోవడానికి సాకులు వెతుకుతున్నట్టే. అలాంటివి జరగనివ్వకండి. అటువంటి పరిస్థితి కనిపిస్తే వెంటనే సంబంధాలు తెంచుకోండి.

7. అమ్మకాలపై దృష్టి పెట్టండి

ఆదాయాన్ని ఆర్జించే ఏకైక డిపార్ట్ మెంట్ సేల్స్. బలమైన సేల్స్ టీమ్ ని ఏర్పాటు చేసేందుకు ఎక్కువ కష్టపడండి. మీ ప్రొడక్ట్ ఎంత బాగుందన్నది కాదు... మంచి సేల్స్ ఉద్యోగులు లేకపోతే వాటిని అమ్మలేరన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి.

8. కష్టపడి కాదు... తెలివిగా పనిచేయండి

పగలూ, రాత్రంతా కష్టపడటం అనవసరం. అలా చేసినంత మాత్రానా మీరు కష్టపడి పనిచేసినట్టు కాదు. దానర్థం ఏంటంటే మీ పనివేళల్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదన్నట్టే. మీ పనిని ప్లాన్ చేసుకోవాలి. తెలివిగా పనిచేయాలి. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమైన విషయం.

9. ఓడిపోవడం ఆటలో భాగం

ఓడిపోతామని ఎప్పుడూ భయపడకండి. ఓడిపోవాలని కోరుకునేవాళ్లే విజయవంతమైన ఆంట్రప్రెన్యూర్లు అవుతారు. ఓడిపోవడం ఆటలో భాగం. నిజానికి సక్సెస్ స్టోరీల కన్నా ఫెయిల్యూర్ స్టోరీల నుంచే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. అందుకే ఓటమిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.

10. అవకాశాలను వదులుకోకండి

మీ ప్రయాణంలో ఎదురయ్యే ఏ అవకాశాలను వదులుకోకండి. వీలైనంత ఎక్కువమందికి మీ ఉత్పత్తుల్ని అమ్మెయ్యండి. ప్రతీ సందర్భంలో మీ సత్తా చాటండి. ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు వీలైనంతగా సాయం చేయండి. స్టార్టప్ ప్రయాణం మొదలుపెట్టే యువతరానికి నేనిచ్చే ఏకైక సలహా ఏంటంటే... మీ ఐడియాపై కసరత్తు చేయడానికి, పని మొదలుపెట్టడానికి ఈ రోజును మించిన మంచి రోజు లేదు. మీరు గెలిచినా, ఓడినా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అది చాలా ముఖ్యమైన విషయం. ఆకలితో ఉండండి. పోటీపడండి.

రచయిత గురించి:

అరుణ్ రాజ్ ఆర్ సేచీర్జ్ కో-ఫౌండర్. అతను ఫుల్ టైమ్ ఆంట్రప్రెన్యూర్. బ్లాగ్, ఫోటోగ్రఫీ, పుస్తకాలు చదవడం, ట్రావెల్ చేయడమంటే చాలా ఇష్టం.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి