కస్టమర్ల కోసం వాట్సప్ తరహాలో"గుడ్ బాక్స్"బిజినెస్ యాప్

0

ఉదయమే తాగే టీ లో వినియోగించే పాల కోసమో లేక ఆకలిగా ఉన్నప్పుడు తినే తిను బండారాల కోసమో మనం కిరాణా స్టోర్స్‌కు వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా వీటి కోసం దగ్గరలో ఉండే స్టోర్స్‌కే ఎక్కువుగా వెళుతుంటాం. ఒక వేళ పాల కోసమో లేక మిగలిన నిత్యావసర వస్తువుల కోసమో దగ్గర్లో ఉన్న కిరాణ షాపు యజమానికి ఓ మేసేజ్ పంపించి, ఇంటర్నెట్ ద్వారా డబ్బు కూడా చెల్లించి.. కోరుకున్న వస్తువులను ఇంటికి తెప్పించుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి ఊహను నిజం చేయడానికే వచ్చేసింది గుడ్ బాక్స్. మొబైల్ యాప్‌గా రూపొందిన గుడ్ బాక్స్ ద్వారా వినియోగదారులు తమ కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవడంతో పాటు వ్యాపారులు.. తమ కస్టమర్లకు వస్తువులు విక్రయించుకోవడానికీ వీలు కలుగుతుంది.

"యాప్స్ ద్వారా ఆన్ లైన్‌లో కొనుగోలు చేసే కస్టమర్లకు తమ దగ్గర ఉన్న వస్తువులను విక్రయించాలని చాలామంది వ్యాపారులు భావిస్తుంటారు. కానీ, తమ వ్యాపారం కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించుకోవడం అందరికీ అసాధ్యం. కస్టమర్లు కూడా వివిధ సేవల కోసం అనేక యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపించరు" అని వివరించారు మయాంక్ బిడావట్కా. ఈయన తాజాగా గుడ్ బాక్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరిగా చేరారు. రెడ్ బస్ సంస్థ కోర్ టీంలో సభ్యుడిగా కొనసాగుతున్న మయాంక్... మీడియా యాంట్‌లోనూ సహ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు.

వ్యాపారానికి గుడ్ బాక్స్ ఓ యాప్‌గా మారిపోతుంది. " చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఓ సులభమైన వ్యాపార వేదిక రూపొందించాలని... దాని ద్వారా వారు తమ కస్టమర్లను అప్రోచ్ అయ్యేలా చేయడంతో పాటు యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయాలని భావించాం" అన్నారు మయాంక్.

కంపెనీ ప్రారంభం మరియు కోర్ టీమ్ లోని చేరిక
కంపెనీ ప్రారంభం మరియు కోర్ టీమ్ లోని చేరిక

కంపెనీ ప్రారంభం... కోర్ టీం

రెడ్ బస్ కోర్ టీంలోని మయాంక్, నితిన్ చంద్ర, మోహిత్ మహేశ్వరి, ఆనంద్ కలగినమణి, మహేశ్ హర్లే, చరణ్ రాజ్‌తో కలిసి పని చేసే అబెయ్ జాచార్య ఈ యాప్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యే మయాంక్‌ కూడా వీళ్లతో చేతులు కలిపారు.

గుడ్ బాక్స్ సంస్థకు మారుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నెట్‌వర్క్ బిజినెస్, సరికొత్త ఆలోచనలపై పని చేయడాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను. రెడ్ బస్, మీడియా యాంట్, గుడ్ బాక్స్ వంటి కంపెనీలన్నీ వినూత్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే. వీటిని అంత ముందుకు ఎవరూ డిజైన్ చేయలేదు. అలాంటి సరికొత్త ఆలోచనల ఆధారంగా పనిచేయడం, వాటిలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా మన క్రియేటివిటీ కూడా బయటపడుతుందని" అన్నారు. సొంతంగా ఎదగాలనే దృక్పథం ఉన్న వారిని, సమస్యలకు వెరవని వారిని తమ టీంలోకి తీసుకోవాలని ఈ బృందం భావిస్తోంది.

వ్యాపారులు, వినియోగదారులకు ఉపయోగం

గుడ్ బాక్స్... వ్యాపారానికి ఎలా ఉయోగపడుతుందనే విషయాన్ని వివరించిన మయాంక్... ప్రస్తుతం వ్యాపారులు కొత్త టెక్నాలజీ ఆధారంగా కస్టమర్లను సంప్రదించాలని భావిస్తున్నారని తెలిపారు. యాప్‌లో తమ కస్టమర్లకు కావాల్సిన మెనూతో పాటు వాళ్ల బిజినెస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న మొబైల్ ప్రపంచంలో, యాప్స్ యుగంలో... ప్రతి పనికీ ఓ యాప్ వాడాల్సిన పరిస్థితి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల కారణంగా ఇది ఉత్తమమైన మార్గంగా కూడా మారిపోయింది. అయితే.. మార్కెట్లో కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్న సరికొత్త యాప్స్ కారణంగా... తమ అవసరాలకు ఏ యాప్ సరిగ్గా సూట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం వినియోగదారులకు కష్టసాధ్యంగా మారింది.

గుడ్ బాక్స్ ద్వారా కస్టమర్లు తమకు నమ్మకమైన వ్యాపారులతో డీల్ చేసేందుకు ఓ సరైన వేదికను కనుగొంటారని మాయంక్ అన్నారు. అది వారికి పొరుగునే ఉన్న కిరాణా స్టోర్స్ కావొచ్చు.. లేక వారు కనుగొన్న కొత్త వ్యాపారి కావొచ్చు. ఓ వినియోగదారుడు తమకు నచ్చిన ఏదైనా వ్యాపార ప్రతినిధులతో చాట్ చేసి, ఆర్డర్ చేసి, పేమెంట్ కూడా చేసే సౌలభ్యం ఈ యాప్ ద్వారా లభించింది.

చిన్న తేడాతో సరికొత్త వాట్సప్

వాట్సాప్‌తో తమ యాప్‌కు దగ్గరి పోలికలు ఉన్నప్పటికీ... తమ ఉద్దేశం వేరని అన్నారు మయాంక్." వినియోగదారులు, వ్యాపారులు వాట్సాప్‌ను యూజ్ చేస్తారు. అందుకే వాట్సాప్ లాంటి యాప్‌ను రూపొందించాలని భావించాం. దీని ద్వారా ఒకరికొకరు సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. తమ యాప్‌లో మెసేజింగ్ ఫీచర్ ఉన్నా... మిగతా యాప్స్‌తో పోలిస్తే ఇది డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. సాధారణ చాటింగ్ కోసం కాకుండా ఓ బయర్.. సెల్లర్‌తో సంప్రదించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మేము వారికి సహాయం చేయడం కంటే ఎక్కువగా వారి మధ్య సంధానకర్తులుగా ఉంటాం"అని చెబ్తున్నారు.

వ్యాపార విస్తరణ మరియు నిధుల సమీకరణ

కొన్నాళ్ల పాటు ప్రయోగ దశలో ఉన్న ఆన్ లైన్ యాప్... గత రెండు నెలలుగా చెల్లింపులకు సహకరిస్తోంది. గత 60 రోజుల్లో యాప్ కు ఆదరణ 50 రెట్లు పెరిగిందని టీమ్ సభ్యులు తెలిపారు. గుడ్ బాక్స్‌కు అవసరమైన నిధులను మణిపాల్ గ్రూప్, టాక్సీ ఫర్ ష్యూర్ సహ వ్యవస్థాపకుడు అపరమేయ రాధాకృష్ణ, రెడ్ బస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు చరణ్ పద్మరాజు నుంచి సేకరించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులు, స్టార్టప్‌లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన వారికి తమ యాప్ చేరువ చేయాలని గుడ్ బాక్స్ బృందం భావిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో కొత్తగా బిజినెస్ మొదలుపెట్టే వారితో టచ్‌లో ఉన్నారు యాప్ నిర్వహకులు. "చిన్న, మధ్య తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టిన వారికి, వారికి కస్టమర్లు గుడ్ బాక్స్ విజన్‌ను తెలియజేయడం, రోజూవారి కార్యకలాపాలను మరింతగా సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం" అన్నారు మయాంక్.

మార్కెట్ సామర్థ్యం

అసోచామ్ పిడబ్ల్యూసీ స్టడీ ప్రకారం...2014లో 4 కోట్ల మంది కస్టమర్లు ఆన్ లైన్ లో వస్తువులను కొనుగులు చేశారని... 2015 పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య 6.5 కోట్లకు చేరుతుందని వెల్లడైంది. 2020 నాటికి భారత ఈ కామర్స్ ఇండస్ట్రీ కొనుగోళ్లు 6,50,000 కోట్లకు చేరనుంది. ఇప్పటికే ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేయడంతో పాటు మరింతగా పెరగనున్న ఆన్ లైన్ బిజినెస్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.