ఆ మూడు బ్యాంకులు నాలుగు దాటితే వడ్డిస్తాయి!

ఆ మూడు బ్యాంకులు నాలుగు దాటితే వడ్డిస్తాయి!

Thursday March 02, 2017,

2 min Read

బ్యాంకులు బాదుడు మొదలుపెట్టాయి. విత్ డ్రాయల్స్ అయినా, డిపాజిట్లయినా, నెలలో నాలుగు లావాదేవీలు దాటితే, ఆపై ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ. 150 బాదేస్తారు. HDFC, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఈనెల నుంచే ఈరకమైన మోత మోగించడం షురూ చేశాయి. సేవింగ్స్ ఖాతాలకు, సాలరీ అకౌంట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీనికి సంబంధించి HDFC ఇప్పటికే ఒక సర్క్యులర్ జారీచేసింది. థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఒక్కరోజులో రూ. 25 వేలకు మించి ఉండరాదని నిబంధన విధించింది.

image


నగదు లావాదేవీలకు చెక్ పెట్టి, ఆన్ లైన్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బేసిక్ నో ఫ్రిల్స్ ఖాతాలకు మాగ్జిమం నాలుగు క్యాష్ విత్ డ్రాయల్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఎలాంటి చార్జీలు ఉండవు.

ఇక ఎప్పటినుంచో ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై చార్జీలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే మరోసారి వడ్డన తప్పదని బ్యాంకు భావిస్తోంది. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం హోం బ్రాంచీలో మొదటి నాలుగు లావాదేవీలు ఉచితం. అదే నెలలో నాలుగు దాటితే, ఆపై ప్రతీ ట్రాన్సాక్షన్ కు వడ్డిస్తారు. ప్రతీ వెయ్యి రూపాయలకు 5 రూపాయల చొప్పున మినిమం 150 వసూలు చేస్తారు. ఇక థర్డ్ పార్టీ లిమిట్ రోజుకి రూ. 50వేలు.

నాన్ హోం బ్రాంచీల విషయానికొస్తే.. నెలలో మొదటి నగదు లావాదేవీ ఫ్రీ. దాటితే ప్రతి రూ. వెయ్యికి 5 రూపాయలు చార్జీ పడుతుంది. మినిమం 150 వసూలు చేస్తారు. క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో కూడా తొలి క్యాష్ డిపాజిట్‌ ఉచితం. ఆ తర్వాత ప్రతీ 1,000కి రూ. 5 చొప్పున చార్జీలు వర్తిస్తాయి.

యాక్సిస్ బ్యాంకు నిబంధనలు ఒకసారి పరిశీలిస్తే.. రూ.10లక్షల విలువైన తొలి 5 లావాదేవీలు ఉచితం. ఐదు దాటితే ప్రతీ వెయ్యికి ఐదు రూపాయలు గానీ 150గానీ వసూలు చేస్తారు. ఏది ఎక్కువుంటే అది చార్జ్ చేస్తారు.

అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా ఈ తరహా చార్జీలు వడ్డిస్తాయా లేదా అన్నది ఇంకా తెలియదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని తెలుస్తోంది.