66 వస్తువులపై జీఎస్టీని ఇలా సవరించారు...

66 వస్తువులపై జీఎస్టీని ఇలా సవరించారు...

Sunday June 11, 2017,

2 min Read

సామాన్యులకు ఊరటను కలిగిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ మరో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. జీఎస్టీ పరిధిలోని 66 రకాల వస్తువులపై పన్నుల శాతాన్ని కొంత మెర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపారులు, పౌరుల నుంచి వచ్చిన 133 అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం.. జీఎస్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

image


జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయాలతో బ్యాగులు, ఇన్సూలిన్‌, ప్రింటర్స్‌, అగర్ బత్తీల ధరలు కాస్త తగ్గనున్నాయి. మొత్తమ్మీద 66 వస్తువులపై కొంత మెర పన్ను రేట్లను తగ్గించారు. సినిమాలపై పన్నులను రెండు విభాగాలు విభజించారు. వంద రుపాయాల టికెట్ పై 28 శాతం.. వంద లోపు టిక్కెట్లపై 18శాతం పన్ను విధించారు.

శానిటరీ నాప్‌కిన్స్‌ ను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. దాంతో పాటు స్కూల్‌ బ్యాగ్‌ లపై 28శాతం ఉన్న పన్నును 18కి తగ్గించింది. కంప్యూటర్‌ ప్రింటర్లపై 28 శాతం నుంచి 18శాతానికి, అగర్ బత్తీలు, ఇన్సూలిన్‌ పై 12 నుంచి 5 శాతానికి జీఎస్టీ రేట్లను తగ్గిన్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ట్రాక్టర్ విడిభాగాలపై 28శాతం ఉన్న పన్నును 18శాతానికి తగ్గించింది. పచ్చళ్లపై 5శాతం పన్ను విధిస్తున్నట్లు జీఎస్టీ తెల్పింది.

ప్రాక్టికల్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పన్ను మినహాయించాలని ఆయన కోరారు. గతంలో ఉన్నవిధంగా పన్నులను కొనసాగించాలని, చిన్న పరిశ్రమలపై పన్ను భారం తగ్గించాలని సూచించినట్టు ఈటెల తెలిపారు. సార్ట్, నాన్‌ స్టార్‌ హోటళ్లకు ఒకే విధమైన పన్నుకాకుండా.. నాన్‌ హోటళ్లకు ఐదుశాతం పన్ను విధించాలని కోరినట్లు చెప్పారు. గ్రానైట్ స్లాబ్ మీద 16.2 శాతం పన్నుని 28 శాతం చేశారు. దానిని తగ్గించాలని కోరినట్టు ఈటెల తెలిపారు.

ఇదిలా వుంటే ఉత్పత్తిదారులు, వ్యాపారులు, రెస్టారెంట్ల యజమానుల అందించే నష్టపరిహార పరిధిని కూడా పెంచారు. ఇంతకముందు 50 లక్షల టర్నోవర్‌ ఉన్నసంస్థలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తామన్న మండలి.. ఆ పరిధిని రూ.75 లక్షలకు పెంచింది. జూన్‌ 18న మరోసారి సమావేశమై మిగితా వాటిపై చర్చించనున్నారు.