వంట సామగ్రి మాది.. వండుకునే బాధ్యత మీది...'హాఫ్ టీ స్పూన్' వినూత్న కాన్సెప్ట్

క్ష‌ణం తీరిక‌లేని ప్ర‌పంచ‌మిది. బిజీ లైఫ్‌లో ఆఫీస్‌కే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. ఇక ఇంటికి వ‌చ్చి వండుకుని తినాలంటే ఇక అంతే. అందుకే చాలామంది ఆఫీస్ నుంచి వ‌చ్చేట‌ప్పుడే కావాల్సిన ఆహార ప‌దార్థాల‌ను పార్స‌ల్ తెచ్చుకుంటారు. అయితే ఇష్ట‌మున్న‌వి కాకుండా, అందుబాటులో ఉన్న‌వి తెచ్చుకుని తిని అడ్జెస్ట్ అవుతుంటారు. అలాంటి స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు సిద్ధ‌మైంది బెంగ‌ళూరుకు చెందిన హాఫ్ టీ స్పూన్‌. క‌స్ట‌మ‌ర్ల ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాల‌ను, ఆర్డ‌ర్‌పై స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.

వంట సామగ్రి మాది.. వండుకునే బాధ్యత మీది...'హాఫ్ టీ స్పూన్' వినూత్న కాన్సెప్ట్

Thursday May 14, 2015,

3 min Read

image


రుచిక‌ర‌మైన ఆహారాన్ని తిన‌డ‌మ‌న్నా, వండ‌డ‌మ‌న్నాప్ర‌తి ఒక్క‌రికి ఇష్ట‌ముంటుంది. వంటింట్లో చ‌క‌చ‌కా వండేందుకు ఇష్ట‌మున్నా, దానికి కావాల్సిన స‌రుకుల‌ను తెచ్చుకోవ‌డ‌మే కాస్త క‌ష్టం. ఈ బిజీ లైఫ్‌లో, క్ష‌ణం తీరిక‌లేని షెడ్యూల్‌లో షాప్‌కు వెళ్లి స‌రుకులు తీసుకురావ‌డం చాలామందికి వీలు కాదు. అలాంటి వారిని ల‌క్ష్యంగా పెట్టుకుని బెంగ‌ళూరులో హాఫ్ టీ స్పూన్ ఆవిర్భ‌వించింది.

image


ఐఐటీ కుర్రాళ్ల ప్ర‌యోగం

ఈ హాఫ్ టీ స్పూన్ స్టార్ట‌ప్‌ను ఇద్ద‌రు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ గ్రాడ్యుయేట్స్ జానీ పాషా, అఫ్స‌ర్ అహ్మ‌ద్ ప్రారంభించారు. క‌స్ట‌మ‌ర్ల కోరిన రెసిపీల‌ను రుచిగా, శుచిగా వండి తిన‌డానికి రెడీగా పంపుతారు. ఆ ప‌దార్థాల్లో మ‌సాలా అవ‌స‌ర‌మున్నంత‌ మేర‌కే మిక్స్ చేస్తారు. ఐతే ఈ ఆహార ప‌దార్థాల‌ను హాఫ్ టీ స్పూన్ స‌ర‌ఫ‌రా చేయాలంటే.. ఒక‌రోజు ముందుగానే అడ్వాన్స్‌గా ఆర్డ‌ర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే రుచిక‌ర‌మైన రెసిపీల‌ను సిద్ధం చేసి హోమ్ డెలివ‌రీ చేస్తారు.

మార్కెట్ రీసెర్చ్‌, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్ర‌జ‌లు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని ఈ హాఫ్ టీ స్పూన్ నిర్వాహ‌కులు గుర్తించారు. గ్రోస‌రీ షాప్‌కు వెళ్లి అవ‌స‌ర‌మైనంత మేర‌కు స‌రుకులు కొనుగోలు చేయ‌డం అంత సుల‌భ‌మేమీ కాదు. చాలామంది ఈ స‌రుకుల కొనుగోళ్ల‌లో అంత అనుభ‌వ‌జ్ఞులు కారు. ఐతే అవ‌స‌ర‌మైన‌దానికంటే ఎక్కువ‌, లేదంటే త‌క్కువ కొనుగోలు చేస్తుంటారు. అలాగే ఆహార ప‌దార్థాలు కూడా అవ‌స‌రమైనంత కాకుండా ఎక్కువే చేసుకుని వృథా చేస్తుంటారు. మ‌రికొంత‌మందికి వంట ఒక బ్రహ్మ‌ప‌దార్థం. ఆన్‌లైన్‌లో అన్నిర‌కాల వంట‌లు అందుబాటులో ఉన్నా, వాటిని చేసుకోలేక నానా తిప్ప‌లు ప‌డుతుంటారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసి హాఫ్ టీ స్పూన్ రంగంలోకి దిగింది.

రెసిపీల‌కు రీజ‌న‌బుల్ రేట్‌

మార్కెట్‌లో దొరికే స‌రుకుల ధ‌ర‌ల కంటే ఈ హాఫ్ టీ స్పూన్ తాము సిద్ధం చేసిన వంట‌కాల‌కు కాస్త ఎక్కువ చార్జ్ చేస్తుంది. కానీ ఒకేర‌క‌మైన వంట‌కాల‌ను ప‌దే ప‌దే ఆర్డ‌ర్ చేసే క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్రం త‌క్కువ‌కే స‌ప్ల‌య్ చేసేందుకు కూడా తాము సిద్ధ‌మేన‌ని హాఫ్ టీ స్పూన్ నిర్వాహ‌కులు చెప్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇటాలియ‌న్ డిష్‌ను వండాలంటే ఆలివ్ ఆయిల్ అవ‌స‌రం. చిన్న ఫ్యామిలీకి ఈ డిష్‌ను వండాలంటే రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ స‌రిపోతుంది. కానీ మార్కెట్‌లో లూజ్ ఆయిల్ దొర‌క‌దు. త‌ప్ప‌నిస‌రిగా బాటిల్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే బ‌య‌ట మార్కెట్ ప్రైజ్‌తో పోలిస్తే ఈ సంస్థ తీసుకునే మొత్తం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. అయినా కూడా రీజ‌న‌బుల్‌గానే ఉంద‌న్న‌ది క‌స్ట‌మ‌ర్ల టాక్‌. అలాగే స‌బ్‌స్క్రిప్ష‌న్ మోడ‌ళ్ల‌లో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు రెసిపీల‌ను పంపాల‌ని ఈ సంస్థ భావిస్తోంది. క‌స్ట‌మ‌ర్ల ఇష్ట‌మైన ఆహారాన్ని వారానికి మూడు నుంచి ఐదు సార్లు, వారు కోరిన తేదీలు, స‌మ‌యాల్లో పంపుతుంది.

మౌత్ ప‌బ్లిసిటీ

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో మూడు ప్రాంతాల్లో ఈ సంస్థ వంట‌కాల‌ను పంపుతుంది. సోష‌ల్ మీడియాతోపాటు పాంప్లెంట్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు త‌మ గురించి వివ‌రిస్తున్న‌ది హాఫ్ టీ స్పూన్‌. అలాగే బ్యాన‌ర్లు, అపార్ట్‌మెంట్ల‌లో నివ‌సించేవారికి ఇంట‌ర్న‌ల్ మెయిల్స్ ద్వారా త‌మ రెసిపీల వివ‌రాల‌ను అంద‌జేస్తోంది. ఎంత ప్ర‌చారం చేస్తున్నా.. క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్న‌ది మాత్రం మౌత్ టు మౌత్ ప్ర‌చారం వల్లే. ఈ సంస్థ త‌యారు చేసే వంట‌కాలు బాగున్నాయ‌ని, పాత క‌స్ట‌మ‌ర్లు ఇత‌రుల‌కు చెప్ప‌డం ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఈ హాఫ్ టీ స్పూన్‌కు మంచి గుర్తింపు ల‌భించింది. మ‌రింత మంది క‌స్ట‌మ‌ర్ల‌కు చేరువ‌య్యేందుకు స్పెష‌ల్ డెలివ‌రీ డ్రైవ్‌ల‌ను కూడా నిర్వ‌హిస్తోంది. ఇలాంటి డ్రైవ్‌లు భోజ‌న ప్రియుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి.

ఒక‌రోజు ముందుగా ఆర్డ‌ర్ బుకింగ్‌..

ఈ సంస్థ సిద్ధం చేసే వంట‌కాల‌ను కోరుకునే భోజ‌న‌ప్రియులు ఒక‌రోజు ముందుగానే ఆర్డ‌ర్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక‌రోజు నాలుగు డెలివ‌రీ ఆర్డ‌ర్ల‌ను స్లాట్ల‌ను బుక్ చేసుకుని అందుకు త‌గ్గ‌ట్టుగా రెసిపీల‌ను ప్రిపేర్ చేస్తుంది హాఫ్ టీ స్పూన్‌. ఈ నాలుగు స్లాట్ల‌కు రెసిపీల‌ను సిద్ధం చేయ‌డం కూడా చాలా టైమ్‌తో కూడిన ప‌ని. ఆ వంట‌కాల‌కు కావాల్సిన స‌రుకుల‌ను అవ‌స‌ర‌మైన మేర‌కు కొనుక్కోవాల్సి ఉంటుంది. నిలువ ఉండే స‌రుకుల‌ను ఒకేసారి కొనుగోలు చేసి స్టోర్ చేసుకున్నా, కూర‌గాయ‌ల‌వంటి వాటిని ఏరోజుకారోజు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల కూర‌గాయ‌లు తాజాగా ఉండ‌ట‌మే కాకుండా, రుచిగా, వృథా కాకుండా ఉంటాయి. ఇక సిద్ధ‌మైన వంట‌కాల‌ను సంస్థ ఉద్యోగులే క‌స్ట‌మ‌ర్ల ఇళ్ల‌కు వెళ్లి డెలివ‌రీ చేస్తారు. ఐతే బెంగ‌ళూరులో మ‌రికొన్ని ప్రాంతాల‌కు కూడా వ్యాపారాన్ని విస్త‌రించాల‌నుకుంటున్న హాఫ్ టీ స్పూన్‌.. డెలివ‌రీ కోసం థ‌ర్డ్ పార్టీ పంపిణీదారుల‌తో చ‌ర్చులు జ‌రుపుతున్న‌ది. ఇలాంటి వ్యాపారం అమెరికాలో బ్లూ అప్రాన్ అనే సంస్థ నిర్వ‌హిస్తున్న‌ది. కానీ భార‌త దేశం మార్కెట్ కాస్త భిన్న‌మైన‌ది. చాలా క‌ష్ట‌మైన‌ది కూడా. అయిన‌ప్ప‌టికీ కూడా హాఫ్ టీ స్పూన్ నిర్వాహ‌కులు విజ‌య‌వంతంగా త‌మ వ్యాపారాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఆరోగ్య‌క‌ర ఆహారం..

భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని సేవ‌లు అలందించాల‌ని ఈ సంస్థ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఎలాంటి ర‌సాయ‌నాలు వాడ‌ని సేంద్రీయ ఎరువుల‌తో త‌యారుచేసిన కూర‌గాయ‌ల‌తో కూడిన ఆహారాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు అందించాల‌నుకుంటున్నారు. అలాగే డైట్ ప్లాన్ ఆధారంగా అవ‌స‌ర‌మైన వంట‌కాల‌ను కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.


హాఫ్ టీ స్పూన్ బాక్స్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది.. అనే అనుభవాన్న పొందేందుకు కంపెనీ యువర్ స్టోరీకి రెండు పార్శిల్స్ పంపింది. అవి ఫార్‌ఫలే పాస్తా, కాంటన్ స్టైల్ నూడిల్స్. అవే ఈ కింది ఫోటోలు. చివర్లో తయారీ విధానం పేపర్.

image


image


image


image