నెల‌కు రూ.60 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఇండియ‌న్ మ‌నీ సుధీర్ స‌క్సెస్ సీక్రెట్ ఏంటి ?

పెట్టుబడుల విష‌యాల్లో స‌ల‌హాలు ఇస్తున్న ఇండియ‌న్ మ‌నీ.కామ్‌..అసోసియేట్స్‌కు లీడ్స్‌ను అందిస్తూ ఆర్జిస్తున్న సంస్థ..

నెల‌కు రూ.60 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఇండియ‌న్ మ‌నీ సుధీర్ స‌క్సెస్ సీక్రెట్ ఏంటి ?

Saturday June 20, 2015,

3 min Read


సాధించాల‌నే త‌ప‌న‌, వ్యాపార వ్యూహాలు, చిత్త‌శుద్ధి, ప‌నిచేస్తున్న రంగంపై అవ‌గాహ‌న ఉంటే సాధించ‌లేనిది ఏమీ లేద‌ని ఇండియ‌న్ మ‌నీ.కామ్ వ్య‌వ‌స్థాప‌కుడు సీఎస్ సుధీర్ నిరూపించారు. అనుకోని ఘ‌ట‌న‌తో బీమా రంగంలోకి ప్ర‌వేశించి నెల‌కు రూ.60 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు.

సీఎస్ సుధీర్‌, ఇండియా మ‌నీ వ్య‌వ‌స్థాప‌కుడు

సీఎస్ సుధీర్‌, ఇండియా మ‌నీ వ్య‌వ‌స్థాప‌కుడు


అనుకోని ఘ‌ట‌న‌తో సంస్థ ఏర్పాటు..!

సీఎస్ సుధీర్‌.. క‌ర్ణాట‌క‌లో ఓ మ‌ల్టీనేష‌న‌ల్ బ్రోక‌ర్ ఫ‌ర్మ్‌కు హెడ్‌. ఆ కంపెనీ రిస్క్ మేనేజ్‌మెంట్‌, రిటైల్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు నిర్వ‌హిస్తోంది. 2008లో అనుకోకుండా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఇండియ‌న్ మ‌నీ ఏర్పాటుకు కార‌ణ‌మైంది. సుధీర్‌తో ఓ రోజు ఓ ఆటో డ్రైవ‌ర్ మాట్లాడుతూ.. ఆ కంపెనీకి చెందిన ఓ ఏజెంట్ త‌న‌కు పాల‌సీని అంట‌గ‌ట్టాడ‌ని సుధీర్‌తో చెప్పారు. ఒక్క‌సారి రూ. 25 వేలతో పాల‌సీ తీసుకుంటే మూడేళ్ల త‌ర్వాత ల‌క్ష రూపాయ‌లు వ‌స్తాయ‌ని ఆ ఏజెంట్ త‌న‌కు చెప్పార‌ని ఆటో డ్రైవ‌ర్ వివ‌రించారు. అత‌ని వ‌ద్ద ఉన్న పాల‌సీని సుధీర్ చెక్ చేస్తే, అది సాధార‌ణ యూనిట్ లింక్ ఇన్స్యూరెన్స్ పాల‌సీ. వ‌రుస‌గా మూడేళ్ల‌పాటు రూ. 25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ అంశాలేవీ చెప్ప‌కుండా ఆ ఏజెంట్ పాల‌సీని ఆటోడ్రైవ‌ర్‌కు అంట‌గ‌ట్టాడు. ఆ ఘ‌ట‌న ఇన్స్యూరెన్స్ ఇండ‌స్ట్రీపై సుధీర్ దృష్టిపెట్ట‌డానికి కార‌ణ‌మైంది. భార‌త్‌లో ఉన్న‌త విద్య‌ను అభ‌సించిన‌వారికి సైతం ఆర్థిక అంశాల్లో అవ‌గాహ‌న అంతంత‌మాత్ర‌మే. అందువ‌ల్లే బీమా ఏజెంట్ల ఆట‌లు సాగుతున్నాయి. 

"ఆ ఘ‌ట‌న కార‌ణంగానే ఇండియ‌న్ మ‌నీ.కామ్ ఆవిర్భ‌వించింది. ఆర్థిక అక్ష‌రాస్య‌త‌ను వ్యాప్తిచేయ‌డం, నిప్ప‌క్ష‌పాత‌మైన ఆర్థిక స‌ల‌హాల‌ను అవ‌స‌ర‌మైన ప్ర‌తి ఒక్క‌రికి అందించ‌డ‌మే మా ల‌క్ష్యంఠ" అని సుధీర్ వివ‌రించారు.

2008లో అంకురార్ప‌ణ‌..

ఐఐటీ రూర్కీలో బీటెక్‌, కెల్లి స్కూల్ ఆఫ్ బిజినెస్‌, ఇండియానా యూనివ‌ర్సిటీలో ఎంబీఏ చేసిన రాహుల్ సింగ్‌తో క‌లిసి ఈ స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. తాను పొదుపు చేసుకున్న‌రూ. 20 ల‌క్ష‌ల మూలధ‌నంతో సుధీర్ 2008లో ఈ సంస్థ‌ను ప్రారంభించారు. ఎర్సామిక్ వెంచ‌ర్ ఫండ్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌వీంద్ర కృష్ణ‌ప్ప‌, ఏసెల్ పార్ట‌న‌ర్ శేఖ‌ర్ కిరానీలు 2011 మేలో మ‌రికొంత పెట్టుబ‌డి పెట్టారు.

జీతం కాదు.. పెట్టుబ‌డులే మిమ్మ‌ల్ని ధ‌న‌వంతుల‌ను చేస్తాయి

జీతం కాదు.. పెట్టుబ‌డులే మిమ్మ‌ల్ని ధ‌న‌వంతుల‌ను చేస్తాయి


ఇండియ‌న్ మ‌నీ బ‌హు విధాలుగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంది. "అవ‌స‌ర‌మున్న ఎవ‌రికైనా ఫోన్ ద్వారా పూర్తిగా ఉచిత ఆర్థిక స‌ల‌హాలు/విద్య‌ను అందిస్తాం. వారు కేవ‌లం మా హెల్ప్‌లైన్ నంబ‌ర్ 022-6181-6111కు మిస్స్‌డ్ కాల్ ఇస్తే చాలు. లేదంటే మా వెబ్‌సైట్‌లోకి ఎంట‌రై ఆన్‌లైన్‌లో ఫామ్ ఫిల్ చేసినా ఆర్థిక అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తాం" అని సుధీర్ వివ‌రించారు. సంస్థ‌కు చెందిన వెల్త్ డాక్ట‌ర్ల బృందం తిరిగి కాల్ చేసి.. ఆర్థిక అంశాల‌పై ఉన్న సందేహాల‌ను తీరుస్తారు. అలాగే ఫైనాన్షియ‌ల్ వాలిడేష‌న్ స‌ర్వీస్‌ను కూడా అంద‌జేస్తారు. ఎవ‌రైనా పెట్టుబ‌డులు పెట్టాల‌ని భావిస్తే, ఎలాంటి స‌మ‌యంలో పెట్టాలి.. ఏ సంస్థ‌లో పెట్టాలి అన్న అంశాల‌పై త‌మ అభిప్రాయాల‌ను ఇండియ‌న్ మ‌నీ వెల్త్ టీమ్ అంద‌జేస్తుంది. అది కూడా ఒక్క మిస్స్‌డ్ కాల్‌తోనే. 

"ఆస‌క్తి ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను మా ద‌గ్గ‌ర రిజిస్ట‌ర్ అయిన అసోసియేట్స్‌తో క‌నెక్ట్ చేస్తాం. ఆర్థిక పెట్టుబ‌డుల‌కు సంబంధించిన వివరాల కోసం మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించే క‌స్ట‌మ‌ర్ల‌కు, వారు సంతృప్తి చెందేలా ఈ స‌ల‌హాలు ఇస్తాం" అని సుధీర్ చెప్పారు.

రెవెన్యూ మోడ‌ల్‌

అసోసియేట్స్‌కు లీడ్స్‌ (క‌స్ట‌మ‌ర్ల‌ను) అందించ‌డం ద్వారా వారి నుంచి క‌మీష‌న్ల రూపంలో డ‌బ్బును తీసుకుంటారు. ఇండియ‌న్‌ మ‌నీ.కామ్ ప్ర‌ధాన ఆదాయ‌వ‌న‌రు ఇదే. క‌న్జ్యూమ‌ర్‌ నుంచి ఎలాంటి ఫీజు తీసుకోరు. కానీ క‌న్జ్యూమ‌ర్‌ను అసోసియేట్స్‌కు బ‌దిలీ చేసినందుకు వారి నుంచి రిఫ‌ర‌ల్ ఫీజు తీసుకుంటారు. "స‌క్సెస్ ఫీజ్ రూపంలో ఎలాంటి డ‌బ్బును స్వీక‌రించం. అందుకే అమ్మ‌కం జ‌రిగినా, జ‌ర‌గ‌క‌పోయినా వ్య‌వ‌హారం పూర్త‌య్యే వ‌ర‌కు నిష్ప‌క్ష‌పాతంగా ఉంటాం" అని సుధీర్ చెప్పుకొచ్చారు. 2011లో సంస్థ నెల‌స‌రి ఆదాయం రూ. 2 ల‌క్ష‌లుగా ఉండేది. అది ప్ర‌స్తుతం నెల‌కు రూ. 60 ల‌క్ష‌ల‌కు చేరింది. అలాగే హైద‌రాబాద్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి సంబంధించిన సంస్థాగ‌త పెట్టుబ‌డిని కూడా 2013 సెప్టెంబ‌ర్‌లో క్లోజ్ చేసేసింది ఇండియా మ‌నీ.

దేశ‌వ్యాప్త సేవ‌లు

ఇండియ‌న్‌ మ‌నీ ప్ర‌ధాన కార్యాల‌యం బెంగ‌ళూరులో ఉంది. కానీ ఈ సంస్థ దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సేవ‌లు అందిస్తోంది. ఈ స్టార్ట‌ప్‌లో ప్ర‌స్తుతం 86 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. ఎదిగిన కొద్దీ నేర్చుకుంటున్న సుధీర్‌.. త‌మ సంస్థ వృద్ధిలో మూడు అంశాలే కీల‌క‌మ‌ని చెప్తున్నారు.

  • 1. నా క‌న్జూమ‌ర్లు నాకు క‌స్ట‌మ‌ర్లు కార‌న్న విష‌యాన్ని నేను గుర్తించాను.
  • 2. సాధించాల‌న్న త‌ప‌న ఒక్క‌టే సంస్థ‌ను విజ‌య‌వంతంగా న‌డిపించ‌దు. స‌రైన వ్యాపార‌త్మ‌క వ్యూహ‌ర‌చ‌న‌లు కూడా ఉండాలి.
  • 3. వ్యాపారాన్ని నిర్మించేట‌ప్పుడు ఎంట‌ర్‌ప్రెన్యూర్‌లు సంస్థ‌కు ఇంజిన్లు కాకూడ‌దు. స్వ‌తంత్రంగా ఇంజిన్ల‌ను సృష్టించాలి..

ఇవే త‌మ సంస్థ అభివృద్ధిలో కీల‌క అంశాల‌ని సుధీర్ చెప్తారు.

వ‌చ్చే ఏడాది (2016-17)లో ప‌దిల‌క్ష‌ల మంది క‌న్జ్యూమ‌ర్ల‌కు ఆర్థిక విద్య‌/ స‌ల‌హాలు ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన సామ‌ర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇండియా మ‌నీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌నం కూడా వారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం..

Website: IndianMoney