టెక్నాలజీలో భాగ్యనగరం బ్రహ్మాండం! సత్యనాదెళ్ల మనోగతం !!

టెక్నాలజీలో భాగ్యనగరం బ్రహ్మాండం!  సత్యనాదెళ్ల మనోగతం !!

Tuesday December 29, 2015,

2 min Read

భారతీయ స్టార్టప్ లదే భవిష్యత్ అని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్ లో స్టార్టప్ లకోసం ఏర్పాటు చేసిన టీ హబ్ ను చూస్తే ముచ్చటేస్తుందని అన్నారాయన.

“నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకు తెలిసింది ట్యాంక్ బండ్ అంతే.. ఇప్పుడు భాగ్యనగరమంటే టెక్నాలజీ, టీ హబ్ కూడా,” సత్య నాదెళ్ల

హైదరాబాద్ లో తాను గడిపిని రోజులను గుర్తు చేసుకున్నారు సత్యనాదెళ్ల. అప్పట్లో టీ అంటే ట్యాంక్ బండ్ గానే తెలుసని, ఇప్పుడు టీ అంటే టెక్నాలజీ. స్టార్టప్ లకోసం ఏర్పాటు చేసిన టీ హబ్ నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు.

image


స్టార్టప్ లకు టీహబ్ మంచి అవకాశం

టీ హబ్ లాంటి ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయడం ఓ శుభపరిణామం. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ ఈకో సిస్టమ్ పై చూపిస్తోన్న చొరవను ఈ సంబర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.

“మైక్రో సాఫ్ట్ కూడా టీ హబ్ తో కలసిపనిచేయడానికి సిద్ధంగా ఉంది,” సత్యనాదెళ్ల

ఔత్సాహిక పారిశ్రామకివేత్తలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ అందరి కలలు నిజం కావాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందడానికే టీ హబ్ కు వచ్చానని అన్నారాయన. ఫౌండర్ ఆశయమే ఆ స్టార్టప్ ను నడిపిస్తుందన్నారాయన. స్థానిక పారిశ్రామికి వేత్తలకు సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా టీ హబ్ లో ఉండే స్టార్టప్ లకు అవసరమైన సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. టీ హబ్ లాంటి అవకాశం అందరికీ రాదని, దాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మంత్రి కేటీఆర్‌ తో సత్యా నాదెళ్ల

మంత్రి కేటీఆర్‌ తో సత్యా నాదెళ్ల


మారుమూల ప్రాంతాలకు టెక్నాలజీ

టెక్నాలజీ ఏ నగరానికో, లేదా ప్రాంతానికో పరిమితం కాకూడదు. మారూమూల గ్రామాల కనెక్టివిటీ కి అది ఉపయోగపడాలి. అందరికీ టెక్నాలజీ అందించాల్సిన బాధ్యత మనపై ఉందని స్టార్టప్ కంపెనీ ఫౌండర్లు, పారిశ్రామిక వేత్తలతో సత్యనాదెళ్ల అన్నారు. స్టార్టప్ కమ్యూనిటీ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.

“ఓటమి నుంచి విజయతీరాలకు చేరాలి,” సత్యనాదెళ్ల

వైఫల్యాల గురించి పట్టించుకోవాలసిన అవసరం లేదని, ఓటమినుంచే పాఠాలు నేర్చుకోవాలని, విజయతీరాలకు చేరాలని స్టార్టప్ కమ్యూనిటీకి పిలుపునిచ్చారు. వైట్ స్పేట్ టెక్నాలజీతో తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. కనెక్టివిటీ అనేది అత్యంత ప్రాధాన్య అంశంగా చెప్పుకొచ్చారు.

image


మైక్రో సాఫ్ట్ తో కలసి పనిచేస్తాం

సత్యనాదెళ్ల ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిండానికి ముందుకొస్తుందని ఐటి మంత్రి కేటీఆర్ అన్నారు.

“టీ హబ్ లోని ఇలాంటి కార్యక్రమంలో సత్యనాదెళ్లతో కలసి పాల్గొనడం అద్భుతమైన అనుభవం,” కేటీఆర్‌

స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు మైక్రో సాఫ్ట్ తో కలసి పనిచేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు డిటిటలైజ్ చేయనున్నామని, దానికి మైక్రో సాఫ్ట్ సాయం అందించాలని సత్యనాదెళ్లకు ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, నాస్కాం చైర్మన్ బివి మోహన్ రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ సీఈవో జివి ప్రసాద్ పాల్గొన్నారు