'ఫౌండర్ ఆసక్తే.. ఫండింగ్ తెస్తుంది' - సెకోయా క్యాపిటల్ శైలేంద్ర సింగ్

'ఫౌండర్ ఆసక్తే.. ఫండింగ్ తెస్తుంది' - సెకోయా క్యాపిటల్ శైలేంద్ర సింగ్

Sunday November 01, 2015,

3 min Read

ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మంచి టైం ఎప్పుడు ? సెకోయా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ చెప్పే వివరాల ప్రకారం పెట్టుబడులకు ఓ సీజన్ అంటూ ఏమీ ఉండదు. వ్యాపారం, ఫ్యూచర్‌ఫై ఫౌండర్లకు ఉన్న బలమైన నమ్మకం, మంచి బిజినెస్ ప్లాన్, కలిసికట్టుగా ఉన్న టీం.. ఇవన్నీ ఉంటే ఏ స్టార్టప్‌‌కైనా సక్సెస్‌కి బాటలు పడ్డట్లే అంటారు.

కొంతకాలం నుంచి ఫుడ్ టెక్నాలజీ, హైపర్ లోకల్ స్టార్టప్‌లలో పెట్టుబడులు నెమ్మదించాయనే వాదనలపై.. టెక్‌స్పార్క్స్‌‌ 2015లో జరిగిన చర్చా కార్యక్రమంలో శైలేంద్ర సింగ్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్ - ఫౌండర్ శ్రద్ధా శర్మ అడిగిన లోతైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ఆలోచింపజేసే మాట్లాడారు.

image


“అవును కొన్ని రంగాలపై ప్రస్తుతం మేఘాలు కమ్ముకున్న మాట వాస్తవమే. అయితే.. ఇది కేవలం చినుకులతో ఆగుతుందా లేక తుఫాన్ ఏమైనా వస్తుందా అంటే చెప్పడం చాలా కష్టం. అందుకే ఇలాంటి సమయంలో చేతిలో గొడుగు ఉండి తీరాలి”- శైలేంద్ర సింగ్.

ఇక్కడ ప్రారంభమైన చర్చ.. నిధుల సేకరణకు ఆంట్రప్రెన్యూర్స్ ఎలా ప్రయత్నించాలి అనే అంశంవైపు మళ్లింది. ఏదైనా అంశం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నంత మాత్రాన.. అది ఇన్వెస్టర్లలో కూడా సక్తిని పెంచుతుందని అనుకోవడం సరైంది కాదంటున్నారు శైలేంద్ర. వినియోగదారుల అవసరాలు మారుతూ, పెరుగుతూ ఉంటాయి. వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు స్టార్టప్‌లు ప్రయత్నించాలే కానీ.. ఇన్వెస్టర్లు ముందుకు రారు.

మరి ఏదైనా స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదం చేసే అంశం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు కంపెనీ ఫౌండర్‌తో తన అంచనా ప్రారంభించాస్తానంటున్నారు శైలేంద్ర.

“నా ప్రయాణం ప్రారంభమైనపుడు.. మొదట చెక్ లిస్ట్ లాంటిది ఉండేది. చాలామంది యువత ఇలాగే అలోచిస్తారని అనుకుంటున్నా. జీవితంలో అద్భుతమైనవాటిని కొలతలు వేయడం కష్టం. అలాగే స్టార్టప్‌ని కూడా అంకెలతో అంచనా వేయడం అసాధ్యం.”అన్నారు శైలేంద్ర సింగ్.

మరి స్టార్టప్‌ను అంచనా వేయడంలో శైలేంద్ర అనుసరించే విధానం ఏంటనే అనుమానం సహజమే. వ్యవస్థాపక సభ్యులకు ప్యాషన్, ఆలోచనలపై స్పష్టత ఉండాలి, వారి మధ్య అనుబంధం ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేరేపించగలగాలి. అంతేకాదు.. 5 నుంచి 10ఏళ్లపాటు అదే వెంచర్‌‌లో మనం ఇన్వెస్ట్‌ చేయగలమా అనే ఆలోచన ఫౌండింగ్ టీంని చూడగానే ఇన్వెస్టర్‌కు కలగాలి అంటున్నారు శైలేంద్ర సింగ్.

“ఓ అభివృద్ధి చెందుతున్న కంపెనీలో పెట్టుబడి పెట్టడమంటే.. అదో క్రేజీ, సెక్సీ విషయంగా భావిస్తారు చాలామంది. కానీ దీని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని అంగీకరించడానికి చాలామంది ఇష్టపడరు.”

పదేళ్లకు పైగా సెకోయాను నిర్వహిస్తున్న శైలేంద్ర సింగ్.. ఏదైనా వెంచర్‌ను పరిశీలించాక.. తప్పుకోవాలనే (ఎగ్జిట్) ఆలోచన ఎప్పుడొస్తుందనే ప్రశ్నకు సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వంగా అంకెలను పెంచి చూపిస్తున్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెబుతున్నారు. అయితే.. ఒక ఇన్వెస్టర్‌గా.. వ్యవస్థాపకునిపై నమ్మకం ఉంచాలని భావిస్తానని చెబ్తున్నారు శైలేంద్ర.


ఐఐటీ, ఐఐఎం విద్యార్ధులు వెంచర్ క్యాపటలిస్టులకు ఇష్టమా ?

ఐఐటీ, ఐఐఎం విద్యార్ధుల ప్రారంభించిన స్టార్టప్‌లకే ఎక్కువగా ఫండింగ్ అందుతోందనే ఓ భావన చాలామందిలో ఉంది. దీన్ని ఖండిస్తున్నారు శైలేంద్ర.

“దీన్ని నేను ఏమాత్రం అంగీకరించను. ఫిలాసఫీలో గ్రాడ్యుయేట్ కునాల్‌‌షా.. ఫ్రీచార్జ్‌‌ను ప్రారంభించారు. ఎన్ఐటీ -కర్నాటక విద్యార్ధి శశాంక్, ప్రాక్టోని నిర్వహిస్తున్నారు. న్యాయవాది అయిన అంకుర్ సింగ్లా హెల్ప్‌చాట్ ప్రారంభించారు. ఓయో రూమ్స్‌ని స్టార్ట్ చేసిన రితేష్.. కాలేజ్‌‌కే ఎన్నడూ వెళ్లలేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే.. ఏదైనా సాధించగలుగుతారని నేను విశ్వసిస్తాను”అన్నారు శైలేంద్ర.

ఈయన ఊహ ప్రకారం.. స్టార్టప్ వ్యవస్థ రేస్ ట్రాక్ లాంటిది అయితే.. వ్యవస్థాపకులు అథ్లెట్స్ లాంటివారు. తమ ప్యాషన్ నుంచి ఏదైనా సాధించేందుకు గొప్ప ఫౌండర్లు ఎప్పుడూ తపిస్తుంటారని అంటున్నారు శైలేంద్ర.

హాట్ హాట్ సెక్టార్లు ఏవి ?

ఇన్వెస్ట్‌మెంట్స్‌‌కి సీజన్ లేదు సరే.. మరి ఏ సెక్టార్లు పెట్టుబడులను ఆకర్షిస్తాయి ? ఏవి అనుకూలంగా ఉంటాయి ? అనే ప్రశ్న శైలేంద్రకి ఎదురైంది. ఏదైనా సెక్టార్ హాట్ అని ఏ ఫౌండర్ అయినా అనుకుంటే.. అది ఖచ్చితంగా ఆ స్థాయిలో ఎప్పటికీ ఉండదు. 2007 ఫ్యాషన్ రంగం బూమ్‌లో ఉంది. ఇప్పుడు మరొకటి ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. అయితే.. ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. తాను మొబైల్ వైపు మొగ్గు చూపుతానన్నారు శైలేంద్ర. అభివృద్ధి రేటు సూచీలు నిలువునా ఎగబాకుతుండడమే దీనికి కారణంగా చెబ్తున్నారు.

ఇలా ఎంచుకోవడానికి సూచించే మరో విభాగం ఫైనాన్షియల్ టెక్నాలజీ. పేమెంట్ బ్యాంక్‌లకు నిబంధనలు సరళీకృతం అవుతుండడాన్ని ప్రస్తావిస్తున్నారు శైలేంద్ర. కొన్ని స్టార్టప్‌‌లు చూసేందుకు ఒకే రకంగా కనిపిస్తున్నా.. వాటి పనితీరులో చాలా విభిన్నత ఉంటోందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపించే భారత దేశంలో.. ఇలాంటి సమపోలికలు ఉండే స్టార్టప్స్ ఉండడం పెద్ద విచిత్రం కాదన్నది శైలేంద్ర వాదన. చర్చావేదిక కోసం ఒకే రూమ్‌లో ఉన్న ఆంట్రప్రెన్యూర్స్‌కి భిన్న రకాల మనస్తత్వాలు ఉంటాయి కదా అన్నారాయన.

బాగా ఖర్చు చేయమని ఇన్వెస్టర్లు చెబుతారా ?

స్టార్టప్‌‌లు ఎక్కువ మొత్తాన్ని వెచ్చించేలా వెంచర్ కేపిటలిస్టులు ప్రోత్సహిస్తున్నారా అంటూ చర్చావేదికలోని ఒక వ్యక్తి శైలేంద్రను ప్రశ్నించారు. దీనికి అవునని సమాధానమిచ్చిన ఆయన.. ఇంకా ఎంతస్థాయి వరకూ ఆ స్టార్టప్ నిర్మాణం పూర్తి కావలసి ఉంటుంది అనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు..

“ఒక వేళ నిధులు సేకరించకపోతే.. పోటీలో వెనకబడిపోవడం ఖాయం. ముఖ్యంగా సేవల నిర్వహణలో ఇది చాలా ముఖ్యం. డార్విన్ సిద్ధాంతాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి ”అన్నారు శైలేంద్ర.

తాను ముందు చెప్పిన అథ్లెట్స్‌‌ ఉదాహరణను మరోసారి ప్రస్తావించారు శైలేంద్ర. “ఒకవేళ మీ ఇన్వెస్టర్ పోటీకి సై అనమని చెబితే.. మీ సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు కష్టపడతారు కదా”- శైలేంద్ర

ఫ్రీఛార్జ్, హెల్ప్‌ఛాట్, జస్ట్ డయల్, ప్రాక్టో, ము సిగ్మా, పెప్పర్ ట్యాప్, జూమ్‌‌కార్ వంటి కంపెనీలన్నీ సెకోయా నుంచి సేకరించిన నిధులతో పరుగులు తీస్తున్నవే. అనుభవజ్ఞులైన, నిపుణులైన ఇన్వెస్టర్ నుంచి అందిన సలహాలు.. ఈ స్టార్టప్‌‌ల వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి.