హ్యాకింగ్‌ ఫీల్డ్‌లోనూ వెనక్కి తగ్గేదిలేదంటున్న అపూర్వ

కెరియర్ విషయంలో అమ్మాయిలు టాప్ లో ఉండాలిఎథికల్ హ్యాకింగ్ లో అపూర్వ తనదైన మార్క్ఏపిజె అబ్దుల్ కలాం స్పూర్తితో అడుగులుఅమ్మాయిలు వెనుకడుగు వేయకూడదు :అపూర్వ గిరి

హ్యాకింగ్‌ ఫీల్డ్‌లోనూ వెనక్కి తగ్గేదిలేదంటున్న అపూర్వ

Saturday May 09, 2015,

3 min Read

ఢిల్లీలోఆరోతరగతి చదువుతున్న ఓ చిన్నారికి . అప్పటి రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం ని కలిసే అవకాశం వచ్చింది. స్కూల్ పిల్లలతో కలాం ముచ్చటిస్తున్న సందర్భంగా... ఆ చిన్నారిని నువ్వేం అవుతావని అడిగితే.. క్షణం కూడా ఆలోచించకుండా లాయర్ అవుతానని చెప్పింది. ఎందుకంటే తనకి వాదించడం అంటే ఇష్టమట. మనకి ఏం ఇష్టమో దాన్నే మనం చేయాలని ఆ చిట్టితల్లికి కలాం సలహా ఇచ్చారట. కలాం చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తున్న ఆ చిన్నారే ఈ అపూర్వ.

అపూర్వ ప్రస్తుతం ఐ విజ్ సెక్యూరిటీలో భద్రతా విశ్లేషకురాలుగా పనిచేస్తోంది. రెండేళ్ల నుంచి ఇదే రంగంలో ఉన్నారామె. ఎథికల్ హ్యాకర్ . మహిళల సమాచార భద్రత కాపాడటంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు . వారి కోసమే అపూర్వ, శృతి కామత్‌తో కలిసి దీన్ని స్థాపించారు. ఎథికల్ హ్యాకరైన శృతి వివిధ భద్రతా కమ్యూనిటీలు, ఫోరంలలో పనిచేశారు. ఆమె తన తల్లిదండ్రుల నుంచి బలాన్ని ,ప్రేరణను పొందినట్టు చెబుతారు. బుక్ రీడింగ్ హాబీ. అపూర్వ వాళ్లింటిలో రెండు బుక్ షెల్ఫులుంటాయి. అందులో ఒకటి అపూర్వదైతే, వాళ్ల నాన్నగారిదొకటి. అపూర్వకు పుస్తకాలు చదవడమే ఫ్యా౦టసీ. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బుక్స్ చదువుతోంది. అపూర్వ గురించి తెలుసుకోవాలంటే ఆమె కథ చదివితే చాలు. 

అపూర్వ గిరి, ఇన్ఫోసెక్ గర్ల్స్

అపూర్వ గిరి, ఇన్ఫోసెక్ గర్ల్స్


సమాచార భద్రతా రంగంలోకి మరింత మంది మహిళలను చేర్చడానికి తన శక్తినంటనీ ధారపోస్తున్నారామె. తన సొంతూరు బెంగళూరు . ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఊర్లు మారుతుండటం వలన ఆమే చిన్న తనంలోనే దేశం మంతా తిరగవలసి వచ్చింది. అయితే ప్రధానంగా తన చదువు మాత్రం డిల్లీ ,ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయింది. ఫలితంగా ఆమె స్నేహితుల ద్వారా వివిధ భాషలలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె ఇంగ్లీష్ ,హిందీ ,తెలుగు ,కన్నడ భాషలతో పాటు కొంచెం తమిళ్ కూడా మాట్లాడుతుంది. ఆమె ఏడవతరగతి చదువుతున్నపుడు తిరిగి బెంగళూరు వచ్చేశారు. ఇక అప్పటినుంచి అక్కడే వుండిపోయారు. కాలేజీకి పోక ముందు ఆమె క్రీడలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉండేవారు. స్కూల్లో బాక్సింగ్ నేర్చుకున్నారు.

“నేను ఎంతో అభిలాషగా నాలుగేళ్ళు బాక్సింగ్ నేర్చుకొన్నాను. కొన్ని రోజులు వీణ కూడా నేర్చుకొన్నాను. కానీ దానిపై అంత పట్టు లేదు .ఎప్పటికైనా మళ్ళీ పుంజుకొంటానని నమ్మకం వుంది.” అంటారామె

అపూర్వ పి.యు. విద్యను జ్యోతి నివాస్ కాలేజీలో పూర్తిచేసి, బి.ఈ. ఇన్ఫర్మేషన్ సైన్స్‌‌ను mvj కాలేజీలో పూర్తి చేసింది. బి ఇ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుని ద్వారా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ గురించి తెలుసుకుని కోర్సును పూర్తి చేశారు. తర్వాత ఐ విజ్‌కి అప్లై చేయడం, సెలెక్ట్ కావడం టపటపా జరిగిపోయాయి. అప్పటి నుండి మళ్ళీ తిరిగి చూసిందే లేదు. 

సమాచార భద్రత కమ్యూనిటీలలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువగా వుంది. ఈ రంగంలో మహిళల సంఖ్య పెంచడానికి నేను, నా స్నేహితురాలు కలిసి ఉపక్రమించాం. అయితే అంతక ముందు ఉన్న కమ్యూనిటీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణుల విషయంలో అయోమయం నెలకొనివుంది. మాకు ఇప్పుడు బాగా పనిలో చేయితిరిగిన మనుషులు కావాలి. అప్పుడే మేము అనుకొన్నది సాధించగలమంటుంది అపూర్వ.

టెక్నాలజీకి సంబంధించి క్లాసులు చెబ్తున్న అపూర్వ

టెక్నాలజీకి సంబంధించి క్లాసులు చెబ్తున్న అపూర్వ


సమాచార భద్రత విషయంలో ఇలాంటి ఈవెంట్స్ ఇండియాలో ఇదే ప్రధమం. మేము కార్యక్రమం చేసిన ప్రతిసారీ కొత్తవారిని కలిసే అవకాశం కలిగింది. మొదటి వర్క్ షాప్ కాకన్ (COcon)లో 2014 లో చేశాం. భద్రతపై ప్రతీ ఏడాది చేసే మీటింగ్ కేరళలో చేసి తరువాత నెక్స్ట్ ఈవెంట్ మాత్రం హస్ గ్రీక్‌తో కలిసి బెంగళూరులో చేస్తాం. 

టెకీ ఫీల్డ్‌లో లేడీస్.. అంటూ మేల్ ఈగో

ఇప్పటికీ నేను నేర్చుకోవలసింది చాలా వుందని నమ్ముతాను అని వివరించారామె. మీటింగ్స్ జరుగుతున్నపుడు అపూర్వ సెకెండ్ రోలో కూర్చొనే వారు. సాంకేతిక కారణాల పై స్త్రీలు నిస్సంకోచంగా వ్యక్తం చేసే విషయాలని పరిశీలించేవారు. వాటిపై కొన్ని నమూనాలని సేకరించి వారి సమాధానం కోసం ఎదురు చూసేవారు. గదిలో పురుషులు పెద్ద గొంతుతో మాట్లాడి ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమ౦ది పురుషులు ఇతరులు అడిగిన ప్రశ్నలపై హాస్యమాడేందుకు ప్రయత్నిస్తారు. 

ఇప్పుడు అన్ని విభాగాల్లో మహిళలు పురుషులకు సమానంగా హక్కులు కలిగి వున్నారు . మేము వారికి మార్గదర్శకంగా మాత్రమే సహాయాన్ని అందిస్తున్నాం .ఒక గురువు లేకుండా ప్రారంభంలో ఎదగటం కష్టం .అందుకోసమే మేము వారికి మావంతు సహాయం అందిస్తున్నాం. 

మాకేం తక్కువ... మీరేం గొప్ప

మాకేం తక్కువ... మీరేం గొప్ప


హ్యాకింగ్‌లోనూ మేమేం తక్కువ కాదు

సొంతంగా టూల్స్ తయారు చేసిన ఇద్దరు మహిళలు తనకు తెలుసంటారు అపూర్వ గిరి. వాళ్లే అనామిక సింగ్, హర్షాల్ జందాడే. అనామిక టూల్ Wi-Hawk ఇది ఒక ఓపెన్ సోర్స్ టూల్. తప్పుడు అడ్మిన్, పాస్ వర్డ్స్ ఉపయోగించి కాన్ఫిగర్ చేసిన వాటిని పట్టుకోవటానికి, ఆడిట్ చేయటానికి ఇది పనికొస్తుంది. హర్షాల్ టూల్ XML Chor .ఇది XPATH injection వినియోగించడానికి తయారు చేసింది. వాళ్ళు చేసిన ఈ పని ఎంతో స్ఫూర్తిదాయకమైంది. మహిళలు వాళ్ళ భయాలూ, జంకూ పక్కనబెట్టి దిగితే అద్భుతాలు సృష్టించగలరు అనటానికి ఇది ఒక ఉదాహరణ .