హైదరాబాదులో పెట్టుబడులు పెట్టండి.. తమిళ పారిశ్రామికవేత్తలను కోరిన కేటీఆర్

0

దేశంలోనే అత్యుత్తమ పాలసీలకు తెలంగాణ కేంద్రమన్నారు మంత్రి కేటీఆర్. రాష్ర్టాల మధ్య పోటీతో పాటు సహకారంకూడా అవసరమన్నారు. చెన్నయ్ లో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసిన మంత్రి.. ఇండియాటుడే గ్రూప్ నిర్వహించిన ది సౌత్ ఇండియా కాంక్లేవ్ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్, మురుగప్ప, ఎమ్ఆర్‌ఎఫ్, రానే ఇంజనీరింగ్ సంస్ధలతో భేటీ అయ్యారు.

రెండు రోజుల చెన్నయ్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారు.తెలంగాణలో లాజిస్టిక్స్ రంగంలో ఇప్పటికే అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ప్రముఖ సంస్ధలు అతిపెద్ద వేర్ హౌస్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టీవీఎస్ కూడా రాష్ర్టానికి రావాలని మంత్రి ఆహ్వానించారు. బెస్ట్ మ్యాన్ పవర్ ఉన్న తెలంగాణ రాష్ర్టానికి అనేక అనుకూల అంశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీవీఎస్ గ్రూప్ కు పూర్తి సహకారం అందిస్తుందని హమీ ఇచ్చారు. జీఎస్టీ బిల్లు అమలులోకి రాగనే తమ సంస్ధ విస్తరణ ప్రణాళికలపై చర్చించేందుకు తెలంగాణకు వస్తామని టీవీయస్ సంస్ధ తెలిపింది.

తెలంగాణలో మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎంఆర్ఎఫ్ సంస్థను కోరారు మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీకి ప్రభుత్వ తరుపున ఇచ్చే సహకారంపై ఆ సంస్థ ఎండీ అరుణ్ మెమ్మెన్ కేటీఆర్‌ తోచర్చించారు. సన్మార్ గ్రూప్ అత్యున్నత ప్రతినిధి బృందంతోనూ మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాదు శివారులోఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ కోరారు.

సుందరం ఫాస్ట్ నర్స్, రానే ఇంజనీరింగ్ కంపెనీలతోనూ ఐటీ మినిస్టర్ సమావేశం అయ్యారు. మురుగప్ప గ్రూప్ మేనేజింగ్ ఛైర్మన్ వెల్లయన్ తోనూమీటయ్యారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు గ్రూప్ చేస్తున్న పలు ప్రయత్నాలపై చర్చించారు.ముఖ్యంగా అర్గానిక్ ఫార్మింగ్, యంత్రీకరణ వంటి అంశాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు గ్రూప్ ఆస్తకి చూపించింది.

మరోవైపు ఇండియాటుడే గ్రూప్ నిర్వహించిన ది సౌత్ ఇండియా కాంక్లేవ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.దక్షిణ భారతదేశంలోని రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 'Why Invest in South: The Case for Change' సెషన్ లో మంత్రి పాల్గొన్నారు. తమిళనాడు,కర్నాటకతోపాటు ఇతర రాష్ర్టాల పరిశ్రమల శాఖ మంత్రులతోపాటు పలువురు వ్యాపారవేత్తలు ఈ సెషన్ కు వచ్చారు.

హైదరాబాద్, బెంగళూర్, చెన్నయ్ లాంటి పట్టణాలు దేశ ఐటీ రంగానికి అయువు పట్టులా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఐటీతోపాటు ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన రాష్ట్రమన్నారు. కొత్తగాఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని తాము స్టార్టప్ స్టేట్ అని పిలుస్తున్నామని కేటీఆర్ అన్నారు. తాము రూపొందించిన పాలసీలను ఇతర రాష్ర్టాల అదర్శనీయంగా తీసుకుంటున్నాయని కేటీఆర్ అన్నారు.

టీఎస్ ఐపాస్ ద్వారా 15రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. ఆలస్యమైతే అందుకు కారణమైన అధికారులపై జరిమానా విధించడం ఇప్పటిదాకా ఎక్కడా లేదని గుర్తు చేశారు. పారదర్శక పాలసీల రూపకల్పనకు సింగపూర్ లాంటి దేశాలను స్ఫూర్తిగా తీసుకున్నామని కేటీఆర్ అన్నారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మెదటి ర్యాంకులో నిలవడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు కేటీఆర్. పెట్టబడులు అకర్షణ కేవలం దేశంలోని రాష్ర్టాల మధ్యనే కాదు.. ఇప్పడు దేశాల మధ్య కూడా ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు.

Related Stories

Stories by team ys telugu