పార్టీ మీరు చేసుకోండి.. డబ్బులు మేం సంపాదించుకుంటాం !

పార్టీ లవర్స్‌ కోసం పుట్టుకొచ్చిన వేదికటికెట్లతో పాటు పిక్ అండ్ డ్రాప్ క్యాబ్ సర్వీస్పార్టీ యానిమల్స్‌ను భద్రంగా ఇంటికి చేర్చే బాధ్యతపార్టీలు, ఈవెంట్స్ సమాచారమంతా ఒకే చోటటికెట్ల అమ్మకమే కాకుండా అగ్రిగేటర్‌లా వ్యవహరిస్తుందిబెంగళూరూ, పూణె, చెన్నైలో సేవలు

పార్టీ మీరు చేసుకోండి.. డబ్బులు మేం సంపాదించుకుంటాం !

Monday July 20, 2015,

3 min Read

ఓ గ్రాండ్ గాలా బర్త్‌డే పార్టీ, ఎప్పటినుంచో స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలనే యోచన, న్యూఇయర్ పార్టీలు.. ఇలా ఎన్నో వేడుకలకు మనమంతా సిద్ధమవుతూ ఉంటాం. కానీ పార్టీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే ఓపిక కొంతమందికి ఉండదు. మరికొంతమంది ఆల్కహాల్ తీసుకుని ఉండడం వల్ల సొంతంగా డ్రైవ్ చేయడం కుదరదు. ఇంకొందరు అలాంటి దుస్సాహం చేసినా ఈ మధ్య పోలీసులు ఊరుకోవడం లేదు. దీంతో పార్టీకి వెళ్దామనే ఆశ ఉన్నా లోలోపల ఉన్న ఆఫ్టర్ పార్టీ ఎఫెక్ట్ చాలామందిని వెనక్కి లాగుతోంది. కానీ ఇలాంటి సమస్యలకు పరిష్కారంతో ముందుకొచ్చింది 'ఓయ్ పార్టీ' సంస్థ.

image


ఓయ్ పార్టీ అనేది ఓ ఆన్ లైన్ కమ్యూనిటీ నైట్ లైఫ్ ప్లాట్‌ఫాం. పార్టీల తర్వాత కస్టమర్లను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు పుట్టికొచ్చిందీ సంస్థ. బెంగళూరు, పూణే,చెన్నైలో తన సేవలను మొదలుపెట్టిన సంస్థ 'రెస్పాన్సిబుల్ నైట్‌లైఫ్' పేరుతో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. వివిధ పార్టీలకు టికెట్లను బుక్ చేసుకోవడంతో పాటు క్యాబ్స్‌ను కూడా తీసుకునేందుకు ఈ సంస్థ ఉపయోగపడ్తుంది.

న్యూ ఇయర్ పార్టీల తర్వాత అనేక యాక్సిడెంట్లు జరగడాన్ని రంజన్ కుమార్ గమనించారు. ఆనందోత్సాహాలతో పార్టీ చేసుకున్న తర్వాత ఏదైనా దుర్ఘటన జరిగితే ఎంత ఇబ్బంది అనే ఆలోచన అతడికి వచ్చింది. పోలీసులు ఎన్నో చర్యలు తీసకున్నా వాటి వల్ల ఇలాంటి ప్రమాదాలకు మాత్రం పుల్ స్టాప్ పడడంలేదు. ''అందుకే పార్టీకి టికెట్లను తీసుకోవడంతో పాటు క్యాబ్ కూడా బుక్ చేసుకునేందుకు మేం ప్రోత్సహిస్తున్నాం. అయితే న్యూఇయర్ లాంటి సమయాల్లో జనాల అవసరాలను కనీసం యాభై శాతం కూడా తీర్చేందుకు ట్యాక్సీలు అందుబాటులో లేవు. బెంగళూరలో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సరైన ప్లానింగ్ లేకపోవడం, డిమాండ్ - సప్లైపై అవగాహన లేకపోవడమే'' అనేది ఓయ్ పార్టీ సీఈఓ రంజన్ కుమార్ ఆవేదన. పార్టీ టికెట్లను క్యాబ్ సేవలతో సహా బండిల్ చేసి అమ్మడమే వీళ్ల ఆలోచన. పార్టీలు, కాన్సర్ట్స్‌కు కస్టమర్లను పిక్ చేసుకుని మళ్లీ ఇంటిదగ్గర డ్రాప్ చేయడం వరకూ అంతా వీళ్లే చూసుకుంటారు. ఇయర్ ఎండింగ్స్, పార్టీ సీజన్‌లోనే ఈ సేవలు అందిస్తూ ఉంటారు.

image


కస్టమర్లే ఓనర్లు అయ్యారు !

రంజన్, బుర్హనుద్దీన్ ఇద్దరూ ఓయ్ పార్టీ వ్యవస్థాపకులు. బుర్హన్ ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదివి ఇప్పుడు సిటిఓగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరికీ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడమంటే మహా సరదా. కొత్త కొత్త స్థలాలకు వెళ్లి అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేయడమన్నా, పార్టీలకు హాజరు కావడం అంతకంటే ఎక్కువ సరదా. అయితే ఇక్కడే వీళ్లకే వ్యాపార ఆలోచన తట్టింది. పార్టీలను నిర్వహించే క్లబ్బులు... కస్టమర్లను చేరేందుకు నానా తంటాలు పడ్తుంటాయి. అదే టైంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలియక కస్టమర్లు గందరగోళంలో ఉంటారు. అందుకే ఇద్దరినీ కలిపే వేదికను తీసుకురావాలని భావించామంటారు ఓయ్ పార్టీ వ్యవస్థాపకులు. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ రెండేళ్లలో ఓ పెద్ద క్లబ్బింగ్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాంగా ఎదిగింది. బెంగళూరులో జరిగిన వివిధ ఈవెంట్ల ద్వారా 1,02,000 మంది సబ్‌స్క్రైబర్లకు సంస్థ చేరువైంది.

టికెట్లు అమ్మే సైట్లు చాలానే ఉన్నప్పటికీ.. క్లబ్బర్స్‌కు అనువైన వేదికగా దీన్ని తీర్చిదిద్దినట్టు రంజన్ చెబుతారు. పార్టీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఈవెంట్స్, ఆర్టిస్ట్స్, క్లబ్స్ వంటి సమస్త సమచారాన్ని మేం మా కస్టమర్లతో పంచుకునేందుకు వీలు కలుగుతుందని వివరిస్తున్నారు.

ప్రస్తుతానికి ఓయ్ పార్టీ ఓ నిలకడైన బిజినెస్ మోడల్‌ను రూపుందించిందని రంజన్ చెబ్తారు. ''బెంగళూరు వరకూ ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నాం. అయితే దీన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడమే ఇప్పుడు మా ముందున్న ప్రధాన సవాల్. బూట్ స్ట్రాపింగ్ చేయడం సంతోషంగానే ఉంటుంది కానీ అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. వృద్ధికి, లాభానికీ సంబంధించిన ఇబ్బందిని అన్ని స్టార్టప్స్‌లానే మేమూ ఎదుర్కొంటున్నాం. ఎప్పుడైనా వాల్యూమ్స్ పెరిగితే, మాకు ఇబ్బందులు తప్పవు'' అంటారు రంజన్.

ఓయ్ పార్టీ టీం

ఓయ్ పార్టీ టీం


ఈ సమస్యలను అధిగమించడానికి నాణ్యమైన సేవలను అందించడం ఒక్కటే పరిష్కారంగా వీళ్లు భావించారు. మంచి సర్వీస్ అందిస్తే తమ కస్టమర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్లబ్స్ నిర్వాహకులే మార్కెటింగ్ చేస్తారనే నమ్ముతున్నారు.

మాకు సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే.. పార్టీల కోసం చాలామంది సంపాదిస్తారు, కానీ మేం మాత్రం సంపాదించడానికి పార్టీలు చేస్తుంటాం. మాకు బిజనెస్ డెవలప్‌మెంట్ మీటింగ్స్, వీకెండ్ మీటింగ్స్ అన్నీ డ్యాన్స్ ఫ్లోర్లపైనే జరుగుతూ ఉంటాయి. ఏ కంపెనీకైనా ఇలాంటి కల్చర్ ఉంటుందా చెప్పండి..? (నవ్వుతూ.. )